MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4895de17-4fc8-45ba-97f5-56abd6649db3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4895de17-4fc8-45ba-97f5-56abd6649db3-415x250-IndiaHerald.jpgతెలుగు ఆడియన్స్ కి మీరాజాస్మిన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆమె చేసిన తెలుగు సినిమాలు తెలుగు ప్రేక్షకులను అంతలా ఆకట్టుకున్నాయి. తెలుగు అమ్మాయి లా కనిపిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈమె. అమ్మాయి బాగుంది అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఆ తరువాత వరుస సినిమాల్లో నటించింది. భద్ర గోరింటాకు గుడుంబా శంకర్ వంటి సినిమాలు చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇటీవల విమానం అనే సినిమాలో నటించి మళ్లీ తెలుగు సినీ ఇండస్ట్రీకి రీ tollywood{#}Meera;Ram Gopal Varma;sri vishnu;Gudumba Shankar;Girl;Posters;Darsakudu;Comedy;marriage;Audience;media;Hero;Telugu;Director;Cinema;Newsయువరాణిలా యంగ్ హీరో మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్న మీరాజాస్మిన్..!?యువరాణిలా యంగ్ హీరో మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్న మీరాజాస్మిన్..!?tollywood{#}Meera;Ram Gopal Varma;sri vishnu;Gudumba Shankar;Girl;Posters;Darsakudu;Comedy;marriage;Audience;media;Hero;Telugu;Director;Cinema;NewsSun, 02 Jun 2024 18:10:00 GMTతెలుగు ఆడియన్స్ కి మీరాజాస్మిన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆమె చేసిన తెలుగు సినిమాలు తెలుగు ప్రేక్షకులను అంతలా ఆకట్టుకున్నాయి. తెలుగు అమ్మాయి లా కనిపిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈమె. అమ్మాయి బాగుంది అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఆ తరువాత వరుస సినిమాల్లో నటించింది. భద్ర గోరింటాకు గుడుంబా శంకర్ వంటి సినిమాలు చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇటీవల

 విమానం అనే సినిమాలో నటించి మళ్లీ తెలుగు సినీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది.  తాజాగా ఆమె మరొక సినిమాలో కూడా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే శ్రీ విష్ణు హీరోగా స్వాగ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. హసిత్ గోలి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్గా కనిపించబోతోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ  నేపథ్యంలో వస్తున్న ఇందులో మీరా జాస్మిన్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా

 సమాచారం వినబడుతుంది. అంతేకాదు తాజాగా దానికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు మేకర్స్. మహారాణి లాగా కనిపిస్తున్న మీరాజాస్మిన్ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే ప్రస్తుతం తనకి సంబంధించిన  పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక స్వగ్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల లాంఛనంగా మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి కాంబోలో ఇప్పటికే రాజ రాజ చోర అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. మరి ఇందులో మీరా జాస్మిన్ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>