PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ape86d973a-bd5f-47f7-9672-7bae5ea5f544-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ape86d973a-bd5f-47f7-9672-7bae5ea5f544-415x250-IndiaHerald.jpgమే 13 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదల అవుతున్నాయి. ఉదయం 6 గంటల నుండి ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు అయింది. అందులో భాగంగా మొదట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సిబ్బంది లెక్కించింది. ఆ తర్వాత ఈవీఎం లకు సంబంధించిన ఓట్ల లెక్కింపును మొదలు పెట్టారు. ఇకపోతే ఇప్పటికే కొన్ని చిన్న చిన్న అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఫలితాలు చాలా వరకు వచ్చాయి. ఇకపోతే తాజాగా విజయనap{#}BOTCHA SATYANARAYANA;Vijayanagaram;Vizianagaram;srinivas;Congress;Indian Postal Service;Elections;Party;Andhra Pradesh;Telugu Desam Party;MLA;Hanu Raghavapudi;Assembly;TDP;YCPగణపతి నగరం : రెపరెపలాడిన టీడీపీ జెండా..!గణపతి నగరం : రెపరెపలాడిన టీడీపీ జెండా..!ap{#}BOTCHA SATYANARAYANA;Vijayanagaram;Vizianagaram;srinivas;Congress;Indian Postal Service;Elections;Party;Andhra Pradesh;Telugu Desam Party;MLA;Hanu Raghavapudi;Assembly;TDP;YCPTue, 04 Jun 2024 19:17:00 GMTమే 13 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదల అవుతున్నాయి. ఉదయం 6 గంటల నుండి ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు అయింది. అందులో భాగంగా మొదట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సిబ్బంది లెక్కించింది. ఆ తర్వాత ఈవీఎం లకు సంబంధించిన ఓట్ల లెక్కింపును మొదలు పెట్టారు.

ఇకపోతే ఇప్పటికే కొన్ని చిన్న చిన్న అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఫలితాలు చాలా వరకు వచ్చాయి. ఇకపోతే తాజాగా విజయనగరం జిల్లాలోని గణపతి నగరం నియోజకవర్గానికి సంబంధించిన ఫలితాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ ప్రాంతం నుండి వై సీ పీ పార్టీ అభ్యర్థిగా బొత్స అప్పల నరసయ్య బరిలో ఉండగా , ఈ ప్రాంతం నుండి కూటమి అభ్యర్థిగా కొండుపల్లి శ్రీనివాస్ బరిలో ఉన్నారు.  

ఇప్పటికే వై సి పి పార్టీ అభ్యర్థి అయినటువంటి బి అప్పల నరసయ్య 2009 వ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఈ ప్రాంతంలో గెలుపొందారు. ఆ తర్వాత 2019 వ సంవత్సరం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఇదే ప్రాంతం నుండి రెండవ సారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక ఇప్పటికే ఈ ప్రాంతం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉండడం , అలాగే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ఈయనకు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పట్టు ఉంది.

ఇక ఈ సారి మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పోటీ చేయడంతో టిడిపి అభ్యర్థి అయినటువంటి కొండుపల్లి శ్రీనివాస్ కు కూడా మంచి క్రేజీ ఎక్కడ ఉంది. దానితో వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుంది అని మొదటి నుండే జనాలు భావించారు. ఇకపోతే పెద్దగా పోటీ లేకుండానే ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి శ్రీనివాస్ గెలుపొందారు. ఈయనకు 98051 ఓట్లు రాగా , వైసిపి పార్టీ అభ్యర్థి అప్పల నరసయ్యకు 72750 ఓట్లు వచ్చాయి. దానితో శ్రీనివాస్ 25301 మెజారిటీతో గెలుపొందారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>