PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-janasena-ap-politics-20248b946906-65a3-448a-bee9-857e8ea89235-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-janasena-ap-politics-20248b946906-65a3-448a-bee9-857e8ea89235-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లోని రేపటి రోజున ఓటింగ్ ఫలితాలు వెలువడనున్నాయి.. ముఖ్యంగా చాలా సంస్థలు ఎగ్జిట్ పోవలసిన విడుదల చేశాయి. ఇలాంటి సమయంలోనే చాలా పార్టీలకు అనుకూలంగానే ఎగ్జిట్ పోల్స్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. యాక్సిస్ మై ఇండియా, ఇండియా టుడే సర్వేలు ఏదైతే నిన్నటి రోజున తెలియజేసింది.. అసెంబ్లీకి, పార్లమెంటుకు సంబంధించి భిన్నమైన పరిస్థితిని తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి తాజాగా చెబుతున్నటువంటి లెక్క ఏమిటంటే.. తెలుగుదేశం పార్టీ 78 నుంచి 96 స్థానాలు గెలుచుకుంటుందని.. అదే సందర్భంలో వైసిపి పార్టీ 57 నుంచి 7TDP;JANASENA;AP POLITICS;2024{#}96;Janasena;Telugu Desam Party;TDP;YCP;Bharatiya Janata Party;Congress;Andhra Pradesh;India;Newsటీడీపీ: పొత్తు వల్లే పార్టీని తొక్కి పైకి లేస్తున్న జనసేన..!టీడీపీ: పొత్తు వల్లే పార్టీని తొక్కి పైకి లేస్తున్న జనసేన..!TDP;JANASENA;AP POLITICS;2024{#}96;Janasena;Telugu Desam Party;TDP;YCP;Bharatiya Janata Party;Congress;Andhra Pradesh;India;NewsMon, 03 Jun 2024 10:49:00 GMTఆంధ్రప్రదేశ్లోని రేపటి రోజున ఓటింగ్ ఫలితాలు వెలువడనున్నాయి.. ముఖ్యంగా చాలా సంస్థలు ఎగ్జిట్ పోవలసిన విడుదల చేశాయి. ఇలాంటి సమయంలోనే చాలా పార్టీలకు అనుకూలంగానే ఎగ్జిట్ పోల్స్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. యాక్సిస్ మై ఇండియా, ఇండియా టుడే సర్వేలు ఏదైతే నిన్నటి రోజున తెలియజేసింది.. అసెంబ్లీకి, పార్లమెంటుకు సంబంధించి భిన్నమైన పరిస్థితిని తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి తాజాగా చెబుతున్నటువంటి లెక్క ఏమిటంటే.. తెలుగుదేశం పార్టీ 78 నుంచి 96 స్థానాలు గెలుచుకుంటుందని.. అదే సందర్భంలో వైసిపి పార్టీ 57 నుంచి 78 సీట్లు గెలుచుకుంటుందని.. బిజెపి నాలుగు నుంచి ఆరు.. జనసేన 16 నుంచి 18 సీట్లు అంటూ తెలిపారు.


పర్సెంట్ ఆఫ్ ఓటింగ్ చూస్తే.. టిడిపి కంటే వైసీపీ పార్టీకి ఎక్కువ అంచనా వేశారు.. టిడిపికి 42%.. వైసిపి పార్టీకి 44%.. జనసేనకు 7 శాతం బిజెపికి 2 శాతం.. కాంగ్రెస్ పార్టీకి 2 శాతం ఇతరులకు 3 శాతం అంచనా అన్నట్లుగా యాక్సిస్ మై ఇండియా సర్వే తెలియజేశారు.. ఇది టిడిపి పార్టీకి కాస్త షాకింగ్ పరిణామం చెప్పవచ్చు. ఒకవేళ జతలు కట్టడం వల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తోంది తప్ప.. పొత్తు కట్టకపోయి ఉంటే దాని పరిస్థితి ఏంటి అన్నది ఇక్కడ సందేహం మొదలవుతోంది.


పొత్తు వలనే ఇక్కడ ఒకవేళ టిడిపి కి భారీ విజయం సాధ్యమవుతుందని ఆక్సిస్ మై ఇండియా అంచనా వేస్తున్నది. 21 స్థానాలలో జనసేన 16 నుంచి 18 సీట్లు గెలుచుకునేలా కనిపిస్తోందని తెలుపుతున్నారు. జనసేన వల్లనే తెలుగుదేశం గెలుస్తున్నది. టిడిపి 78 నుంచి 96 సీట్లలో జనసేన పోటీ చేయకపోవడం వల్ల గెలుస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. అదే సందర్భంలో వైసీపీ పార్టీ 57 నుంచి 78 సీట్లు అంటే.. 44% ఓట్ అంటే.. క్రిందటిసారి వచ్చిన 50లో 6% శాతం  ఓటింగ్ తగ్గిందని చెప్పవచ్చు.. గతంలో జనసేన వాళ్లు బిజెపి వాళ్లు వైసీపీకి ఓటు వేశారు.. మరి ఏం జరుగుతుందో నాలుగో తేదీ తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>