PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rajahmundry-the-rajas-reignade12ca8-7b3c-40f5-aa90-ddddb3b543d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rajahmundry-the-rajas-reignade12ca8-7b3c-40f5-aa90-ddddb3b543d2-415x250-IndiaHerald.jpgపోయిన నెల 13 వ తేదీన జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం నుండి ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే మే 13 వ తేదీన ఎలక్షన్స్ పూర్తి అయిన తర్వాత నుండి ఎంతో మంది ఎన్నో నివేదికలను విడుదల చేస్తూ వస్తున్నారు. ఆ పార్టీ ఇన్ని సీట్లను సాధించుకొని అధికారంలోకి రాబోతుంది. ఈ పార్టీ ఇన్ని సీట్లను సాధించి అధికారంలోకి రాబోతుంది అని అనేక వేదికలను విడుదల చేశాయి. కానీ వాటన్నిటిని నమ్మాలో లేదో ప్రజలకే అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే ఈ రోజు తుది నిర్ణయం రాబోతుంది. ఉదయం 6 గంటలకుtdp{#}DHARMANA PRASADA RAO;shankar;Election;Indian Postal Service;Srikakulam;Party;Telugu Desam Party;YCPశ్రీకాకుళం అసెంబ్లీలో టీడీపీ జెండా... ఏకంగా అన్ని వేల ఓట్ల మెజారిటీ..!శ్రీకాకుళం అసెంబ్లీలో టీడీపీ జెండా... ఏకంగా అన్ని వేల ఓట్ల మెజారిటీ..!tdp{#}DHARMANA PRASADA RAO;shankar;Election;Indian Postal Service;Srikakulam;Party;Telugu Desam Party;YCPTue, 04 Jun 2024 18:05:37 GMTపోయిన నెల 13 వ తేదీన జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం నుండి ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే మే 13 వ తేదీన ఎలక్షన్స్ పూర్తి అయిన తర్వాత నుండి ఎంతో మంది ఎన్నో నివేదికలను విడుదల చేస్తూ వస్తున్నారు. ఆ పార్టీ ఇన్ని సీట్లను సాధించుకొని అధికారంలోకి రాబోతుంది. ఈ పార్టీ ఇన్ని సీట్లను సాధించి అధికారంలోకి రాబోతుంది అని  అనేక వేదికలను విడుదల చేశాయి.

కానీ వాటన్నిటిని నమ్మాలో లేదో ప్రజలకే అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే ఈ రోజు తుది నిర్ణయం రాబోతుంది. ఉదయం 6 గంటలకు ప్రారంభం అయిన ఓట్ల లెక్కింపులో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఇక ఆ తర్వాత ఈవిఏం ఓట్లను లెక్కించడం మొదలు పెట్టారు. అందులో భాగంగా మధ్యాహ్నం నుండే కొన్ని చిన్న చిన్న నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు విడుదల అవుతున్నాయి.

ఇకపోతే తాజాగా శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించిన ఫలితం వెలువడింది. మొదటి నుండి ఈ నియోజకవర్గం లో ప్రధాన పార్టీలు చాలా ఇంట్రెస్ట్ చూపిన విషయం మన అందరికీ తెలిసిందే. దానితో ఈ నియోజకవర్గంలో భారీ పోరు ఉండబోతున్నట్లు ప్రజలు మొదటి నుండే ఊహించారు. ఇక ఈ ప్రాంతం నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు పోటీలో ఉండగా , కూటమి నుండి గుండు శంకర్ బరిలో ఉన్నారు. ఇక వీరిద్దరు కూడా చాలా రోజుల పాటు ఈ ప్రాంతంలో ప్రచారాలను చేశారు.

దానితో వీరి మధ్య గట్టి పోటీ ఉంటుంది అని ఇక్కడ జనాలు అనుకున్నారు. కానీ అలాంటి పరిస్థితులు ఏమాత్రం ఇక్కడ కనబడలేదు. మొదటి నుండే తెలుగు దేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి గోండు శంకర్ లీడ్ లోకి వెళ్లిపోయారు. దానితో ఈయనకు ఏకంగా 113455 ఓట్లు వచ్చాయి. ఇక వైసిపి అభ్యర్థి అయినటువంటి ధర్మాన ప్రసాద రావు కి కేవలం 62,862 ఓట్లు మాత్రమే వచ్చాయి. దానితో శంకర్ , ప్రసాదరావు పై 50593 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>