MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/gangs-of-godavari-576c2a28-7324-48ac-b65b-eb28beab1159-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/gangs-of-godavari-576c2a28-7324-48ac-b65b-eb28beab1159-415x250-IndiaHerald.jpgయంగ్ హీరో విశ్వక్ సేన్ ట్రెండ్ కి తగ్గట్టు సినిమాలు చేస్తూ హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా సినిమా సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు.2024లో విశ్వక్ "గామి" మూవీతో మంచి హిట్ అందుకున్నారు. ఈ మూవీలో అఘోర శంకర్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు. 2023లో "దాస్ కా దమ్కీ" మూవీతో కూడా విశ్వక్ ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" అనే సినిమా మరీ ఒక రేంజ్ లో కాకపోయినా డీసెంట్ ఓపెనింగ్స్ అయితే సాధించింది. ఈ సినిమా విడుదలకు ముందే అప్డేట్స్ ద్వారా కొంచెం పాజిటివ్ వైబ్రేషన్ క్రGangs of Godavari {#}NET FLIX;sithara;naga;neha shetty;vegetable market;shankar;bollywood;monday;anjali;Telugu;BEAUTY;Cinema;Hero;News;Andhra Pradeshగ్యాంగ్స్ ఆఫ్ గోదావరి: వసూళ్లు ఒకే గాని లాభాలు కష్టమే?గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి: వసూళ్లు ఒకే గాని లాభాలు కష్టమే?Gangs of Godavari {#}NET FLIX;sithara;naga;neha shetty;vegetable market;shankar;bollywood;monday;anjali;Telugu;BEAUTY;Cinema;Hero;News;Andhra PradeshMon, 03 Jun 2024 18:47:00 GMTయంగ్ హీరో విశ్వక్ సేన్ ట్రెండ్ కి తగ్గట్టు సినిమాలు చేస్తూ హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా సినిమా సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు.2024లో విశ్వక్ "గామి" మూవీతో మంచి హిట్ అందుకున్నారు. ఈ మూవీలో అఘోర శంకర్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు. 2023లో "దాస్ కా దమ్కీ" మూవీతో కూడా విశ్వక్ ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" అనే సినిమా మరీ ఒక రేంజ్ లో కాకపోయినా డీసెంట్ ఓపెనింగ్స్ అయితే సాధించింది. ఈ సినిమా విడుదలకు ముందే అప్డేట్స్ ద్వారా కొంచెం పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసుకుంది.ఈ సినిమా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.8.2 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. విశ్వక్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీగా నిలిచింది. ఇక మూడు రోజుల్లో ఏపీ తెలంగాణ లో ఈ సినిమా మంచి వసూళ్ళను రాబట్టింది. మొత్తంగా ఇప్పటి  దాకా రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.62 కోట్ల షేర్ అందుకున్నట్లు సమాచారం తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 8 కోట్లుగా ఉంది. అంటే దాదాపు 82 శాతం ఈ సినిమా కలెక్షన్ రికవరీ అయ్యింది. కానీ ఇది సరిపోదు ఇంకా రాబట్టాలి. సినిమాకి వచ్చిన బజ్ తో పోలిస్తే ఈ వసూళ్లు చాలా తక్కువ. 


ఈరోజుల్లో చిన్న చిన్న సినిమాలు కూడా 100 కోట్లు దాటేస్తున్నాయి. కానీ ఈ సినిమాకి ఇచ్చిన పబ్లిసిటీకి ఇప్పటికే 25 కోట్ల పైన వసూలు చేసుండాలి. కానీ ఈ మూవీ స్లో గా ఉంది.వీకెండ్ తరువాత రోజు కూడా డీసెంట్ వసూళ్లనే రాబట్టే అవకాశం ఉంది. సోమవారం తరువాత కూడా ఇదే జోరు కనుక కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఇంకా సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.ఇక "డీజే టిల్లు" ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా, అంజలి కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఆయేషా ఖాన్ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లో విడుదలైన మూడు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.ఇక కథ విషయానికొస్తే, లంక గ్రామానికి చెందిన లంకల రత్న ఒక చిన్న స్థాయి నుంచి మరో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అతను అనుకుంటాడు. తన ప్రాంతానికి చెందిన రెండు వర్గాల మధ్య కూడా ఆధిపత్య పోరు ఉంటుంది. అయితే హీరో ఓ వర్గం వైపు చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తాడు. ఆ తర్వాత కథ  మలుపులు తిరుగుతుంది. అతని ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగిందనేది తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>