PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chittoor-dc22b8f3-b459-4889-9a3a-6bb88ee7b3cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chittoor-dc22b8f3-b459-4889-9a3a-6bb88ee7b3cf-415x250-IndiaHerald.jpgచిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయానందరెడ్డి పోటీ చేయగా టీడీపీ కూటమి తరపున గురజాల జగన్‌ మోహన్‌ పోటీ చేశారు. ఇద్దరు దిగ్గజాలు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో ఈ ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్ అయింది. ప్రముఖ వ్యాపారవేత్తలుగా విజయానందరెడ్డి, గురజాల జగన్ మోహన్ లకు నియోజకవర్గంలో పేరుంది. chittoor {#}Gurazala;editor mohan;Y. S. Rajasekhara Reddy;Chittoor;Assembly;Elections;Party;TDPచిత్తుచిత్తుగా ఓడించి గెలిచిన చిత్తూరు అభ్యర్థి ఇతనే.. దిగ్గజాల ఫైట్ లో గెలుపెవరిదంటే?చిత్తుచిత్తుగా ఓడించి గెలిచిన చిత్తూరు అభ్యర్థి ఇతనే.. దిగ్గజాల ఫైట్ లో గెలుపెవరిదంటే?chittoor {#}Gurazala;editor mohan;Y. S. Rajasekhara Reddy;Chittoor;Assembly;Elections;Party;TDPTue, 04 Jun 2024 19:48:00 GMTచిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయానందరెడ్డి పోటీ చేయగా టీడీపీ కూటమి తరపున గురజాల జగన్‌ మోహన్‌ పోటీ చేశారు. ఇద్దరు దిగ్గజాలు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో ఈ ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్ అయింది. ప్రముఖ వ్యాపారవేత్తలుగా విజయానందరెడ్డి, గురజాల జగన్ మోహన్ లకు నియోజకవర్గంలో పేరుంది.
 
చిత్తూరు లోక్ సభ పరిధిలో పోటాపోటీగా ఎన్నికలు జరిగిన నియోజకవర్గాలలో చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్ ఒకటి. తాను చేసిన సేవా కార్యక్రమాలు విజయానందరెడ్డికి ప్లస్ కాగా మూడు పార్టీల కూటమి అభ్యర్థిగా పోటీ చేయడం గురజాల జగన్ మోహన్ కు కలిసొచ్చింది. తాను చేసిన అన్నదాన కార్యక్రమాలు, ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు ప్లస్ అవుతాయని విజయానందరెడ్డి భావించగా హేమాహేమీల మధ్య పోరు నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయింది.
 
అయితే ఏపీలో కూటమి వేవ్ నేపథ్యంలో చిత్తూరు ఎమ్మెల్యేగా గురజాల జగన్ మోహన్ కే అనుకూల ఫలితాలు వచ్చాయి. నియోజకవర్గంలో ఏకంగా 13400 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించి వార్తల్లో నిలికారు. ఆర్వో శ్రీనివాసులు నుంచి డిక్లరేషన్ పత్రాన్ని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు అందుకోవడం జరిగింది. గురజాల జగన్ మోహన్ కు కూటమి తరపున పోటీ చేయడంతో లక్ కలిసొచ్చింది.
 
సులువుగానే చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఆయన విజయం సాధించడం జరిగింది. చిత్తూరు ఎమ్మెల్యేగా గురజాల జగన్ మోహన్ గెలవడంతో పాటు విజయానందరెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించారు. నియోజకవర్గంలో గట్టి పోటీ ఎదురైనా వ్యూహ, ప్రతి వ్యూహాలతో తెలివిగా అడుగులు వేసి గురజాల జగన్ మోహన్ విజయాన్ని అందుకున్నారు. చిత్తూరులో టీడీపీ జెండా ఎగురవేసి గురజాల జగన్ మోహన్ వార్తల్లో నిలిచారు. చిత్తూరులో అనుకూల ఫలితాలు రావడంతో గురజాల జగన్ మోహన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>