PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jagan-that-is-the-reason-for-the-decline-in-mens-votese5ca2917-6904-4f15-bfcf-b3d3f9f3afbd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jagan-that-is-the-reason-for-the-decline-in-mens-votese5ca2917-6904-4f15-bfcf-b3d3f9f3afbd-415x250-IndiaHerald.jpgఏపీలో జగన్ సీఎం అయినా కాకపోయినా దానికి కారణం ఏంటనే ప్రశ్నకు మాత్రం సులువుగా సంక్షేమం అనే సమాధానం వినిపిస్తోంది. గతంలో ఎవరూ ఎప్పుడూ ఏ రాష్ట్రంలో చేయని స్థాయిలో సంక్షేమం అంటే ఏంటో జగన్ చేసి చూపించారు. గత ఐదేళ్లలో పథకాల ప్రయోజనాలు పొందిన ప్రజలు ఇంతకాలం ఈ డబ్బంతా ఎక్కడికి పోయిందని ప్రశ్నించారంటే వాస్తవ పరిస్థితులు ఏంటో సులువుగా అర్థమవుతాయి. jagan{#}bible;CBN;Jagan;YCP;Party;Andhra Pradesh;Indian Postal Serviceజగన్ ఓడినా గెలిచినా అసలు కారణం మాత్రం ఇదే.. ఆ ప్రశ్నకు జవాబు దొరకనుందా?జగన్ ఓడినా గెలిచినా అసలు కారణం మాత్రం ఇదే.. ఆ ప్రశ్నకు జవాబు దొరకనుందా?jagan{#}bible;CBN;Jagan;YCP;Party;Andhra Pradesh;Indian Postal ServiceMon, 03 Jun 2024 21:50:00 GMTఏపీలో జగన్ సీఎం అయినా కాకపోయినా దానికి కారణం ఏంటనే ప్రశ్నకు మాత్రం సులువుగా సంక్షేమం అనే సమాధానం వినిపిస్తోంది. గతంలో ఎవరూ ఎప్పుడూ ఏ రాష్ట్రంలో చేయని స్థాయిలో సంక్షేమం అంటే ఏంటో జగన్ చేసి చూపించారు. గత ఐదేళ్లలో పథకాల ప్రయోజనాలు పొందిన ప్రజలు ఇంతకాలం ఈ డబ్బంతా ఎక్కడికి పోయిందని ప్రశ్నించారంటే వాస్తవ పరిస్థితులు ఏంటో సులువుగా అర్థమవుతాయి.
 
జగన్ అమలు చేసిన సంక్షేమాన్ని కోరుకుంటే ప్రజలు ఆయననే మళ్లీ గెలిపిస్తారని అలా కాకుండా కచ్చితంగా చేస్తారో చేయరో చెప్పలేని సంక్షేమంతో పాటు కొంతమేర అభివృద్ధి కోరుకునే వాళ్లు మాత్రం కూటమిని గెలిపిస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ విజయం సాధించినా 100కు అటూఇటూ స్థానాలే తప్ప మరీ అద్భుతాలు అయితే ఆశించవద్దని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
 
జగన్ గత ఐదేళ్లలో తాను ప్రకటించిన మేనిఫెస్టోనే భగవద్గీత ఖురాన్ బైబిల్ అంటూ ఆచరణ సాధ్యమైన ప్రతి హామీని నెరవేర్చారు. పేదలకు సన్నిబియ్యం, సీపీఎస్ రద్దు, మద్యపాన నిషేధం లాంటి హామీలను అమలు చేసే విషయంలో జగన్ సర్కార్ విఫలమైనా ఈ హామీల అమలు జరగకపోవడం వల్ల నష్టపోయిన వాళ్ల సంఖ్య మాత్రం చాలా తక్కువని చెప్పవచ్చు.
 
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూటమికే అనుకూలంగా పడ్డాయని వైసీపీ ఫీలవుతోందని దాదాపుగా క్లారిటీ వచ్చింది. అయితే గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులు మాత్రం జగన్ పక్షానే నిలబడి ఉండవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వ్యూహ, ప్రతివ్యూహాలతో జగన్, చంద్రబాబు గెలుపు కోసం కష్టపడగా ప్రజలు ఏ పార్టీకి అండగా నిలిచారో ఏ పార్టీకి మద్దతు ప్రకటించారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఏపీ ప్రజల ఐదేళ్ల భవిష్యత్తు ఎవరనే ప్రశ్నకు సైతం మరికొన్ని గంటల్లో క్లియర్ కట్ జవాబు రానుంది. ఈ ఎన్నికల్లో ఓడిన పార్టీ 2029లో అధికారంలోకి వస్తుందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు.













మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>