PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/aara-mastan840772ca-00c2-4e2c-8fe8-848a874024f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/aara-mastan840772ca-00c2-4e2c-8fe8-848a874024f7-415x250-IndiaHerald.jpgఏపీ ఎన్నికల ఫలితాలలో వార్ వన్ సైడ్ అని తేలిపోయింది. వైసీపీ కనీవిని ఎరుగని ఓటమిని చూడబోతుంది. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ తనను కాపాడతాయని జగన్ భాగించగా అందుకు భిన్నంగా జరిగింది. కూటమి మేనిఫెస్టోనే అద్భుతంగా ఉందని భావించి ఏపీ ప్రజలు ఆ పార్టీకి అనుకూలంగా ఓటేశారు. సర్వే సంస్థల అంచనాలు మరోసారి పూర్తిగా తప్పాయి. కేకే సర్వే తప్ప ఏ సర్వే అంచనాలను అందుకోలేదు. aara mastan{#}ooha;war;Success;Survey;Scheduled Tribes;Andhra Pradesh;Jagan;YCPఒకే దెబ్బకు రెండు పిట్టలు.. ఆరా మస్తాన్, వేణుస్వామి కెరీర్ ముగిసినట్టేనా?ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. ఆరా మస్తాన్, వేణుస్వామి కెరీర్ ముగిసినట్టేనా?aara mastan{#}ooha;war;Success;Survey;Scheduled Tribes;Andhra Pradesh;Jagan;YCPTue, 04 Jun 2024 13:20:00 GMTఏపీ ఎన్నికల ఫలితాలలో వార్ వన్ సైడ్ అని తేలిపోయింది. వైసీపీ కనీవిని ఎరుగని ఓటమిని చూడబోతుంది. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ తనను కాపాడతాయని జగన్ భాగించగా అందుకు భిన్నంగా జరిగింది. కూటమి మేనిఫెస్టోనే అద్భుతంగా ఉందని భావించి ఏపీ ప్రజలు ఆ పార్టీకి అనుకూలంగా ఓటేశారు. సర్వే సంస్థల అంచనాలు మరోసారి పూర్తిగా తప్పాయి. కేకే సర్వే తప్ప ఏ సర్వే అంచనాలను అందుకోలేదు.
 
ఏపీ ఎన్నికల ఫలితాలతో ఆరా మస్తాన్ సైతం విశ్వసనీయత కోల్పోయారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 104 స్థానాలు లేదా అంతకు మించి స్థానాలలో వైసీపీ విజయం సాధిస్తుందని ఆయన వేసిన అంచనాలు గురి తప్పాయి. ఇకపై ఆరా మస్తాన్ సర్వేలను ప్రజలు సైతం నమ్మే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో సైతం జగన్ కు భారీ షాకులు తగిలాయనే చెప్పాలి.
 
ముస్లిం ఓటర్లు తమకు అండగా నిలబడతారని వైసీపీ భావించగా వాళ్లు కూడా ఆయనకు అండగా నిలవలేదని తెలుస్తోంది. మరోవైపు జగన్ కచ్చితంగా గెలుసాడని జాతకాలు చెబుతున్న వేణుస్వామి అంచనాలు సైతం పూర్తిస్థాయిలో తప్పాయి. తెలంగాణలో బీ.ఆర్.ఎస్ ను మించిన ఘోరమైన ఓటమి జగన్ పార్టీకి దక్కింది. ఇప్పట్లో వైసీపీ పుంజుకోవడం కష్టమని తేలిపోయింది.
 
ఓటు బదిలీలో కూటమి సక్సెస్ అయిందని అందుకే సునాయాసంగా ఆ పార్టీకి విజయం దక్కిందని తెలుస్తోంది. వైసీపీపై వ్యతిరేకత ఉన్నవాళ్లంతా కూటమికి ఓటు వేసి వైసీపీపై పగ తీర్చుకున్నారని తెలుస్తోంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా అయినా దక్కేనా అనే చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష హోదా సైతం కోల్పోతే వైసీపీ పతనానికి అదే సంకేతం అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ ఇప్పటికైనా ఊహా ప్రపంచాన్ని వీడి వాస్తవాలను అర్థం చేసుకోవాలని ఎందుకు ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడో తెలుసుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. తప్పులు తెలుసుకోకపోతే వైసీపీ ఏపీలో ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>