PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-talk-ycp-loss3927413f-2584-4f3b-8f02-706d80242bce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-talk-ycp-loss3927413f-2584-4f3b-8f02-706d80242bce-415x250-IndiaHerald.jpgతాజాగా ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. కేవలం 10 సీట్ల మెజారిటీతో అత్యంత దారుణంగా వైసిపి పార్టీ ఓడిపోవడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక తాజాగా ప్రెస్ మీట్ లో మొదటిసారి స్పందించిన జగన్ మోహన్ రెడ్డి.. మంచి చేసినా ఓడిపోయాను అంటూ గుండెలవిషేలా ఆవేదన వ్యక్తం చేశారు. 175 సీట్లలో కేవలం 10 సీట్లు మాత్రమే దక్కించుకోవడం.. ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి కూడా వెళ్లలేకపోవడం ఇంతకంటే దారుణం మరెక్కడ ఉండదేమో... తాను ఎన్నో మంచి పనులు చేశానని.. సామాజిక వర్గాలకు భేద భావం లేకుండా అందరికీ సమన్JAGAN;TALK;YCP;LOSS{#}Two-wheeler drivers;Press;Driver;Jagan;Reddy;YCP;Andhra Pradeshమంచి చేసినా ఓడిపోయాను.. ఎన్నికల్లో ఓటమిపై జగన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే!మంచి చేసినా ఓడిపోయాను.. ఎన్నికల్లో ఓటమిపై జగన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే!JAGAN;TALK;YCP;LOSS{#}Two-wheeler drivers;Press;Driver;Jagan;Reddy;YCP;Andhra PradeshTue, 04 Jun 2024 18:53:13 GMTతాజాగా ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. కేవలం 10 సీట్ల మెజారిటీతో అత్యంత దారుణంగా వైసిపి పార్టీ ఓడిపోవడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక తాజాగా ప్రెస్ మీట్ లో మొదటిసారి స్పందించిన జగన్ మోహన్ రెడ్డి.. మంచి చేసినా ఓడిపోయాను అంటూ గుండెలవిషేలా ఆవేదన వ్యక్తం చేశారు. 175 సీట్లలో కేవలం 10 సీట్లు మాత్రమే దక్కించుకోవడం.. ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి కూడా వెళ్లలేకపోవడం ఇంతకంటే దారుణం మరెక్కడ ఉండదేమో... తాను ఎన్నో మంచి పనులు చేశానని.. సామాజిక వర్గాలకు భేద భావం లేకుండా అందరికీ సమన్యాయం చేశానని.. తాను చేసిన మంచిపనే తనను ఓడించింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జగన్ మోహన్ రెడ్డి.

తాజాగా ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మొదటి మాట అక్కచెల్లెమ్మల గురించి.. ఆయన మాట్లాడుతూ.. అమ్మ ఒడి అందుకున్న అక్కాచెల్లెళ్లు ఓట్లు ఏమయ్యాయో తెలీదు.. అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు.. మొత్తం 53 లక్షల మంది మహిళలకు అమ్మ ఒడి వేశాను... ఫలితాలు చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది.. ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు.. ఇలాంటి ఫలితాలు వస్తాయని నేను ఊహించలేదు.. మహిళలకు సంక్షేమ పథకాలు అందించాము..  వారి ఓట్లు ఏమయ్యాయో తెలియదు.. మొత్తం కోటి 5 లక్షల మందికి సంక్షేమ పథకాలు అందించాము.. అవ్వ తాతలు చూపిన ఆప్యాయత ఏమైందో తెలియదు.. చేయూత అందుకున్న అక్క చెల్లెమ్మల ఆప్యాయత ఏమైందో తెలియదు..


ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు మత్స్యకారులు ఇలా నా సోదరులంతా ఏమయ్యారో తెలియదు.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతోమందికి , ఎన్నో కుటుంబాలకు ఆర్థిక సహాయంతో పాటు సంక్షేమ పథకాల లబ్ధి అందించేలా చేశాను.. వీరంతా ఏమయ్యారో తెలియదు... అసలు ఉన్నారా ఉండి.. పట్టనట్టు వ్యవహరించారా?  అన్నది అర్థం కావడం లేదు... అంటూ బాధను దిగమింగుకుంటూ దుఃఖాన్ని బయటకు కనిపించకుండా జాగ్రత్త పడుతూ ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొనడం చూసి చాలామంది వైసిపి శ్రేణులు రోదిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>