Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8dc42fda-0e3b-4a83-8869-00c550659db3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8dc42fda-0e3b-4a83-8869-00c550659db3-415x250-IndiaHerald.jpg సెలబ్రిటీలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సినీ, క్రీడా రంగానికి చెందిన వారికి ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఉంటారు.అంతేకాక ప్రముఖులు చెప్పే విషయాలు సామాన్య ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అందుకే వ్యాపారస్తులు తమ ఉత్పత్తులను మార్కెట్ లో ప్రమోట్ చేసేందుకు సెలబ్రిటీలను వాడుకుంటారు. వారికి కోట్ల రూపాయలు ఇస్తూ..తమ ఉత్పత్తులపై యాడ్ చేయిస్తుంటారు. ఎంతో బాలీవుడ్, టాలీవుడ్ హీరోలు ఇలా ఎన్నో రకాల యాడ్స్ లో నటించారు. ఇక హిందీ యాక్టర్లు అయితే ప్రజలకు హానీ కలిగించే గుట్కాsocialstars lifestyle{#}vegetable market;Varsham;ajay;Chiranjeevi;Masala;Allu Arjun;Tollywood;bollywood;Hindi;INTERNATIONAL;Telugu;Indiaఅలాంటి యాడ్స్ రిజెక్ట్ చేస్తూ కోట్లు వదులుకుంటున్న టాలీవుడ్ స్టార్స్..??అలాంటి యాడ్స్ రిజెక్ట్ చేస్తూ కోట్లు వదులుకుంటున్న టాలీవుడ్ స్టార్స్..??socialstars lifestyle{#}vegetable market;Varsham;ajay;Chiranjeevi;Masala;Allu Arjun;Tollywood;bollywood;Hindi;INTERNATIONAL;Telugu;IndiaMon, 03 Jun 2024 16:15:00 GMT సెలబ్రిటీలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సినీ, క్రీడా రంగానికి చెందిన వారికి ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఉంటారు.అంతేకాక ప్రముఖులు చెప్పే విషయాలు సామాన్య ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అందుకే వ్యాపారస్తులు తమ ఉత్పత్తులను మార్కెట్ లో ప్రమోట్ చేసేందుకు సెలబ్రిటీలను వాడుకుంటారు. వారికి కోట్ల రూపాయలు ఇస్తూ..తమ ఉత్పత్తులపై యాడ్ చేయిస్తుంటారు. ఎంతో బాలీవుడ్, టాలీవుడ్ హీరోలు ఇలా ఎన్నో రకాల యాడ్స్ లో నటించారు. ఇక హిందీ యాక్టర్లు అయితే ప్రజలకు హానీ కలిగించే గుట్కా, పాన్ మసాల వంటి కూడా యాడ్ చేశారు. కానీ ఇక్కడే టాలీవుడ్ హీరోలకు హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. ఎందుకు, ఏమిటి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం…వ్యాపారవేతలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు సెలబ్రిటీల ఫ్లాట్ ఫామ్ గా చేసుకుంటారు. ఇక ఫేమ్ లో ఉన్న సెలబ్రిటీలు వివిధ రకాల యాడ్స్ లో నటిస్తూ..పలు రకాల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తుంటారు. అయితే ఇలా వారు ప్రచారం చేసే ఉత్పత్తులో కొన్ని ప్రజలకు హానీ కలిగించేవి ఉంటాయి. ముఖ్యంగా మద్యం, గుట్కా, పాన్ మసాలా వంటి వాటిని ప్రమోట్ చేసే విషయంలో యాడ్స్ కి కోట్ల రూపాయలు ఇస్తుంటారు. అందుకే చాలా మంది బాలీవుడ్ హీరోలో అలాంటి యాడ్స్ లో నటించారు. అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, అమితాబచ్చన్ , షారుఖాన్ వంటి వారు పాన్ మసాల ఉత్పత్తుల యాడ్స్ చేశారు. అలానే మాజీ టీమిండియా క్రికెటర్ కపిల్ దేవ్ సైతం పాన్ మసాల ఉత్పత్తులపై యాడ్ చేశారు. ఇలా ఎంతో మంది నార్త్ ఇండియా సెలబ్రిటీలు ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులకు యాడ్లు చేసి.. కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు.

ఈ విషయంలో టాలీవుడ్ హీరోలను మెచ్చుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఏ ఒక్క తెలుగు హీరో కూడా పాన్ మసాలా, మద్యం వంటి ప్రజల ఆరోగ్యాని హాని కలిగించే ఉత్పత్తుల యాడ్స్ లో నటించలేదు. కోట్లాది రూపాయలు ఆఫర్ చేసిన కూడా ప్రజల ఆరోగ్యం కంటే డబ్బులు ముఖ్యం కాదు అన్నట్లు టాలీవుడ్ హీరోలు స్పందించారు. గతంలో ప్రభాస్, మహేశ్ బాబు, చిరంజీవి వంటి స్టార్ హీరోలకు ఇలాంటి యాడ్స్ చేయాలని ఆఫర్లు వచ్చాయి. కోట్లాది రూపాయలు ఇస్తామని కూడా ఆఫర్ చేసినా.. వారు అంగీకరించలేదు. అలానే ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న మద్యం కంపెనీ రూ.10 కోట్లు ఆఫర్ చేసిందని టాక్. అయితే ఆ యాడ్ లో నటించేందుకు బన్నీ ఒప్పుకోలేదట. కేవలం 60 సెకన్లు మాత్రమే కనిపిస్తేచాలని కోరాయట.కానీ ఆ డీల్ ను బన్నీ చాలా సున్నీతంగా తిరష్కరించారట. ఇలా మొత్తంగా మద్యం, సిగరెట్స్, గుట్కా తదితర దుర్వస్యనాల యాడ్స్ లలో నటిస్తే ప్రజల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు, సమాజంలో చెడును వ్యాప్తి చేసినట్లు అవుతుందని టాలీవుడ్ హీరోలు భావిస్తున్నారు. అందుకే ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా తాము ప్రజలకు హానికరం చేసే వస్తువులను ప్రమోట్ చేయనట్లు తెలుగు హీరోలు ఉన్నారు. ఇలా కోట్లు వదులుకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరోలపై ప్రజలు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజమైన హీరోయిజం అంటే ఇదే కదా అంటూ తెలుగు హీరోలపై ప్రశంస వర్షం కురిపిస్తున్నారు. మరి.. ఇలా కోట్లు వదులుకుని ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని భావిస్తున్న టాలీవుడ్ హీరోలపై మీ అభినందనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>