MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/will-keerthi-win-with-bunny-second-time3594ac1a-8096-4146-8387-f16c62348635-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/will-keerthi-win-with-bunny-second-time3594ac1a-8096-4146-8387-f16c62348635-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నేను శైలజ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ అమ్మడు. మహానటి సినిమాతో తెలుగులో అభిమానులను భారీగా పెంచుకోవడమే కాదు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకుంది.ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలతో కలిసి నటించి మెప్పించింది. కీర్తి చాలా తక్కువ సమయంలోనే అగ్రకథానాయికగా పేరు సంపాదించింది కానీ పెద్దగా ఆఫర్లు మాత్రం రావడం లేదు.చివరగా సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో కనిపించి మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్‏లో రెండు సినిమాల్లో నటిస్తుంటుంది. అలKeerthy Suresh {#}Shaan;Suresh;keerthi suresh;kirti;raghu;rajeev;surya sivakumar;Nenu Sailaja;Mahanati;Na Peru Surya;Naa Peru Surya Naa Illu India;Kollu Ravindra;Allu Arjun;Arjun;rashmika mandanna;Hindi;Chiranjeevi;Heroine;Yevaru;suman;shankar;Posters;Telugu;Hero;Cinemaమరోసారి బన్నీతో పోటీ పడుతున్న కీర్తి.. గెలుస్తుందా?మరోసారి బన్నీతో పోటీ పడుతున్న కీర్తి.. గెలుస్తుందా?Keerthy Suresh {#}Shaan;Suresh;keerthi suresh;kirti;raghu;rajeev;surya sivakumar;Nenu Sailaja;Mahanati;Na Peru Surya;Naa Peru Surya Naa Illu India;Kollu Ravindra;Allu Arjun;Arjun;rashmika mandanna;Hindi;Chiranjeevi;Heroine;Yevaru;suman;shankar;Posters;Telugu;Hero;CinemaSun, 02 Jun 2024 18:29:42 GMTతమిళ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్  నేను శైలజ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ అమ్మడు. మహానటి సినిమాతో తెలుగులో అభిమానులను భారీగా పెంచుకోవడమే కాదు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకుంది.ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలతో కలిసి నటించి మెప్పించింది. కీర్తి చాలా తక్కువ సమయంలోనే అగ్రకథానాయికగా పేరు సంపాదించింది కానీ పెద్దగా ఆఫర్లు మాత్రం రావడం లేదు.చివరగా సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో కనిపించి మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్‏లో రెండు సినిమాల్లో నటిస్తుంటుంది. అలాగే తమిళంలో రఘు తాతా అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తుంది. సుమన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో ఎంఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్, దేవదర్శిని ఇంకా రాజీవ్ లు నటిస్తున్నారు. ఈ సినిమాకు షాన్ రోల్డన్ మ్యూజిక్ అందిస్తున్నారు..ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజై రీసెంట్ గానే ఆకట్టుకుంటుంది. అలాగే టీజర్, పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. 


ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్రయూనిట్. కీర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాబోతున్నారు మేకర్స్.హృదయాన్ని కదిలించే రఘు తాతా మూవీ 2024 ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతుంది. ఇక ఇదే రోజున స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంకా రష్మిక మందన జంటగా రాబోతున్న పుష్ప 2 కూడా రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ మీద ఓ రేంజ్ లో హైప్ వచ్చేసింది. తెలుగులో మాత్రమే కాదు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా పుష్ప 2 సినిమా రిలీజ్ కానుంది. మొత్తం మీద కీర్తి సురేష్ అల్లు అర్జున్ మీద మరోసారి పోటీకి సిద్ధం అయింది. గతంలో అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాతో కీర్తి మహానటి సినిమాతో పోటీ పడగా మహానటి హిట్ అయ్యి నా పేరు సూర్య ప్లాప్ అయింది. ఈసారి రెండోసారి పోటీ పడుతున్న వీరిద్దరిలో ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>