PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/exit-polls-rahul-gandhi-modi-mallikarjun-kharge-congress-bjp7decb6a1-9469-43c8-afca-b039a5ffae88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/exit-polls-rahul-gandhi-modi-mallikarjun-kharge-congress-bjp7decb6a1-9469-43c8-afca-b039a5ffae88-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో ఏడు విడతల ఎలక్షన్స్ జరిగాయి. ఈ తరుణంలో మొత్తం జూన్ 4వ తేదీన రిజల్ట్ అనేది బయటకు రానున్నాయి. ఈ క్రమంలోనే అనేక సర్వే సంస్థలు ఎన్డీఏ కూటమి గెలుస్తుందంటే మరికొన్ని సర్వే సంస్థలు ఇండియా కూటమి గెలుస్తుందని చెబుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలన్నింటిలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పాయి. దాదాపు అటు ఇటుగా 400 సీట్లు చేరుకుంటుందని, ఇండియా కూటమికి 167 సీట్లు మాత్రమే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.exit polls;rahul gandhi;modi;mallikarjun kharge;congress;bjp{#}rahul;siddhu;Rahul Gandhi;Rahul Sipligunj;Election;media;Government;June;India;Survey;Congress;Bharatiya Janata Partyరాహుల్ గాంధీ: ఆ ఎగ్జిట్ పోల్స్ తప్పు.. అవి మోడీ మీడియా పోల్స్..!రాహుల్ గాంధీ: ఆ ఎగ్జిట్ పోల్స్ తప్పు.. అవి మోడీ మీడియా పోల్స్..!exit polls;rahul gandhi;modi;mallikarjun kharge;congress;bjp{#}rahul;siddhu;Rahul Gandhi;Rahul Sipligunj;Election;media;Government;June;India;Survey;Congress;Bharatiya Janata PartySun, 02 Jun 2024 16:11:33 GMT ప్రస్తుతం దేశంలో ఏడు విడతల ఎలక్షన్స్ జరిగాయి. ఈ తరుణంలో మొత్తం జూన్ 4వ తేదీన రిజల్ట్ అనేది బయటకు రానున్నాయి. ఈ క్రమంలోనే అనేక సర్వే సంస్థలు  ఎన్డీఏ కూటమి గెలుస్తుందంటే మరికొన్ని సర్వే సంస్థలు ఇండియా కూటమి గెలుస్తుందని చెబుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలన్నింటిలో  ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పాయి.  దాదాపు అటు ఇటుగా 400 సీట్లు చేరుకుంటుందని, ఇండియా కూటమికి 167 సీట్లు మాత్రమే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 

ఈ తరుణంలోనే  ఎగ్జిట్ పోల్స్ పై స్పందించినటువంటి రాహుల్ గాంధీని జాతీయ మీడియా ప్రశ్నించింది. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగింది. దీనిపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సిద్దు మూసెవాళ పాట  295 పాట వినలేదా అని అడిగారు. అంటే పరోక్షంగా కూటమికి 295 సీట్లు వస్తాయని తెలియజేశారు. ఎగ్జిట్ పోల్స్ ను ఎద్దేవా చేశారు. ఇవి ఎగ్జిట్ పోల్స్ కావని మోడీ మీడియా పోల్స్ అని తెలియజేశారు. అవన్నీ వారికి వారే ఊహాజనితంగా వేసుకున్న లెక్కలని అన్నారు. జూన్ 4వ తేదీన క్లియర్ గా ఫలితాలు వస్తాయని  తెలియజేశారు. ఈ సందర్భంలోనే కాంగ్రెస్ ఒక కీలకమైన సమావేశం నిర్వహించుకుంది.  ఆ సమావేశం సందర్భంగానే మీడియా ప్రశ్నలకు రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు.

అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత కేసి వేణుగోపాల్  ఈ భేటీపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు.  ఎగ్జిట్ పోల్స్ అన్ని బోగస్ అంటూ కొట్టి పారేశారు. కూటమి 295 సీట్లు తప్పక సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  ఇప్పటికే పలు రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రులు   కీలక లీడర్లతో సమావేశాలు ఏర్పాటు చేశామని  వారంతా విజయాలపై ధీమాగా ఉన్నారని ఎగ్జిట్ పోల్స్ అనేది  బిజెపి సృష్టించినటువంటి బోగస్ అని,  రాబోయేది ఇండియా కూటమి అంటూ తెలియజేశారు. ప్రస్తుతం వారు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>