PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/undavalli-arun-kumar-ap-politics-2024614122c4-8e5e-4223-87db-f9690c064a59-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/undavalli-arun-kumar-ap-politics-2024614122c4-8e5e-4223-87db-f9690c064a59-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లోని సార్వత్రిక ఎన్నికలు దేశమంతట హార్ట్ టాపిక్ గా మారుతున్నాయి. లోక్సభ ఎన్నికల పైన ఏపీలో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ కూడా వెలుపడ్డాయి. ఇందులో జాతీయస్థాయిలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ తేల్చేశాయి.. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి పార్టీ విజయం సాధిస్తుందని.. కూటమి గెలుస్తుందని మరికొన్ని సర్వేలు కూడా తెలియజేశాయి. వీటి పైన కాంగ్రెస్ మాజీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజన జరundavalli arun kumar;AP;POLITICS;2024{#}Vundavalli Aruna Kumar;Heart;Yevaru;Assembly;Bharatiya Janata Party;Elections;Telangana;Andhra Pradesh;Congress;June;CBN;Jagan;YCPఏపీ: ఎగ్జిట్ పోల్స్ పై.. ఉండవల్లి సంచలన కామెంట్స్..!ఏపీ: ఎగ్జిట్ పోల్స్ పై.. ఉండవల్లి సంచలన కామెంట్స్..!undavalli arun kumar;AP;POLITICS;2024{#}Vundavalli Aruna Kumar;Heart;Yevaru;Assembly;Bharatiya Janata Party;Elections;Telangana;Andhra Pradesh;Congress;June;CBN;Jagan;YCPSun, 02 Jun 2024 19:43:03 GMTఆంధ్రప్రదేశ్లోని సార్వత్రిక ఎన్నికలు దేశమంతట హార్ట్ టాపిక్ గా మారుతున్నాయి. లోక్సభ ఎన్నికల పైన ఏపీలో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ కూడా వెలుపడ్డాయి. ఇందులో జాతీయస్థాయిలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ తేల్చేశాయి.. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి పార్టీ విజయం సాధిస్తుందని.. కూటమి గెలుస్తుందని మరికొన్ని సర్వేలు కూడా తెలియజేశాయి. వీటి పైన కాంగ్రెస్ మాజీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించడం జరిగింది.


తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజన జరిగి ఇప్పటికే 10 సంవత్సరాలు అవుతున్న ఆంధ్రప్రదేశ్ సమస్యలు అలాగే ఉన్నాయని తెలియజేశారు. ఏపీలో ఎన్నికలు జరిగి ఫలితాలు విడుదలై అధికారాలు చేపడుతున్న ఎవరు కూడా కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు తెచ్చుకోలేని ప్రభుత్వాలు ఎందుకంటు తెలియజేశారు. గతంలో చంద్రబాబు ధర్మపోరాటం చేసిన ఈ ఐదేళ్లు జగన్ ఎన్నో ప్రయత్నాలు చేసిన ఫలితం మాత్రం లేదని తెలిపారు. మరొకవైపు తెలంగాణలో టిఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడుకునే పరిస్థితి ఉందని తెలిపారు.


అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాత్రం జగన్ చంద్రబాబు ఎవరో ఒకరే ఉంటున్నారని అలాంటి పరిస్థితి అసలు ఉండకూడదని కోరుకుంటున్నట్లుగా తెలిపారు ఉండవల్లి.. ఈ ఎన్నికలలో ఓడిన ఎవరు కూడా సర్వనాశనం కారని గుర్తు చేశారు..గతంలో వాజ్ పాయ్,ఎన్టీఆర్ వంటి వారు ఓడిన తర్వాతే గెలిచారని కూడా గుర్తు చేశారు. రాజకీయాల్లో ఏది కూడా శాశ్వతం కాదని గెలిచేది ఎవరైనా అధికారం తమ వ్యక్తిత్వం కోసం కాకుండా ప్రజల మంచి బాగోగుల కోసం ఉపయోగించాలని తెలియజేశారు. ఈసారి ఎన్నికలు కూడా ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠతను పెంచేస్తున్నాయి. అధికారం పైన అటు రెండు పార్టీలు కూడా చాలా ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. జూన్ 4 వ తేదీన ఫలితాలు విడుదల కాబోతున్నాయి. మరి ఆరోజున ఏం జరుగుతుందో చూడాలి







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>