PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-chandrababu-pawan-lokesh-balayya-counting-roundla-vivaralu75a86aca-a985-49bf-b3ec-70cdf4299c78-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-chandrababu-pawan-lokesh-balayya-counting-roundla-vivaralu75a86aca-a985-49bf-b3ec-70cdf4299c78-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ వివరాలను పలు సంస్థలు విడుదల చేశాయి. ప్రధాన పార్టీల నేతల్లో చాలావరకు గత ఎన్నికలలో పోటీ చేసిన స్థానాలలోనే ఈసారి కూడా పోటీ పడ్డారు.వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేశారు. ఇక్కడ టీడీపీ నుంచి మారెడ్డి రవింద్రనాథ్ రెడ్డి బరిలో ఉన్నారు.కుప్పం అసెంబ్లీ నియోజకర్గం నుంచి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పోటీలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా ఎమ్మెల్సీగా ఉన్న భరత్‌ను తొలిసారి వైసీపీ పోటీలో దింపింది. మంగళగిరి నుంచి టీడీపీasembly elections{#}ravindranath;Pulivendula;Gajuwaka;Mangalagiri;geetha;Nara Lokesh;Lokesh;Lokesh Kanagaraj;pithapuram;Janasena;CBN;Balakrishna;ravi anchor;CM;Assembly;TDP;Jagan;kalyan;Survey;YCPఏపీ : జగన్, చంద్రబాబు, పవన్,లోకేష్, బాలయ్య... కౌంటింగ్ రౌండ్లు..?ఏపీ : జగన్, చంద్రబాబు, పవన్,లోకేష్, బాలయ్య... కౌంటింగ్ రౌండ్లు..?asembly elections{#}ravindranath;Pulivendula;Gajuwaka;Mangalagiri;geetha;Nara Lokesh;Lokesh;Lokesh Kanagaraj;pithapuram;Janasena;CBN;Balakrishna;ravi anchor;CM;Assembly;TDP;Jagan;kalyan;Survey;YCPSun, 02 Jun 2024 19:31:59 GMTఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ వివరాలను పలు సంస్థలు విడుదల చేశాయి. ప్రధాన పార్టీల నేతల్లో చాలావరకు గత ఎన్నికలలో పోటీ చేసిన స్థానాలలోనే ఈసారి కూడా పోటీ పడ్డారు.వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేశారు. ఇక్కడ టీడీపీ నుంచి మారెడ్డి రవింద్రనాథ్ రెడ్డి బరిలో ఉన్నారు.కుప్పం అసెంబ్లీ నియోజకర్గం నుంచి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పోటీలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా ఎమ్మెల్సీగా ఉన్న భరత్‌ను తొలిసారి వైసీపీ పోటీలో దింపింది. మంగళగిరి నుంచి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేశారు. మంగళగిరిలో వైసీపీ తరఫున మురుగుడు లావణ్య పోటీలో ఉన్నారు.పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేశారు. గత ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసిన ఆయన గెలవలేదు. పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. సీనియర్ నాయకురాలు వంగా గీత ఇక్కడి నుంచి వైసీపీ తరపున పోటీలో ఉన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని ప్రధాన నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాన నేతలైనటువంటి బాలకృష్ణ, లోకేష్ లకు సంబంధించిన నియోజకవర్గాలకు ఈవీఎం లెక్కింపులు ఎన్ని రౌండ్లు జరుగుతాయి అనే విషయం ఆసక్తికరంగా మారింది.జగన్ పోటీ చేస్తున్న పులివెందుల నియోజకవర్గం సంబంధించి అక్కడ ఓట్ల లెక్కింపు మొత్తం 22 రౌండ్లలో జరగనుంది.అయితే ఇక్కడ జగన్‌కు రికార్డు మెజారిటీ గెలుస్తుందని వైసీపీ నమ్మకంగా ఉండగా, టీడీపీకి అభ్యర్థి బీటెక్ రవి మాత్రం ఈసారి పులివెందుల చరిత్ర మారనుందని ధీమా వ్యక్తం చేశారు.ఇక బాలయ్య హిందూపురం విషయానికి వస్తే అక్కడ మొత్తం 19 రౌండ్లు కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఈసారి బాలయ్య ఖచ్చితంగా హ్యాపీ కొట్టడం ఖాయమని టిడిపి నేతలు అంటున్నారు.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేసిన నియోజకవర్గమైన కుప్పంలో 18 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. ఆరా సర్వే ప్రకారం చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీతో గెలుస్తారని  తేలింది.ఈసారి ఎన్నికలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి వైసిపి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు అక్కడ మొత్తం 18 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. పవన్ కళ్యాణ్ కు పోటీగా  జగన్ వంగా గీతా ను బరిలోదించారు. అయితే నిన్న వచ్చిన సర్వేలో వంగా గీతాపై పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తారని తెలిసింది.లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో 21 రౌండ్ల కౌంటింగ్ జరగనుంది. ఇక్కడ కౌంటింగ్ చాలా సమయం తీసుకునే ప్రక్రియ కానుంది. నారా లోకేష్ ఈసారి ఈ సెగ్మెంట్ గెలుస్తామని  టీడీపీ నేతలు ధీమాతో ఉన్నారు






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>