PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/telangana-brs-party-down-and-under5f359725-d998-4315-9fb8-010dc749972a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/telangana-brs-party-down-and-under5f359725-d998-4315-9fb8-010dc749972a-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత... డీలపడ్డ గులాబీ పార్టీకి ఊపిరి వచ్చింది. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో... గులాబీ జెండా ఎగిరింది. ఆదివారం రోజున విడుదలైన ఎన్నికల ఫలితాలలో... 111 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి పై టిఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి గ్రాండ్ విక్టరీ కొట్టాడు. ముందుగా అందరూ ఊహించినట్లుగానే మహబూబ్నగర్ గడ్డపైన గులాబీ జెండా ఎగిరింది. KCR{#}sunday;Revanth Reddy;zero;Jeevan Reddy;Mahbubnagar;Venkatesh;Elections;Parliment;Party;MP;Josh;KCR;Congress;Telangana;Assembly;Survey;Reddyకేసీఆర్ బాపూ : ఇక నిన్నెవరూ ఆపలేరు..కుమ్మేసేయ్ ?కేసీఆర్ బాపూ : ఇక నిన్నెవరూ ఆపలేరు..కుమ్మేసేయ్ ?KCR{#}sunday;Revanth Reddy;zero;Jeevan Reddy;Mahbubnagar;Venkatesh;Elections;Parliment;Party;MP;Josh;KCR;Congress;Telangana;Assembly;Survey;ReddySun, 02 Jun 2024 17:42:23 GMTతెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత... డీలపడ్డ గులాబీ పార్టీకి ఊపిరి వచ్చింది. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో... గులాబీ జెండా ఎగిరింది. ఆదివారం రోజున విడుదలైన ఎన్నికల ఫలితాలలో... 111 ఓట్ల తేడాతో  కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి పై  టిఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి గ్రాండ్ విక్టరీ కొట్టాడు. ముందుగా అందరూ ఊహించినట్లుగానే  మహబూబ్నగర్ గడ్డపైన గులాబీ జెండా ఎగిరింది.
 

 దీంతో కెసిఆర్ పార్టీకి ఊపిరి పోసినట్లు అయింది. మే 13వ తేదీన తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో... గులాబీ పార్టీకి ఘోర పరాభవం ఎదురు అవుతుందని... దాదాపు 90% సర్వే సంస్థలు... రిపోర్ట్ ఇచ్చాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జీరో లేదా ఒకటి ఎంపీ స్థానం మాత్రమే గులాబీ పార్టీ గెలుస్తుందని  అన్ని సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. దీంతో నిన్నటి నుంచి గులాబీ పార్టీ కార్యకర్తలు అలాగే నేతలు పడిపోయారు.

 

ఇలాంటి తరుణంలో... పడి లేచిన కెరటంలా గులాబీ పార్టీ ఎగిసి పడింది. మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసింది. దీంతో ఇవాళ తెలంగాణ  భవన్లో కేసీఆర్ కూడా యాక్టివ్ గా కనిపించారు. మొన్నటి వరకు కర్రతో నడిచిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు... ఇప్పుడు కర్ర లేకుండా దాదాపు రెండు గంటల పాటు ప్రసంగించారు. గెలిచిన ఊపు కేసీఆర్ లో స్పష్టంగా కనిపించింది. అదే ఊపును కార్యకర్తల్లో నింపే ప్రయత్నం చేశారు కేసీఆర్.



 ఇందులో భాగంగానే తెలంగాణ భవన్లో... గులాబీ పార్టీకి ప్రాణం పోసేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి జిల్లాలో  ఎమ్మెల్సీ గెలిచామని...  రేపు ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి హీరో లాగా గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. ఇక ఇప్పుడు ఎన్నికలు జరిగితే గులాబీ పార్టీకి  105 సీట్లు వస్తాయని  మరో బాంబు పేల్చారు కేసీఆర్. అయితే పార్లమెంట్ ఎన్నికల గురించి... ప్రస్తావించకుండా... మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక విజయంపై... మాట్లాడుతూ గులాబీ పార్టీలో జోష్ నింపారు కేసీఆర్. ఇక ఈ విజయంతో గులాబీ పార్టీ నేతలు అలాగే కార్యకర్తలు కూడా ఫుల్ జోష్ లోకి వచ్చారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>