PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap6b022411-a123-4f78-8ed6-63d2beac1840-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap6b022411-a123-4f78-8ed6-63d2beac1840-415x250-IndiaHerald.jpgఆంధ్ర రాష్ట్రంలో మే 13 వ తేదీన జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు జూన్ 4 వ తేదీన అనగా రేపు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 6 గంటల నుండి ఓట్ల లెక్కింపు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. మొదట ప్రభుత్వ ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఎన్నికల అధికారులు లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎం ల ఓట్లను లెక్కిస్తారు. ఇకపోతే ఓట్ల లెక్కింపుకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రముఖ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ లను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా ap{#}Indian Postal Service;Janasena;Survey;Yevaru;Telugu Desam Party;Congress;India;YCP;Juneఆ విషయంలో టీడీపీ నీ అమాంతం దాటేసిన వైసీపీ... అయినా ప్రాబ్లం ఉంది..?ఆ విషయంలో టీడీపీ నీ అమాంతం దాటేసిన వైసీపీ... అయినా ప్రాబ్లం ఉంది..?ap{#}Indian Postal Service;Janasena;Survey;Yevaru;Telugu Desam Party;Congress;India;YCP;JuneMon, 03 Jun 2024 11:43:00 GMTఆంధ్ర రాష్ట్రంలో మే 13 వ తేదీన జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు జూన్ 4 వ తేదీన అనగా రేపు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 6 గంటల నుండి ఓట్ల లెక్కింపు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. మొదట ప్రభుత్వ ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఎన్నికల అధికారులు లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎం ల ఓట్లను లెక్కిస్తారు. ఇకపోతే ఓట్ల లెక్కింపుకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రముఖ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ లను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఎవరు అధికారంలోకి రాబోతున్నారు. అనే విషయంపై పెద్దగా క్లారిటీ రాలేదు. ఒక సంస్థ వైసీపీ పార్టీ క్లియర్ కట్ గా అధికారంలోకి రాబోతోంది అని కొన్ని సంస్థలు నివేదికలను విడుదల చేస్తే , మరో కొన్ని సంస్థలు కూటమి స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రాబోతుంది అని నివేదికలను విడుదల చేసింది. దానితో ఎవరు అధికారం లోకి రాబోతున్నారు అనేది తెలియాలి అంటే రేపటి వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇకపోతే తాజాగా ఇండియా టుడే , మై యాక్సిస్ సంస్థ వారు తమ నివేదికను విడుదల చేశారు.

అందులో భాగంగా ఎవరికి ఎంత శాతం ఓట్లు పడే అవకాశం ఉంటుంది అని అంచనాను వీరు వేశారు. వీరి అంచనా ప్రకారం తెలుగు దేశం పార్టీ కి 42 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది అని , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి 44% ఓట్లు వస్తాయి అని , బి జె పి కి రెండు శాతం , జనసేన కు ఏడు శాతం , కాంగ్రెస్ పార్టీ కి రెండు శాతం ఓట్లు దక్కబోతున్నాయి అని ఈ సంస్థ అంచనా వేసింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టి డి పి కంటే వై సీ పీ కి ఎక్కువ శాతం ఓట్లు వచ్చినప్పటికీ ఓవరాల్ గా కూటమి ఓట్ల శాతం చేసుకున్నట్లు అయితే 51% వస్తుంది. ఈ విధంగా చూసుకుంటే కూటమికే ఎక్కువ శాతం ఓట్లు దక్కబోతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>