MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఇండియాకు స్వతంత్రం రాకముందు కాళ్ళ పాదాలకు చెప్పులు వేసుకోవడం ఒక విలాసం. ఆరోజులలో చాలామంది పేదవాళ్ళు తమ కాళ్ళకు చెప్పులు లేకుండా జీవిస్తూ ఉండేవారు. మండే ఎండలలో కాళ్ళు కాలుతున్నా రాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటున్నా అప్పట్లో వాళ్ళు పట్టించుకునే వారు కాదు. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పరిస్థితులు మారిపోయి ప్రజల జీవన ప్రమాణం ఆదాయాలు పెరగడంతో చెప్పులు అవసరంగా మారిపోయాయి. ప్రస్తుతం ప్రతి సగటు వ్యక్తికి కూడ అందరికీ చెప్పుల జతలు ఉంటున్న విషయం తెలిసిందే. ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్vijayantony{#}bhavana;vijay sethupathi;Tollywood;Cinema;Telugu;Kollywood;Director;Heroine;Joseph Vijay;Darsakudu;Athaduహాట్ టాపిక్ గా మారిన విజయ్ ఆంటోనీ సెంటిమెంట్ !హాట్ టాపిక్ గా మారిన విజయ్ ఆంటోనీ సెంటిమెంట్ !vijayantony{#}bhavana;vijay sethupathi;Tollywood;Cinema;Telugu;Kollywood;Director;Heroine;Joseph Vijay;Darsakudu;AthaduMon, 03 Jun 2024 09:00:00 GMTఇండియాకు స్వతంత్రం రాకముందు కాళ్ళ పాదాలకు చెప్పులు వేసుకోవడం ఒక విలాసం. ఆరోజులలో చాలామంది పేదవాళ్ళు తమ కాళ్ళకు చెప్పులు లేకుండా జీవిస్తూ ఉండేవారు. మండే ఎండలలో కాళ్ళు కాలుతున్నా రాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటున్నా అప్పట్లో వాళ్ళు పట్టించుకునే వారు కాదు.



అయితే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పరిస్థితులు మారిపోయి ప్రజల జీవన ప్రమాణం ఆదాయాలు పెరగడంతో చెప్పులు అవసరంగా మారిపోయాయి. ప్రస్తుతం ప్రతి సగటు వ్యక్తికి కూడ అందరికీ చెప్పుల జతలు ఉంటున్న విషయం తెలిసిందే. ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన విజయ్ యాంటోనీ ఇప్పుడు షూటింగ్ స్పాట్ లో ఎవరికి కనిపించినా కాళ్ళకు చెప్పులు లేకుండా కనిపించడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.



దీనితో అతడు ఏదైనా దైవ దీక్ష తీసుకుని ఇలా కాళ్ళకు చెప్పులు లేకుండా ఉంటున్నాడా అన్న సందేహాలు కొందరికి వచ్చాయి. అయితే విజయ్ యాంటోనీ ఒక కొత్త విషయాన్ని గ్రహించినట్లు తెలుస్తోంది. కళ్ళకు చెప్పులు లేకుండా నడిస్తే చాల మనసుకు ప్రశాంతంగా ఉంటుందని అతడికి భావన కలిగిందట. దీనితో అతడు షూటింగ్ స్పాట్ కు మాత్రమే కాదు సినిమా ఫంక్షన్స్ కు కూడ ఇలా కాళ్ళకు చెప్పులు లేకుండా కనిపిస్తూ ఉండటంతో విజయ్ సేతుపతి కొత్త సెంటిమెంట్ హాట్ టాపిక్ గా మారింది.



సినిమా హీరోలు హీరోయిన్స్ ఏమి చేసినా అది క్షణాలలో వైరల్ గా మారిపోయే పరిస్థితులలో కోలీవుడ్ మీడియాలో విజయ్ యాంటోనీ కొత్త అలవాట్ల పై అనేక ఆశక్తికర కథనాలు వస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘జాతి రత్నాలు’ దర్శకుడు అనుదీప్ కేవీ కి కూడ ఇలాంటి అలవాటు ఉండటంతో ఎప్పుడు బేర్ ఫుట్‌తోనే కనిపిస్తూ ఉంటాడు అని అంటారు. దీనితో రానున్న రోజులలో ఈ భేర్ ఫుట్ మ్యానియా యూత్ లో బాగా పెరిగిపోతే రకరకాల మోడల్స్ లో చెప్పులు తయారు చేసే కంపనీలకు  ఊహించని కష్టకాలం ఎదురౌవుతుంది అనుకోవాలి..  










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>