Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle88f89c9d-5829-42cb-a49f-c5adcf303f67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle88f89c9d-5829-42cb-a49f-c5adcf303f67-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ ఎంతోమంది కమెడియన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అయితే జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్నవాళ్ళందరూ కూడా కొన్నేళ్ళకు బయటకు వచ్చేసి..వేరే షోస్ లలోనో, సినిమాలతోనో బిజీగా మారారు. కానీ, ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ఇంకా జబర్దస్త్ ను పట్టుకొనే వేలాడుతున్నాడు. ఈపాటికి అతను ఎవరో మీకు తెలిసిపోయి ఉంటుంది. అతనే రాకెట్ రాఘవ.జబర్దస్త్ మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు ఎంతోమంది వచ్చారు.. పోయారు. కానీ రాకెట్ రాఘవ మాత్రం ఇంకా అక్కడే ఉన్నాడు. అందుకే ఆయనను సీనియర్ రాఘవ అని కూడా పిలుస్తూ ఉంటారు. అన్ని టీమ్స్ కంటే socialstars lifestyle{#}rocket raghava;Annayya;Fidaa;Episode;Jabardasth;Comedy;Sridevi Kapoor;Chiranjeevi;BEAUTY;Director;Romantic;Juneరొమాంటిక్ రాఘవ గా మారిపోయిన రాకెట్ రాఘవ..!!రొమాంటిక్ రాఘవ గా మారిపోయిన రాకెట్ రాఘవ..!!socialstars lifestyle{#}rocket raghava;Annayya;Fidaa;Episode;Jabardasth;Comedy;Sridevi Kapoor;Chiranjeevi;BEAUTY;Director;Romantic;JuneMon, 03 Jun 2024 21:45:00 GMTజబర్దస్త్ ఎంతోమంది కమెడియన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అయితే జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్నవాళ్ళందరూ కూడా కొన్నేళ్ళకు బయటకు వచ్చేసి..వేరే షోస్ లలోనో, సినిమాలతోనో బిజీగా మారారు. కానీ, ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ఇంకా జబర్దస్త్ ను పట్టుకొనే వేలాడుతున్నాడు. ఈపాటికి అతను ఎవరో మీకు తెలిసిపోయి ఉంటుంది. అతనే రాకెట్ రాఘవ.జబర్దస్త్ మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు ఎంతోమంది వచ్చారు.. పోయారు. కానీ రాకెట్ రాఘవ మాత్రం ఇంకా అక్కడే ఉన్నాడు. అందుకే ఆయనను సీనియర్ రాఘవ అని కూడా పిలుస్తూ ఉంటారు. అన్ని టీమ్స్ కంటే ఈయన టీమ్ లోనే కొంచెం వల్గారిటీ లేకుండా పద్దతిగా కామెడీ ఉంటుంది అని అభిమానులు చెప్పుకొస్తూ ఉంటారు. ఇక ఇదంతా పక్కన పడితే ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు రాకెట్ రాఘవ.. శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా పాల్గొంటున్నాడు.కామెడీతోనే కాదు.. తన డ్యాన్స్ తో కూడా రాకెట్ రాఘవ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో రాకేష్ రాఘవ డ్యాన్స్ హైలైట్ గా నిలుస్తుంది. ఇప్పటికే ఈ షో లో పలుసార్లు తన డ్యాన్స్ తో అదరగొట్టిన ఈ సీనియర్ నటుడు.. తాజాగా మరోసారి చిరు స్టెప్స్ కు చిందేసి ఔరా అనిపించాడు. జూన్ 9 న స్ట్రీమింగ్ అయ్యే ఎపిసోడ్ ప్రమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో రాకెట్ రాఘవ డ్యాన్స్ తో అదరగొట్టాడు.హాట్ బ్యూటీ అయిన డ్యాన్సర్ తో చిరంజీవి నటించిన అన్నయ్య సినిమాలోని హిమసీమల్లో హలో... యమగా ఉంది ఒళ్లో అనే సాంగ్ కు స్టెప్స్ వేశాడు. మంచి రొమాంటిక్ సాంగ్ కావడంతో డ్యాన్సర్ తో రాఘవ కూడా రొమాన్స్ చేస్తూ కనిపించాడు. ఇక ఈ డ్యాన్స్ కు అక్కడ ఉన్నవారందరూ ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఇంద్రజ.. రాఘవ డ్యాన్స్ ను బాగా ఎంజాయ్ చేసింది.అంతేకాకుండా రాకెట్ రాఘవ కాస్తా రొమాంటిక్ రాఘవగా మారి ఇప్పుడు రొమాన్స్ లో కూడా రాకెట్ లా దూసుకెళ్తున్నావ్ అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ రాకెట్ రాఘవ డ్యాన్స్ చూసిన అభిమానులు కూడా ఈ వయస్సులో ఇంత ఈజ్ గా డ్యాన్స్ వేయడం అనేది అభినందించాల్సిన విషయమని చెప్పుకొస్తున్నారు.ఇకపోతే రాకెట్ రాఘవ.. మిగతావారిలా హీరోలుగా, నిర్మాతగా, డైరెక్టర్ గా మారకుండా తనకు వచ్చిన కామెడీ చేసుకుంటూ జబర్దస్త్ లోనే ఉంటున్నాడు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా మంచి మంచి పాత్రలు చేస్తూ బిజీగా మారాడు. ఆయన ఇలానే మంచి మంచి స్కిట్స్ చేయాలనీ ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>