PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-elections-2024dfdc0314-3e95-42eb-8df1-7534439a9188-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-elections-2024dfdc0314-3e95-42eb-8df1-7534439a9188-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే విశాఖ నగరాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అదనపు బలగాలు మోహరించారు. ఏపీఎస్పీ బెటాలియన్లతో పాటు పారా మిలటరీ బలగాలను కూడా రంగంలోకి దింపారు. ఇప్పటికే విశాఖ మొత్తం కార్డెన్ సెర్చ్‌తో జల్లెడ పట్టడం జరిగింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియకు ఎన్నికల అధికారులు కసరత్తులని పూర్తి చేశారు. మొత్తం మూడు ప్రదేశాల్లో ఓటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆంధ్రాయూనివర్సిటీతో పాటుAP Elections 2024{#}Paderu,Araku Valley,University,Red,police,Parliment,Vishakapatnam,Indian Postal Service,Assemblyఎన్నికల కౌంటింగ్: పోలీసుల ఆధినంలో విశాఖ.. రంగంలోకి దిగిన మిలిటరీ?ఎన్నికల కౌంటింగ్: పోలీసుల ఆధినంలో విశాఖ.. రంగంలోకి దిగిన మిలిటరీ?AP Elections 2024{#}Paderu,Araku Valley,University,Red,police,Parliment,Vishakapatnam,Indian Postal Service,AssemblyTue, 04 Jun 2024 08:18:04 GMTఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే విశాఖ నగరాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అదనపు బలగాలు మోహరించారు. ఏపీఎస్పీ బెటాలియన్లతో పాటు పారా మిలటరీ బలగాలను కూడా రంగంలోకి దింపారు. ఇప్పటికే విశాఖ మొత్తం కార్డెన్ సెర్చ్‌తో జల్లెడ పట్టడం జరిగింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియకు ఎన్నికల అధికారులు కసరత్తులని పూర్తి చేశారు. మొత్తం మూడు ప్రదేశాల్లో ఓటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆంధ్రాయూనివర్సిటీతో పాటు అనకాపల్లి, పాడేరులో పోలింగ్ కేంద్రాల్లో లెక్కింపునకు అంతా సిద్ధం చేశారు. ఆంధ్రాయూనివర్సిటీలో 7 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానానికి ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనకాపల్లిలో 6 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానం ఇంకా అరకు ఎంపీతో పాటు రెండు అసెంబ్లీ స్థానాలకు పాడేరులో ఓట్ల లెక్కింపు జరుపుతున్నారు.


మే 13 వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఏకంగా 30 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. దాదాపు 30 వేల మంది దాకా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయి. అరకు ఇంకా పాడేరు మావోయిస్టు ఎఫెక్ట్ ఏరియాలు కావడంతో ఆ రెండు ప్రాంతాలను కూడా పోలీసులు దిగ్బంధంలో పెట్టుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 2 కిలో మీటర్ల దాకా రెడ్ జోన్ ప్రకటించి ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇంకా అంతేకాదు నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించడం జరిగింది. ఒక కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లిన వాళ్లు బయటకు వెళ్లి మళ్లీ లోపలకి వెళ్తామంటే అనుమతి నిరాకరించడం జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు గొడవలకు దిగితే ఖచ్చితంగా కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే విశాఖలో వేలాది మంది పోలీసులతో ఇంకా మిలిటరీ బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. అటు ట్రాఫిక్‌ను కూడా పోలీసులు తమ నియంత్రణలో పెట్టుకున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>