PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rahul-gandhi-modi-adani-india-kutami-nda-kutami-mallikharjuna-kharge542e9815-010f-4370-8a30-28d2897a0c73-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rahul-gandhi-modi-adani-india-kutami-nda-kutami-mallikharjuna-kharge542e9815-010f-4370-8a30-28d2897a0c73-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల రిజల్ట్స్ బయటకు వచ్చాయి. ఈ రిజల్ట్ లో బిజెపి అనుకున్నంత ఫలితాన్ని సాధించ లేకపోయింది. వారు 400 కి పైగా సీట్లు సాధిస్తామని అనుకున్నారు. కానీ వారి ఆలోచనలను ఇండియా కూటమి తిప్పి కొట్టిందని చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దాదాపుగా 300 సీట్లకు దగ్గరగా వస్తే ఇండియా కూటమి 233 సీట్లకు పైగా దూసుకుపోతోంది. అదర్స్ 18 స్థానాల్లో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ అధినేతలు రాహుల్ గాంధీ,మల్లికార్జున ఖర్గేలు ఆసక్తికరమైనటువంటి వRAHUL GANDHI;MODI;ADANI;INDIA KUTAMI;NDA KUTAMI;MALLIKHARJUNA KHARGE{#}CBI;Amith Shah;Rahul Gandhi;rahul;Rahul Sipligunj;Telangana Chief Minister;war;India;media;Bharatiya Janata Party;Party;Congressరాహుల్ గాంధీ:ఎన్నికల్లో మోదీతోపాటు అదాని కూడా ఓడారు.!రాహుల్ గాంధీ:ఎన్నికల్లో మోదీతోపాటు అదాని కూడా ఓడారు.!RAHUL GANDHI;MODI;ADANI;INDIA KUTAMI;NDA KUTAMI;MALLIKHARJUNA KHARGE{#}CBI;Amith Shah;Rahul Gandhi;rahul;Rahul Sipligunj;Telangana Chief Minister;war;India;media;Bharatiya Janata Party;Party;CongressTue, 04 Jun 2024 18:12:34 GMTదేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల రిజల్ట్స్ బయటకు వచ్చాయి.  ఈ రిజల్ట్ లో బిజెపి అనుకున్నంత ఫలితాన్ని సాధించ లేకపోయింది. వారు 400 కి పైగా సీట్లు సాధిస్తామని అనుకున్నారు. కానీ వారి ఆలోచనలను ఇండియా కూటమి తిప్పి కొట్టిందని చెప్పవచ్చు.  ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దాదాపుగా 300 సీట్ల కు దగ్గరగా వస్తే ఇండియా కూటమి 233 సీట్లకు పైగా దూసుకుపోతోంది. అదర్స్ 18 స్థానాల్లో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమం లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసినటు వంటి  కాంగ్రెస్ అధినేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు ఆసక్తికరమైనటు వంటి విషయాలను తెలియజేశారు.

 ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ..  ఇది కాంగ్రెస్ కు ప్రజలు ఇచ్చిన తీర్పని భావించారు. ప్రజాతీర్పు ను శిరసావహిస్తున్నామని అన్నారు. ఈ ఎన్నికల ప్రభుత్వ వ్యవస్థల పై నిఘా వ్యవస్థల పై చేసిన యుద్దంగా భావిస్తున్నామని రాహుల్ గాంధీ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమే యుద్ధం చేస్తామని తెలియజేశారు. ఎన్నికల కు ముందు మాకు సంబంధించినటు వంటి మా పార్టీ బ్యాంక్ అకౌంట్ లను సీజ్ చేశారు. భయాందోళనలకు గురి చేసి మా ముఖ్యమంత్రి లను అరెస్టు చేసి జైలు కు పంపారు. అయినా మా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అద్భుతంగా పోరాటం చేశారని అన్నారు.

  అంతే కాకుండా మోడీ ఈడీ, సీబీఐ లను గుప్పిట్లో పెట్టుకుని అందరినీ భయ బ్రాంతులకు గురి చేసారని అన్నారు.  ఇండియా కూటమి మంచి ఫలితాలు సాధించామని, మోడీని ఆయన వ్యవస్థలను ఓడించామని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరికి స్పష్టమైన మెజారిటీ రాలేదని  ఇండియా కూటమి ఐక్యంగా పనిచేస్తుందని, దేశానికి మా కూటమి కొత్త విజన్ ఇచ్చిందని, ఇందులో మోడీతో పాటు అదాని కూడా ఓడిపోయారని తెలియజేశారు.  మోడీ, అమిత్ షా వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారని అన్నారు. మేము రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ప్రజల వెంటే ఎప్పుడు ఉండి పోరాడుతామని తెలియజేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>