PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bastipati-nagaraju7c306324-9779-4c7e-8be4-2fde36d49f3b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bastipati-nagaraju7c306324-9779-4c7e-8be4-2fde36d49f3b-415x250-IndiaHerald.jpgకర్నూలు జిల్లా వైసీపీ కంచుకోట అని ఆ పార్టీ నేతలు భావిస్తారు. కర్నూలు లోక్ సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ సీట్లు ఉండగా నంద్యాల లోక్ సభ నియోజకవర్గం పరిధిలో సైతం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలతో పాటు కర్నూలు, నంద్యాల ఎంపీ స్థానాలలో వైసీపీ సునాయాసంగా విజయం సాధించిందనే సంగతి తెలిసిందే. bastipati nagaraju{#}Kurnool;Nandyala;Nijam;Indian Postal Service;local language;Success;Assembly;District;Party;media;TDP;YCPహోరాహోరీ పోరులో కర్నూలు ఎంపీగా అయనే.. లెక్క ఏ మాత్రం మారలేదుగా!హోరాహోరీ పోరులో కర్నూలు ఎంపీగా అయనే.. లెక్క ఏ మాత్రం మారలేదుగా!bastipati nagaraju{#}Kurnool;Nandyala;Nijam;Indian Postal Service;local language;Success;Assembly;District;Party;media;TDP;YCPTue, 04 Jun 2024 21:10:00 GMTకర్నూలు జిల్లా వైసీపీ కంచుకోట అని ఆ పార్టీ నేతలు భావిస్తారు. కర్నూలు లోక్ సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ సీట్లు ఉండగా నంద్యాల లోక్ సభ నియోజకవర్గం పరిధిలో సైతం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలతో పాటు కర్నూలు, నంద్యాల ఎంపీ స్థానాలలో వైసీపీ సునాయాసంగా విజయం సాధించిందనే సంగతి తెలిసిందే.
 
ఈ ఎన్నికల విషయానికి వస్తే టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బస్తీపాటి నాగరాజు, వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బీవై రామయ్య పోటీ చేయడం జరిగింది. అయితే హోరాహోరీ పోరులో కర్నూలు ఎంపీగా వైసీపీ ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య గెలుస్తారని ప్రచారం జరగగా ఎట్టకేలకు ఆ ప్రచారం నిజం కాలేదు. మారిన పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో కూటమి అభ్యర్థి అయిన బస్తిపాటి నాగరాజు ఎంపీగా విజయం సాధించడం విశేషం.
 
అర్బన్ ఓటర్లు అండగా నిలవడం వల్లే బస్తిపాటి నాగరాజు విజయం సాధించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లక్షా 2 వేల 822 ఓట్లతో నాగరాజు బీవై రామయ్యపై ఘన విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ నుంచి ప్రతి రౌండ్ లో ఆధిక్యత కొనసాగుతూ ఉండటం బీవై రామయ్యకు ఊహించని విధంగా కలిసొచ్చింది. నాగరాజు విజయంతో టీడీపీ శ్రేణులు ఎంతో సంతోషిస్తున్నారు.
 
బస్తీపాటి నాగరాజు ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి కాగా స్థానిక ప్రజలు ఆయనను పంచలింగాల నాగరాజుగా పిలుస్తారు. గతంలో ఆయన లెక్చరర్ గా పని చేయడంతో పాటు వ్యాపారంలో సైతం సక్సెస్ సాధించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వమే ఆయనను గెలిపించిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. కర్నూలు లోక్ సభ నియోజకవర్గంలో నాగరాజు సత్తా చాటడం గమనార్హం.  నాగరాజు తను గెలవడంతో జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాల్లో కూటమిని గెలిపించుకోవడం విశేషం.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>