PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-elections-20247af74016-b12f-4388-acbb-afbf28741e71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-elections-20247af74016-b12f-4388-acbb-afbf28741e71-415x250-IndiaHerald.jpg •అధికారులని వణికిస్తున్న 2024 ఎన్నికల కౌటింగ్ •చరిత్రలో ఎన్నడూ లేనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న అధికారులు జూన్ 4న అంటే రేపు మంగళవారం నాడు నిర్వహించే కౌంటింగ్‌ అనేది అధికారులకి ఇప్పటిదాకా జరిగిన కౌంటింగ్ల కంటే చాలా భయంకరమైనదిగా నిలుస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు ఒక రేంజ్ లో డెవలప్ అయింది. ఏ చిన్న సంఘటన జరిగినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అందుకే ఈ ఎన్నికల కౌంటింగ్ అధికారులని వణికిస్తుంది. ఏ చిన్న తేడా జరిగిన వారిదే పూర్తి బాధ్యత. ఎందుకంటే ఏదైన తప్పు జరిగితే క్షణాల్లో వైరల్ అయ్యే సోAP Elections 2024{#}Kumaar;tuesday;Tirupati;central government;June;Traffic police;Election Commission;media2024 ఎన్నికల కౌంటింగ్: అధికారులకి అత్యంత భయంకరమైన కౌంటింగ్?2024 ఎన్నికల కౌంటింగ్: అధికారులకి అత్యంత భయంకరమైన కౌంటింగ్?AP Elections 2024{#}Kumaar;tuesday;Tirupati;central government;June;Traffic police;Election Commission;mediaMon, 03 Jun 2024 10:38:17 GMT•అధికారులని వణికిస్తున్న 2024 ఎన్నికల కౌటింగ్

 
•చరిత్రలో ఎన్నడూ లేనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న అధికారులు


జూన్ 4న అంటే రేపు మంగళవారం నాడు నిర్వహించే కౌంటింగ్‌ అనేది అధికారులకి ఇప్పటిదాకా జరిగిన కౌంటింగ్ల కంటే చాలా భయంకరమైనదిగా నిలుస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు ఒక రేంజ్ లో డెవలప్ అయింది. ఏ చిన్న సంఘటన జరిగినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అందుకే ఈ ఎన్నికల కౌంటింగ్ అధికారులని వణికిస్తుంది. ఏ చిన్న తేడా జరిగిన వారిదే పూర్తి బాధ్యత. ఎందుకంటే ఏదైన తప్పు జరిగితే క్షణాల్లో వైరల్ అయ్యే సోషల్ మీడియా కాలం ఇది. కచ్చితంగా అధికారులు జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. అలాగే రేపు జరగబోయే గొడవలు, కౌంటింగ్ ట్రిక్స్ దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ నిర్వహించే అధికారులు ముందుగానే భయపడి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కౌంటింగ్‌ సిబ్బంది, అధికారులకు శిక్షణ ప్రక్రియను పూర్తి చేసింది. ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థుల తరఫున ప్రతినిధులుగా కౌంటింగ్‌ ఏజెంట్లను ఎంపిక చేసి.. వారికి శిక్షణని ఇచ్చాయి. కౌంటింగ్‌ రోజు కౌంటింగ్‌ హాలులో ఏజెంట్లు కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలపై ఇప్పటికే ఈసీ మార్గదర్శకాలను విడుదల చేసింది.మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం కానుండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 3, 4, 5 తేదీలు మూడు రోజులపాటు మద్యం దుకాణాలు చాలా స్ట్రిక్ట్ గా పూర్తిగా మూతపడనున్నాయి.



ఎందుకంటే గొడవలు స్టార్ట్ అయ్యేదే ఈ తాగుబోతుల వల్ల కాబట్టి మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు డీజీపీ హరీశ్‌ కుమార్ గుప్తా ఇప్పటికే తెలిపారు. అంటే ఫలితాలు వెలువడిన మరుసటి రోజు కూడా మందు దుకాణాలు ఉండవు. మరోవైపు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే ఇప్పటికే నిఘా పటిష్టం చేశారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి సహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో ఘర్షణలు చోటుచేసుకున్న జిల్లాల్లో చాలా చోట్ల నిఘా పెంచారు. పోలీస్ పికెటింగ్‌లు ఇంకా ఫ్లాగ్‌ మార్చ్‌లు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్‌ రోజు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర అదనపు బలగాలను కూడా ఆంధ్రప్రదేశ్‌లో రంగంలోకి దింపారు. కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం సూచనలతో ఈ నెల 15వ తేదీ దాకా రాష్ట్ర వ్యాప్తంగా నిఘా కొనసాగనుంది. మొత్తానికి ఈ 2024 కౌంటింగ్ ఇప్పటిదాకా జరిగిన కౌంటింగ్ల కంటే అత్యంత భయంకరమైంది. ఒక్క ఆంధ్రానే కాదు దేశావ్యాప్తంగా కూడా ఈ కౌంటింగ్ భయం సృష్టిస్తుంది.అందుకే అధికారులు సాఫీగా జరిగేందుకు ఇలా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>