PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-pm-modi-trails-by-over-votescf9302c8-787d-4b4f-ae83-602a24e97f57-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-pm-modi-trails-by-over-votescf9302c8-787d-4b4f-ae83-602a24e97f57-415x250-IndiaHerald.jpgభారతదేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల ఫలితాలు రిలీజ్ అవుతున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం దాకా ఇప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఫలితాలు వస్తూనే ఉన్నాయి. అయితే 400 సీట్లు దాటుతాయని ప్రగల్బాలు పలికిన బిజెపి పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ మాత్రమే దాటేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం... 290 స్థానాలలో ఎన్డీఏ కూటమి లీడింగ్ లో ఉంది. modi{#}Tamilnadu;Evening;Naveen Patnaik;Ayodhya;Uttar Pradesh;India;Prime Minister;News;Parliament;Manam;Yevaru;Government;Bharatiya Janata Party;Congress;Partyఇండియా కూటమి దెబ్బ... మోడీ సంచలన నిర్ణయం ?ఇండియా కూటమి దెబ్బ... మోడీ సంచలన నిర్ణయం ?modi{#}Tamilnadu;Evening;Naveen Patnaik;Ayodhya;Uttar Pradesh;India;Prime Minister;News;Parliament;Manam;Yevaru;Government;Bharatiya Janata Party;Congress;PartyTue, 04 Jun 2024 15:40:16 GMT

భారతదేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల ఫలితాలు రిలీజ్ అవుతున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం దాకా ఇప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఫలితాలు వస్తూనే ఉన్నాయి. అయితే 400 సీట్లు దాటుతాయని ప్రగల్బాలు పలికిన బిజెపి పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ మాత్రమే దాటేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం... 290 స్థానాలలో ఎన్డీఏ కూటమి లీడింగ్ లో ఉంది.

 అయితే ఎవరు ఊహించని విధంగా ఇండియా కూటమి 230 స్థానాలలో లీడింగ్ సంపాదించడం ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది. గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ప్రభావం చూపించలేకపోయింది. కానీ మోడీ 10 సంవత్సరాల పరిపాలన నేపథ్యంలో... భారతదేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే 290 స్థానాల వరకే  ఎన్డీఏ కూటమి ఆగిపోయేలా కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా... గతంలో కంటే బలంగాఆ ప్రభుత్వం ఉండే ఛాన్స్ ఉండదు.

 ఏది ఏమైనా అధికారిక లెక్కల ప్రకారం... ఎన్డీఏ కూటమి  మరోసారి అధికారంలోకి వచ్చేలాగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర మీటింగ్ కు కీలక ఆదేశాలు ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ నేపథ్యంలోనే సాయంత్రం ఏడు గంటల సమయంలో.... ఢిల్లీలోని బిజెపి పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో... బిజెపి అగ్రనేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారట ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా గెలిచిన ఎంపీలను కాపాడుకోవడం... అలాగే... మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై... బిజెపి అగ్ర నేతలతో చర్చలు నిర్వహించనున్నారట ప్రధాని నరేంద్ర మోడీ.

 ఈ మేరకు ఇప్పటికే బీజేపీ ఎంపీలకు కీలక ఆదేశాలు వెళ్లాయట. ఇది ఇలా ఉండగా... తమిళనాడు రాష్ట్రంలో బిజెపి పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ తమిళనాడు రాష్ట్రంలో... ఖాతా తెరవకుండానే బిజెపి పార్టీ కథ ముగించేసింది. ఇటు అయోధ్య రామ మందిరం నిర్మించిన ఉత్తర ప్రదేశ్ లో కూడా.... బిజెపి పార్టీపై ఇండియా కూటమి లీడ్ కొనసాగుతోంది. కానీ ఒడిస్సా రాష్ట్రంలో మాత్రం నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని... బిజెపి పార్టీ పడగొట్టేలా కనిపిస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>