PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/madanapalleca94a042-a816-40be-a9ab-5ce76b019060-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/madanapalleca94a042-a816-40be-a9ab-5ce76b019060-415x250-IndiaHerald.jpgఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె నియోజకవర్గం ఏపీలోని ప్రజలకు దాదాపుగా సుపరిచితం. టమోటాలు, పూల వ్యాపారానికి ఈ నియోజకవర్గం సుపరిచితమైన నియోజకవర్గం కాగా ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన వైసీపీ, కూటమి మైనార్టీ అభ్యర్థులకు టికెట్లను కేటాయించడం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషాకు బదులుగా వైసీపీ నిస్సార్ అహ్మద్ కు టికెట్ ఇచ్చింది. నిస్సార్ అహ్మద్ రిటైర్డ్ పంచాయితీరాజ్ ఉద్యోగి కావడం గమనార్హం. madanapalle{#}Madanapalle;Chittoor;MLA;ahmed;Congress;YCPమదనపల్లె మహావీరుడెవరో తేలిపోయిందిగా.. ఆ అభ్యర్థినే అందలమెక్కించారా!మదనపల్లె మహావీరుడెవరో తేలిపోయిందిగా.. ఆ అభ్యర్థినే అందలమెక్కించారా!madanapalle{#}Madanapalle;Chittoor;MLA;ahmed;Congress;YCPTue, 04 Jun 2024 18:53:00 GMTఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె నియోజకవర్గం ఏపీలోని ప్రజలకు దాదాపుగా సుపరిచితం. టమోటాలు, పూల వ్యాపారానికి ఈ నియోజకవర్గం సుపరిచితమైన నియోజకవర్గం కాగా ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన వైసీపీ, కూటమి మైనార్టీ అభ్యర్థులకు టికెట్లను కేటాయించడం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషాకు బదులుగా వైసీపీ నిస్సార్ అహ్మద్ కు టికెట్ ఇచ్చింది. నిస్సార్ అహ్మద్ రిటైర్డ్ పంచాయితీరాజ్ ఉద్యోగి కావడం గమనార్హం.
 
ఈ నియోజకవర్గంలో కూటమి తరపున నవాజ్ బాషా సోదరుడు షాజహాన్ బాషా బరిలో దిగారు. 2009 సంవత్సరంలో షాజహాన్ బాషా కాంగ్రెస్ నుంచి మదనపల్లె తరపున పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. అయితే నవాజ్ బాషాపై మదనపల్లె ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆ ప్రభావం షాజహాన్ బాషాపై పడిందో లేదో ఈ ఎన్నికల ఫలితంతో క్లారిటీ వచ్చేసింది. ఆ ప్రభావం అతనిపై ఏ మాత్రం పడలేదు.
 
మదనపల్లె ఎమ్మెల్యేగా షాజహాన్ బాషా ఘన విజయం సాధించారు. 4119 ఓట్ల మెజారిటీతో నిస్సార్ అహ్మద్ పై ఆయన విజయం సాధించడం గమనార్హం. వైసీపీకి పట్టు ఉన్న నియోజకవర్గాల్లో మదనపల్లె ఒకటి కాగా ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి భారీ షాక్ తగిలింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, కూటమి ప్రకటించిన హామీలు షాజహాన్ బాషాకు ప్లస్ అయ్యాయి.
 
2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా పని చేసిన షాజహాన్ బాషా మరోమారు నియోజకవర్గ ప్రజలు తనను గెలిపించడంతో ఎంతో సంతోషిస్తున్నారు. నియోజకవర్గంలో షాజహాన్ బాషాపై కొన్ని విమర్శలు ఉన్నా ప్రజల ఆదరాభిమానాలను చూరగొని ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించడం గమనార్హం. షాజహాన్ బాషా గెలుపుతో నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్నంటాయి. షాజహాన్ బాషా నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టి మంచి పనులు చేస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో ఆయనకే ప్రజలు పట్టం కట్టే ఛాన్స్ ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని షాజహాన్ సద్వినియోగం చేసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>