PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mukesh-meena-ceod6c489b8-6be1-4bff-9990-3ed9cc435739-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mukesh-meena-ceod6c489b8-6be1-4bff-9990-3ed9cc435739-415x250-IndiaHerald.jpgజూన్ 4 భారతదేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా కీలక సమావేశం ఏర్పాటు చేసి అనేక విషయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. జూలై 4 ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లో లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని ఆ తర్వాత ఎనిమిదిన్నర గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల సంఖ్యను కౌంటింగ్ మొదలవుతున్నట్లు ఆయన తెలిపారు. mukesh meenA CEO{#}meena;January;Mukesh;Gift;Indian Postal Service;House;Assembly;Andhra Pradesh;Juneఏపీ ఎన్నికలపై సమగ్ర వివరాలను చెప్పేసిన సీఈఓ మీనా..!?ఏపీ ఎన్నికలపై సమగ్ర వివరాలను చెప్పేసిన సీఈఓ మీనా..!?mukesh meenA CEO{#}meena;January;Mukesh;Gift;Indian Postal Service;House;Assembly;Andhra Pradesh;JuneMon, 03 Jun 2024 14:33:47 GMTజూన్   4 భారతదేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా కీలక సమావేశం ఏర్పాటు చేసి అనేక విషయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. జూలై 4 ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లో లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని ఆ తర్వాత ఎనిమిదిన్నర గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల సంఖ్యను కౌంటింగ్ మొదలవుతున్నట్లు ఆయన తెలిపారు.


ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 3.3 కోట్ల మంది ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఆయన తెలిపారు. వీటితోపాటు రాష్ట్రంలోని 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకున్నట్లు ముఖేష్ తెలిపారు. ఇకపోతే రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఇప్పటికే కౌంటింగ్ సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసినట్లు ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో 26, 473 మంది హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు వినియోగించుకున్నారని., అలాగే మరో 26, 721 మంది సర్వీస్ ఓటర్లు ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేసినట్లు తెలిపారు.


జూలై 4న జరగబోయే కౌంటింగ్ ప్రక్రియలో సపరేట్ గా ఏర్పాటు చేసిన లోక్సభ ఓట్ల లెక్కింపు వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థలాలలో 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లను లెక్కిస్తారని ఆ తర్వాత ఎనిమిదిన్నర గంటలకు ప్రక్రియ మొదలవుతుందని సూచించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 443 పోస్టల్ బ్యాలెట్ టేబుల్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే 2443 ఈవీఎం టేబుల్ లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 33 స్థానాలలో 401 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ నేపథంలో భాగంగా ఎన్నికల కమిషన్ 19 మంది అబ్జర్వర్లను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా 102 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి లేదా రెండు రౌండ్లలో లెక్కిస్తారని., 48 నియోజకవర్గాలలో మూడు రౌండ్లు., మరో 25 నియోజకవర్గాలలో నాలుగు రౌండ్ల లో ఓట్లను లెక్కిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఎన్నికల కోడ్ అవలంబిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1 నుంచి జూన్ 2 వరకు మొత్తం 483 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇందులో 170 కోట్ల నగదు, 62 కోట్ల విలువైన లిక్కర్, 36 కోట్ల విలువచేసే డ్రగ్స్, 186 కోట్ల విలువచేసే వస్తువులు., అలాగే 29 కోట్లు విలువ చేసే విలువైన గిఫ్ట్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>