PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/krishnaprasad-suresh-tdp-ycp-bapatla-win899bd9e1-df30-4f59-87e7-4128ef6f2e92-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/krishnaprasad-suresh-tdp-ycp-bapatla-win899bd9e1-df30-4f59-87e7-4128ef6f2e92-415x250-IndiaHerald.jpgఏపీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో చాలా కీలకమైన పార్లమెంటు స్థానం బాపట్ల. ఈ ప్రాంతం నుంచి ఎందరో ప్రముఖులు దేశస్థాయిలో రాజకీయాలు చేశారు. గతంలో జనరల్ గా ఉన్నటువంటి బాపట్ల 2009 పునర్విభజనలో భాగంగా ఎస్సీ రిజర్వుడుగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ నందిగామ సురేష్ బరిలో ఉండగా, కూటమి అభ్యర్థిగా విశ్రాంత పోలీస్ ఆఫీసర్ టి కృష్ణ ప్రసాద్ బరిలో ఉన్నారు. ఈ లోక్సభ స్థానంలో మొత్తం 15 లక్షల 6,354 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 7,35,000, మహిళలు 7,70,978 మంది ఉన్నారు. ఈ పార్లమెంటు స్థkrishnaprasad;suresh;tdp;ycp;bapatla ;win{#}Prakasam;Lakshmi Devi;Traffic police;Bapatla;sriram;Suresh;krishna;politics;Congress;Parliment;Parliament;MP;Assembly;District;Y. S. Rajasekhara Reddy;Scheduled caste;Yevaru;Telugu Desam Party;Hanu Raghavapudi;Party;TDP;YCPబాపట్ల లోక్ సభ: సురేష్ ను ఉతికారేసిన కృష్ణ ప్రసాద్..అద్భుత విజయం.!బాపట్ల లోక్ సభ: సురేష్ ను ఉతికారేసిన కృష్ణ ప్రసాద్..అద్భుత విజయం.!krishnaprasad;suresh;tdp;ycp;bapatla ;win{#}Prakasam;Lakshmi Devi;Traffic police;Bapatla;sriram;Suresh;krishna;politics;Congress;Parliment;Parliament;MP;Assembly;District;Y. S. Rajasekhara Reddy;Scheduled caste;Yevaru;Telugu Desam Party;Hanu Raghavapudi;Party;TDP;YCPTue, 04 Jun 2024 20:46:02 GMTఏపీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో చాలా కీలకమైన పార్లమెంటు స్థానం బాపట్ల. ఈ ప్రాంతం నుంచి ఎందరో ప్రముఖులు దేశస్థాయిలో రాజకీయాలు చేశారు. గతంలో జనరల్ గా ఉన్నటువంటి బాపట్ల 2009 పునర్విభజనలో భాగంగా  ఎస్సీ రిజర్వుడుగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ నందిగామ సురేష్ బరిలో ఉండగా,  కూటమి అభ్యర్థిగా విశ్రాంత పోలీస్ ఆఫీసర్ టి కృష్ణ ప్రసాద్ బరిలో ఉన్నారు. ఈ లోక్సభ స్థానంలో మొత్తం 15 లక్షల 6,354 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 7,35,000, మహిళలు  7,70,978 మంది ఉన్నారు. ఈ పార్లమెంటు స్థానం రెండు జిల్లాల పరిధిలో ఉంది. 

బాపట్ల జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాలు, ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు దీని పరిధిలోకి వస్తుంది. 1977లో బాపట్ల నియోజకవర్గం ఏర్పాటు అయింది. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి పనబాక లక్ష్మీ విజయం సాధించారు. 2014లో తెలుగుదేశం అభ్యర్థి శ్రీరామ్ మల్యాద్రి గెలుపొందారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నందిగామ సురేష్ విజయం సాధించారు. అలాంటి ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ నుంచి కృష్ణ ప్రసాద్ వైసిపి నుంచి సిట్టింగ్ ఎంపీ నందిగామ సురేష్  హోరా హోరీగా తలపడుతున్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసిపి గాలి వీచినా బాపట్ల పార్లమెంటులో మాత్రం నాలుగు అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో  ప్రజలు ఎవరి వైపు ఉన్నారు. ఎవరికి ఎక్కువగా ఓట్లు వేశారు.

 ఇక్కడ గెలవబోయేది ఎవరు విజయం ఎవరికి వరించింది అనేది చూద్దాం.. బాపట్ల నియోజకవర్గంలో  వైసిపి పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ నందిగామ సురేష్ బరిలో ఉన్నారు. అలాగే టిడిపి కూటమి అభ్యర్థిగా  పోలీస్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్  బరిలో నిలిచారు. ఈ ఇద్దరి మధ్య హోరాహోరీగా సాగినటువంటి ఈ పోటీలో  కృష్ణ ప్రసాద్ దాదాపుగా లక్ష ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని అందుకున్నారు. దీనికి ప్రధాన కారణం సిట్టింగ్ ఎంపీ నందిగామ సురేష్ ఎంపిక గెలిచినా కానీ ఎక్కువగా జిల్లా గురించి పట్టించుకోకపోవడం తన సొంత పనులు మాత్రమే చూసుకోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది. దీంతో వీరు టిడిపి అభ్యర్థి కృష్ణ ప్రసాద్ కు ముకుమ్మడిగా ఓట్లు వేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>