PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr-brs-congress-cm-revanth-cm-105-sets-telangana02722a92-c7c9-4ce5-9000-204a75c2384e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr-brs-congress-cm-revanth-cm-105-sets-telangana02722a92-c7c9-4ce5-9000-204a75c2384e-415x250-IndiaHerald.jpgకేసీఆర్ ఇంతింతై వటుడింతై అన్నట్టు. ఒక్కడిగా మొదలై తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసిన గొప్పదీరుడు. ప్రత్యేక రాష్ట్రాన్ని 10 ఏళ్లపాటు పాలన చేసిన రాజకీయ వీరుడు. అంతటి వీరున్నే ప్రజలు మట్టి కల్పించారు. అలాంటిది మిగతా నాయకుల గురించి ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 2014 నుంచి మొదలు 2024 వరకు కేసీఆర్ పాలన అద్భుతంగా సాగింది. ఎన్నో పథకాలు, పనులు చేశారు. అలాంటి కేసీఆర్ పాలన చేసినప్పుడు ఏం చేశాడో ఏమో కానీ రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, ఆసరా పింఛన్లు ఇతర ఏ పథకాలు కూడా ఆగలేదు. ప్రజలకు ఒకటి రెండు తారీకkcr;brs;congress;cm revanth ;cm;105 sets;telangana{#}100 days;electricity;KCR;Election;Telangana;Congressతెలంగాణ: ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే 105 గెలుస్తాం కేసిఆర్.!తెలంగాణ: ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే 105 గెలుస్తాం కేసిఆర్.!kcr;brs;congress;cm revanth ;cm;105 sets;telangana{#}100 days;electricity;KCR;Election;Telangana;CongressMon, 03 Jun 2024 11:54:09 GMT కేసీఆర్ ఇంతింతై వటుడింతై అన్నట్టు. ఒక్కడిగా మొదలై తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసిన గొప్పదీరుడు. ప్రత్యేక రాష్ట్రాన్ని 10 ఏళ్లపాటు  పాలన చేసిన రాజకీయ వీరుడు. అంతటి వీరున్నే ప్రజలు మట్టి కల్పించారు. అలాంటిది మిగతా నాయకుల గురించి ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 2014 నుంచి మొదలు 2024 వరకు కేసీఆర్ పాలన అద్భుతంగా సాగింది.  ఎన్నో పథకాలు, పనులు చేశారు. అలాంటి కేసీఆర్  పాలన చేసినప్పుడు ఏం చేశాడో ఏమో కానీ రైతుబంధు, కళ్యాణ లక్ష్మి,  రైతు బీమా,  ఆసరా పింఛన్లు ఇతర ఏ పథకాలు కూడా ఆగలేదు. ప్రజలకు ఒకటి రెండు తారీకు వరకు  ప్రతి పథకం అమలయ్యేది. కానీ కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటినుంచి ఇప్పటివరకు  ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ,  ఉచిత  కరెంటు పథకాలు తప్ప ఇంకేవీ క్లియర్ గా నడవడం లేదు. 

ముఖ్యంగా వారు రాగానే వంద రోజుల్లో ఐదు గ్యారంటీలు అమలు చేయడమే కాకుండా రాష్ట్రంలో అద్భుతమైన పాలన ఉంటుందని చెప్పుకొచ్చారు. వాటిని తుంగలో తొక్కి  100 రోజులు గడిచిన ఇప్పటివరకు పింఛన్లు పెంచలేదు, కళ్యాణ లక్ష్మి రాలేదు, షాది ముబారక్ మూలన పడింది.  రైతు బీమా జాడే లేకుండా పోయింది. దీంతో చాలామంది పేద ప్రజలు నయానో భయానో కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది అనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర విషయంపై స్పందించినటువంటి కేసీఆర్ రాష్ట్రంలో చాలా అరాచక పాలన జరుగుతుందని అంచనా వేశారు. ఉద్యమాల తెలంగాణను కాంగ్రెస్ వాళ్లు నాశనం చేస్తారని పదేపదే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ప్రజలకు అర్థం అయిపోయి ఉంటుంది.

 ప్రస్తుతం తెలంగాణలో మరోసారి ఎలక్షన్స్ పెడితే బిఆర్ఎస్ 105 సీట్లతో ఈజీగా గెలుస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నో పథకాలు తీసుకొచ్చామని, దేశంలోనే ఏ గ్రామపంచాయతీకి ప్రత్యేక ట్రాక్టర్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవని తెలంగాణలోనే ఉందని ఆయన అన్నారు.  ప్రతి గ్రామానికి స్మశాన వాటిక, ప్రత్యేక పార్కు, డంపింగ్ షెడ్  దేశంలో ఎక్కడా లేని విధమైనటువంటి పనులు తెలంగాణ రాష్ట్రంలో చేశామని అభివృద్ధిలో దూసుకుపోయిందని తెలియజేశారు.  అలాంటి తెలంగాణను పాలించడం కాంగ్రెస్ నాయకులకు చేతనవుతలేదని  చిల్లర మళ్లర మాటలు మాట్లాడుతూ కాలం గడుపుతున్నారని కేసీఆర్ తెలియజేశారు. గులాబీ జెండా ఒక మహావృక్షం అని  ఇది పూర్తిగా పోతుంది అనేది అపోహ అని, తర్వాత మళ్లీ గులాబీ పార్టీదే అధికారమని అన్నారు. అంతేకాకుండా  ప్రస్తుతం స్పాట్ ఎలక్షన్స్ పెట్టిన 10 సీట్లకు పైగా తెలంగాణలో బీఆర్ఎస్ సీట్లు సాధిస్తుందని తెలియజేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ ఆశ్చర్యకరంగా మారాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>