PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr-brs-telanagana-harish-rao-ktr-congress081ac973-250e-4104-88ef-cf339f5346f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr-brs-telanagana-harish-rao-ktr-congress081ac973-250e-4104-88ef-cf339f5346f1-415x250-IndiaHerald.jpgబీఆర్ఎస్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడినటువంటి పార్టీ. ఈ పార్టీ అధినేత కేసిఆర్ తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసి ఉద్యమాన్ని మొదలుపెట్టి ఉర్రూతలూగించారు. చివరికి పట్టిన పట్టును విడవకుండా విద్యార్థులను, మేధావులను, చిన్నా,పెద్దా ముసలి, ముతకా అనే తేడా లేకుండా అందరినీ ఏకం చేసి ఒకే నినాదం పైకి తీసుకువచ్చారు అదే జై తెలంగాణ. అలా పోరాటాన్ని సలిపి, కాలికి గజ్జ కట్టి, గొంతెత్తి తెలంగాణ ప్రజల కష్టాన్ని పాట ద్వారా మాట ద్వారా ఢిల్లీ దాకా వినిపించేలా చేశారని చెప్పవచ్చు. అలాంటి కేసీఆర్ వెంట ఎంతోమంది ఉద్యమ నాయkcr ;brs;telanagana;harish rao;ktr;congress{#}Delhi;Backward Classes;kaleshwaram;Parliament;Huzurabad;Yevaru;KCR;House;CM;Party;Election;Congress;June;Telangana;Bharatiya Janata Partyబీఆర్ఎస్ పోతే: ఉద్యమాల పార్టీకి ఊపిరాడట్లేదు..!బీఆర్ఎస్ పోతే: ఉద్యమాల పార్టీకి ఊపిరాడట్లేదు..!kcr ;brs;telanagana;harish rao;ktr;congress{#}Delhi;Backward Classes;kaleshwaram;Parliament;Huzurabad;Yevaru;KCR;House;CM;Party;Election;Congress;June;Telangana;Bharatiya Janata PartySun, 02 Jun 2024 08:44:29 GMT• ఉచిత హామీలే కొంపముంచాయా..?
కేసీఆర్ ని ఓవర్ కాన్ఫిడెన్సే ఓడగొట్టిందా..?
• బీఆర్ఎస్ కి దిక్కు హరీష్ రావేనా..?


బీఆర్ఎస్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడినటువంటి పార్టీ. ఈ పార్టీ అధినేత కేసిఆర్ తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసి ఉద్యమాన్ని మొదలుపెట్టి ఉర్రూతలూగించారు. చివరికి పట్టిన పట్టును విడవకుండా విద్యార్థులను, మేధావులను, చిన్నా,పెద్దా ముసలి, ముతకా అనే తేడా లేకుండా అందరినీ ఏకం చేసి ఒకే నినాదం పైకి తీసుకువచ్చారు అదే జై తెలంగాణ. అలా పోరాటాన్ని సలిపి, కాలికి గజ్జ కట్టి, గొంతెత్తి తెలంగాణ ప్రజల కష్టాన్ని పాట ద్వారా మాట ద్వారా ఢిల్లీ దాకా వినిపించేలా చేశారని చెప్పవచ్చు. అలాంటి కేసీఆర్ వెంట ఎంతోమంది ఉద్యమ నాయకులు, మేధావులు కదిలారు. అంతేకాకుండా ఒక శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య ఇలాంటి ఎందరో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులయ్యారు. మేము చనిపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇక్కడి వారికి ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి చెందుతుందని ఆశించారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎవరి చేతిల్లోకి వెళ్ళింది.. ఎలాంటి అభివృద్ధి చెందింది.. చివరికి బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా అయిపోవడానికి కారకులు ఎవరు అనే వివరాలు చూద్దాం.

 రాజకీయ ప్రస్థానం:
 జూన్ 2, 2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత తొలి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ పదవి బాధ్యతలు చేపట్టారు. అలాంటి ఆయన  రాష్ట్రం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, వృద్ధుల పెన్షన్ పెంపు , రైతుబంధు, రైతు భీమా,  ధరణి, కళ్యాణ లక్ష్మి, షాధీముబారక్ ఇలా ఎన్నో అద్భుతమైన పథకాలు తీసుకువచ్చి పేద ప్రజల దేవుడయ్యారు. అలా అయిదు సంవత్సరాల పాలనలో కేసీఆర్  తెలంగాణకు అద్భుతమైన పాలన అందించారని చెప్పవచ్చు. ఇంట్లో ఒక దేవుడిలా కేసీఆర్ ను కొలిచారు. అలా తెలంగాణను అభివృద్ధి చేయడంలో ప్రథమ పాత్ర పోషించారు కేసీఆర్. 2018 ఎలక్షన్స్ వరకు ఆయన నడవడిక మారింది. తనతో కలిసి ఉద్యమం చేసిన నాయకులంతా పార్టీకి దూరమయ్యారు. ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వారంతా పార్టీకి దగ్గరయ్యారు. డబ్బున్నోడికే పార్టీ సీటు అనే  వ్యవహారం ఆ పార్టీలో బాగా నడిచిందనే ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ ఒక్కొక్క మిస్టేక్ చేసుకుంటూ 2018లో మరోసారి గెలిచారు. పూర్తిగా ప్రతిపక్షం అనేది లేకుండా చేయడానికి అనేక విధాల ప్రయత్నాలు చేసి అందరినీ తన పార్టీలో చేర్చుకున్నారు. కానీ చివరికి అదే తనకు ముప్పుగా మారింది. ప్రజా పాలన రాజ్యాంగ బద్దంగా జరగకుండా తాను చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్టు పాలన చేశారు. దీనివల్ల ప్రజలకు మేలు కలిగినా నష్టం కూడా కలుగుతూ వచ్చింది.

రాష్ట్రమంతా అప్పుల పాలైంది. అంతేకాకుండా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో  దళిత బంధు పేరుతో ఒక ఉచిత హామీ ఇచ్చి అది రాష్ట్రమంతా అమలు చేస్తానని చెప్పారు. అది మరో మైనస్ గా మారింది. బీసీ బందు పేరు చెప్పి కేవలం పార్టీలో ఉండే కొంతమంది నాయకులకు తూతూ మంత్రంగా ఇచ్చి ఆపేశారు. ఇది కూడా మైనస్ అని చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక, నిరుద్యోగ భృతి రాక, పేద ప్రజలకు ఇల్లు లేక, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు.  పది సంవత్సరాలు ఎదురు చూసినా ఇండ్లు అందకపోవడంతో ప్రజలు విసిగి పోయారు. లక్షలాది మందికి రేషన్ కార్డులు లేక మీ సేవల చుట్టూ తిరుగుతూ వచ్చారు. కానీ కేసీఆర్ మాత్రం మళ్ళీ తానే గెలుస్తాననే అపోహలో ఉండిపోయి ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వారందరికీ పార్టీలో స్థానం ఇచ్చి ప్రజల్లో వ్యతిరేకత పెంచుకునేలా చేసుకున్నారు. ఇక ఆయన కింది స్థాయి నాయకుల అరాచకాలు మరీ దారుణంగా తయారైపోయాయి. అలా ప్రజలు ఓపిక పడుతూ వచ్చారు. 2023 ఎలక్షన్స్ వచ్చేసరికి వారి తడాఖా ఏంటో చూపించారు. అటు కాంగ్రెస్ కు అంతు పట్టకుండా, ఇటు బీఆర్ఎస్ కు అంతుపట్టకుండా అనూహ్యమైన ఫలితాన్ని ఇచ్చి కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ఈ ఎలక్షన్స్ లో అసలు కాంగ్రెస్ గెలుస్తుందని అనుకోలేదట. కానీ ప్రజలే  ఈ ఒక్కసారి కెసిఆర్ కి బుద్ధి చెప్పాలని అనుకున్నారట. ఆ విధంగానే కేసీఆర్ ను ఇంట్లో కూర్చోబెట్టారు.

 బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి:
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ మూలన పడుతోంది. రెండుసార్లు అలుపెరుగని విజయాన్ని సాధించినటువంటి కేసిఆర్  మూడోసారి దెబ్బ తిన్నారు. దీంతో పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా బిజెపి, కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారు. ఇక పార్లమెంటు ఎలక్షన్స్ లో మాత్రం  కనీసం ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం రాబోవు రోజుల్లో  అసలు బిఆర్ఎస్ అంటే ఏంటి అనే పరిస్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ స్థానాన్ని పూర్తిగా బిజెపి కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు బిజెపి, కాంగ్రెస్ మధ్య పోటీ జరిగే  పద్ధతి తెలంగాణలో కనిపిస్తూనే ఉందని చెప్పవచ్చు. మరో ఎన్నికల వరకు కేసీఆర్ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పలేం. అలాంటి ఈ తరుణంలో హరీష్ రావే పార్టీకి దిక్కు. ఆయన పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకుంటేనే  పార్టీ బ్రతుకుతుంది తప్ప లేదంటే తెలంగాణలో ఉద్యమ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>