PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-victory-there-for-the-second-time-rajolu-gadda-pawan-addara84bf7038-b146-45a2-a221-68a9d596323d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-victory-there-for-the-second-time-rajolu-gadda-pawan-addara84bf7038-b146-45a2-a221-68a9d596323d-415x250-IndiaHerald.jpg2019 ఎన్నికలలో రాజోలు నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ లోనే ఒక ప్రత్యేకత ఉంది. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన జనసేనకు ఆ ఎన్నికలు ఎంతో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. పార్టీ అధినేత పోటీ చేసిన రెండు నియోజకవర్గాలలో ఆయన ఓడిపోయారు. జనసేన రాష్ట్రం మొత్తం మీద గెలిచిన ఏకైక నియోజకవర్గంగా రాజోలు రికార్డుల్లో నిలిచింది. ఇంకా చెప్పాలి అంటే జనసేన తరఫున తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఎమ్మెల్యేగా గత ఎన్నికలలో ఇక్కడ నుంచి గెలిచిన రాపాక వరప్రసాదరావు రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ఆయన కొద్ది రోజులకే వైసీపీకap elections 2024; Andhra Pradesh Assembly elections 2014; andhra assembly election results 2024; ap elections 2024 result; chandrababu naidu; pawan kalyan; ys.jagan{#}RAPAKA VARA PRASADA RAO;SakhinetiPalli;Rajolu;Kshatriya;Scheduled caste;kalyan;Minister;Janasena;Elections;Telugu Desam Party;YCP;Andhra Pradesh;Partyఅక్క‌డ జ‌న‌సేన రెండోసారి విక్ట‌రీ... రాజోలు గ‌డ్డ ప‌వ‌న్ అడ్డారా ...!అక్క‌డ జ‌న‌సేన రెండోసారి విక్ట‌రీ... రాజోలు గ‌డ్డ ప‌వ‌న్ అడ్డారా ...!ap elections 2024; Andhra Pradesh Assembly elections 2014; andhra assembly election results 2024; ap elections 2024 result; chandrababu naidu; pawan kalyan; ys.jagan{#}RAPAKA VARA PRASADA RAO;SakhinetiPalli;Rajolu;Kshatriya;Scheduled caste;kalyan;Minister;Janasena;Elections;Telugu Desam Party;YCP;Andhra Pradesh;PartyTue, 04 Jun 2024 18:57:48 GMT2019 ఎన్నికలలో రాజోలు నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ లోనే ఒక ప్రత్యేకత ఉంది. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన జనసేనకు ఆ ఎన్నికలు ఎంతో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. పార్టీ అధినేత పోటీ చేసిన రెండు నియోజకవర్గాలలో ఆయన ఓడిపోయారు. జనసేన రాష్ట్రం మొత్తం మీద గెలిచిన ఏకైక నియోజకవర్గంగా రాజోలు రికార్డుల్లో నిలిచింది. ఇంకా చెప్పాలి అంటే జనసేన తరఫున తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఎమ్మెల్యేగా గత ఎన్నికలలో ఇక్కడ నుంచి గెలిచిన రాపాక వరప్రసాదరావు రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ఆయన కొద్ది రోజులకే వైసీపీకి దగ్గరయ్యారు.


ఈ ఎన్నికలలో రాపాక అమలాపురం నుంచి వైసీపీ తరఫున పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. రాజోలు నియోజకవర్గంలో రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాలతో పాటు మామిడికుదురు మండలంలోని కొన్ని గ్రామాలు విస్తరించి ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో క్షత్రియ సామాజిక వర్గం రాజకీయంగా ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తోంది. అలాగే కాపులు, శెట్టిబలిజ సామాజిక వర్గాల తో పాటు ఎస్సీ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఇక్కడ అభ్యర్థులు మారారు.


గత ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి ఓడిపోయి మూడోస్థానంతో సరిపెట్టుకున్న మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు.. ఈసారి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇక జనసేన నుంచి మాజీ ఐఏఎస్ అధికారి దేవవరప్రసాద్ పోటీ చేశారు. గత ఎన్నికలలో రాష్ట్ర మొత్తం మీద జనసేన గెలిచిన ఏకైక నియోజకవర్గం కావడంతో పవన్ కళ్యాణ్ గట్టిగా కాన్సన్ట్రేషన్ చేశారు. పైగా టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో రాజోలులో.. జనసేన ఘనవిజయం సాధిస్తుందన్న అంచనాలు ఉండాలి... అయితే గొల్లపల్లి చివర్లో వైసీపీలోకి వెళ్లి పోటీ చేయడంతో పాటు... ఆయ‌న సీనియ‌ర్ కావ‌డం... సానుభూతి ఉండ‌డంతో ట‌ఫ్ ఫైట్ న‌డిచింది.


ఇక గట్టి పోటీ మధ్యలో జనసేన గెలుస్తుంది అన్న ప్రచారం నడిచింది. ఈరోజు జరిగిన కౌంటింగ్ లో 39011 ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. మొత్తానికి జ‌న‌సేన మ‌రోసారి రాజోలులో జెండా ఎగ‌రేసింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>