PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jogeswara-rao-of-tdp-who-attacked-the-ycp-garden-and-sent-it-homed827f25a-a505-41dd-9478-b558f60f7a69-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jogeswara-rao-of-tdp-who-attacked-the-ycp-garden-and-sent-it-homed827f25a-a505-41dd-9478-b558f60f7a69-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలో కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గం ఒకటి. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ గెలవని నియోజకవర్గాలలో మండపేట ఒకటి. రాజశేఖర్ రెడ్డి వేవ్ బలంగా ఉన్న 2009లోనే మండపేటలో టీడీపీ నుంచి వేగుళ్ళ జోగేశ్వరరావు విజయం సాధించారు. ఆ తర్వాత 2014, 2019 రెండు ఎన్నికలలో ఆయన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎంత బలం ఉందో అంతకన్నా జోగేశ్వరరావుకు మంచి పేరు ఉంది. పైగా మండపేట కమ్మ సామాజిక వర్గానికి కంచుకోటగా ఉంటూ వస్తుంది. మండపేట అసెంAP-Assembly-Elections; AP-Elections-Survey ;Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections ;Assembly-Elections-2024 VEGULLA JOGESWARA RAO Add a tag{#}Pilli Subhash Chandra Bose;Rajya Sabha;Mandapeta;dr rajasekhar;Jagan;THOTA TRIMURTHULU;Thota Chandrasekhar;Minister;Janasena;Party;Telugu Desam Party;Hanu Raghavapudi;TDP;YCPమండ‌పేట : వైసీపీ తోటను జోకొట్టి ఇంటికి పంపేసిన టీడీపీ జోగేశ్వ‌ర‌రావుమండ‌పేట : వైసీపీ తోటను జోకొట్టి ఇంటికి పంపేసిన టీడీపీ జోగేశ్వ‌ర‌రావుAP-Assembly-Elections; AP-Elections-Survey ;Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections ;Assembly-Elections-2024 VEGULLA JOGESWARA RAO Add a tag{#}Pilli Subhash Chandra Bose;Rajya Sabha;Mandapeta;dr rajasekhar;Jagan;THOTA TRIMURTHULU;Thota Chandrasekhar;Minister;Janasena;Party;Telugu Desam Party;Hanu Raghavapudi;TDP;YCPTue, 04 Jun 2024 19:12:24 GMTఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలో కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గం ఒకటి. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ గెలవని నియోజకవర్గాలలో మండపేట ఒకటి. రాజశేఖర్ రెడ్డి వేవ్ బలంగా ఉన్న 2009లోనే మండపేటలో టీడీపీ నుంచి వేగుళ్ళ జోగేశ్వరరావు విజయం సాధించారు. ఆ తర్వాత 2014, 2019 రెండు ఎన్నికలలో ఆయన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎంత బలం ఉందో అంతకన్నా జోగేశ్వరరావుకు మంచి పేరు ఉంది. పైగా మండపేట కమ్మ సామాజిక వర్గానికి కంచుకోటగా ఉంటూ వస్తుంది. మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మండపేట మున్సిపాలిటీ తో పాటు మండపేట రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు విస్తరించి ఉన్నాయి.


అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మండపేటలో జోగేశ్వరరావుకు కొత్త ప్రత్యర్థి ఎదురయ్యారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి వైసీపీ ప్రస్తుత రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పై ఏకంగా 11 వేల ఓట్ల మెజార్టీతో జోగేశ్వరరావు గెలిచారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన వేగుళ్ల‌ లీలా కృష్ణకు ఏకంగా 35 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు జనసేన పొత్తు నేపథ్యంలో ఆ 35 వేల ఓట్లు ఇటు జోగేశ్వరరావుకు గత ఎన్నికల్లో వచ్చిన పదివేల ఓట్లు మెజార్టీ కలిస్తే 45 వేల వరకు మెజార్టీ వస్తుందన్న అంచనాలు ముందే వచ్చేసాయి.


అయితే ఇక్కడ వైసీపీ ఒక చిన్న ఎత్తుగడ వేసింది. రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ ఇచ్చి ఎప్పుడో మూడేళ్ల క్రితమే ఆయనకు మండపేట పగ్గాలు ఇచ్చింది. మండపేటలో కాపు సామాజిక వర్గాన్ని చీలగొట్టి జోగేశ్వరరావును త్రిమూర్తుల ద్వారా ఓడించాలన్నదే జగన్ ప్లాన్. ఎన్నికల ప్రచారానికి ముందు ఎన్నికల ప్రచారం తర్వాత జరిగిన పరిణామాలను బట్టి చూస్తే తోట త్రిమూర్తులు జోగేశ్వరరావు ముందు తేలిపోయారని.. ఆయన ఓటమి ఖాయం అన్న అంచనాలే ఎక్కువగా వినిపించాయి. తోట త్రిమూర్తులు బలం అంతా రామచంద్రపురంలో అని మండపేటలో ఆయనకు అంత సీన్ లేదని తేలిపోయింది ఈరోజు జరిగిన కౌంటింగ్ లో 44435 ఓట్ల మెజార్టీతో జోగేశ్వ‌ర‌రావు గెలిచి వ‌రుస‌గా నాలుగోసారి ఘ‌న‌విజ‌యం సాధించారు. ఆయ‌న కెరీర్‌లో ఇదే భారీ రికార్డ్ మెజార్టీగా నిలిచింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>