PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/guntur-west-vidadala-rajini-galla-madhavi-tdp-ycp0c519ca8-4779-4fd4-8242-45ede36e7dc9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/guntur-west-vidadala-rajini-galla-madhavi-tdp-ycp0c519ca8-4779-4fd4-8242-45ede36e7dc9-415x250-IndiaHerald.jpgప్రస్తుతం గుంటూరు జిల్లాలోని మరో కీలకమైన నియోజకవర్గం గుంటూరు వెస్ట్ అని చెప్పవచ్చు. ఈ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగాయి. రాష్ట్రంలోనే ఎంతో కీలకమైన ఈ నియోజకవర్గంలో ఇద్దరు బీసీ నేతలు బరిలో ఉన్నారు. వారు కూడా ఇద్దరు బలమైన మహిళ నేతలే. అలాంటి వారిలో ఐదు సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంత్రి స్థాయికి ఎదిగిన విడుదల రజిని ఓవైపు ఉంటే, మరోవైపు మొదటిసారి పోటీ చేస్తున్న పిడుగురాళ్ల మాధవి ఉన్నారు. ఈ విధంగా గుంటూరు పశ్చిమలో ఒకరికొకరు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ఎవరికి ఎవరు తీGUNTUR WEST;VIDADALA RAJINI;GALLA MADHAVI;TDP;YCP{#}Piduguralla;madhavi;Guntur;Backward Classes;Yevaru;history;Minister;TDP;Elections;Telugu Desam Party;YCPగుంటూరు వెస్ట్: టిడిపిని "గల్లా" ఎగిరేసుకునేలా చేసిన మాధవి..!గుంటూరు వెస్ట్: టిడిపిని "గల్లా" ఎగిరేసుకునేలా చేసిన మాధవి..!GUNTUR WEST;VIDADALA RAJINI;GALLA MADHAVI;TDP;YCP{#}Piduguralla;madhavi;Guntur;Backward Classes;Yevaru;history;Minister;TDP;Elections;Telugu Desam Party;YCPTue, 04 Jun 2024 18:39:39 GMT ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని మరో కీలకమైన నియోజకవర్గం గుంటూరు  వెస్ట్ అని చెప్పవచ్చు. ఈ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగాయి. రాష్ట్రంలోనే ఎంతో కీలకమైన ఈ నియోజకవర్గంలో ఇద్దరు బీసీ నేతలు బరిలో ఉన్నారు. వారు కూడా ఇద్దరు బలమైన మహిళ నేతలే. అలాంటి వారిలో ఐదు సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంత్రి స్థాయికి ఎదిగిన విడుదల రజిని ఓవైపు ఉంటే, మరోవైపు మొదటిసారి పోటీ చేస్తున్న పిడుగురాళ్ల మాధవి ఉన్నారు. ఈ విధంగా గుంటూరు పశ్చిమలో ఒకరికొకరు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ఎవరికి ఎవరు తీసిపోకుండా ప్రచారం నిర్వహించారు. మొత్తం 2,78,000 మంది ఓటర్లు ఉన్నారు.

 అందులో 1,35,000 పురుషులు 1,42,000 మహిళలు.  ఇక్కడ టిడిపి టికెట్ కోసం దాదాపు డజన్ మంది పోటీ పడ్డారు కానీ అనూహ్యంగా కొత్త అభ్యర్థి అయిన పిడుగురాళ్ల మాధవికి టికెట్ ఖరారు చేశారు చంద్రబాబు. ఈమె వైద్యరంగం, వ్యాపారాలు నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రజక సామాజిక వర్గానికి చెందిన మాధవికి ఇక్కడ టికెట్ ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎక్కువ సపోర్ట్ చేస్తుందని అంశం కూడా తెరపైకి వచ్చింది. సీటు ప్రకటించినప్పటి నుంచి మాధవి ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు వైసీపీ నేత  విడుదల రజని  దాదాపు ఆరునెలల ముందు నుంచే ఈ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తూ వచ్చింది.

టికెట్   ప్రకటించే సమయానికి ఆమె నియోజకవర్గం మొత్తం ఒకసారి ప్రచారం చేసింది. ఈ విధంగా గుంటూరులో ఇద్దరు బీసీ మహిళ నేతల మధ్య ఏర్పడిన ఈ పోరులో ప్రజలు ఎవరికి పట్టం కట్టారనేది ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది చూద్దాం. అలాంటి ఇక్కడ కూటమి అభ్యర్థి గల్ల మాధవి 1,13,012 ఓట్లు సాధించింది.  వైసిపి అభ్యర్థి విడుదల రజిని 63290 ఓట్లు సాధించింది. ఇదే తరుణంలో గల్లా మాధవి రజినిపై 49722 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ఒక మంత్రిని కొత్త అభ్యర్థిని ఓడించడం అంటే చరిత్ర సృష్టించినట్టే. దీంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లోని టిడిపి కార్యకర్తలంతా గల్లా మాధవిని చూసి గల్లలు ఎగిరేసుకుంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>