Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sajavuga-saaguthunna-mlc-upaennima1ddb8b55-dbc0-452a-87ad-e32b134b5f02-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sajavuga-saaguthunna-mlc-upaennima1ddb8b55-dbc0-452a-87ad-e32b134b5f02-415x250-IndiaHerald.jpgమహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతుంది ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాయ్స్ జూనియర్ కళాశాలలో ప్రస్తుతం పటిష్టమైన బందోబస్తు మధ్య ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 1439 ఓటర్లకు గాను 1437 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ రCountinh{#}Kumaar;sudarshan;Jeevan Reddy;రాజీనామా;March;Mahbubnagar;Jr NTR;Huzur Nagar;local language;Parliment;Congress;June;District;Yevaru;Assembly;Partyసజావుగా సాగుతున్న.. మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్?సజావుగా సాగుతున్న.. మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్?Countinh{#}Kumaar;sudarshan;Jeevan Reddy;రాజీనామా;March;Mahbubnagar;Jr NTR;Huzur Nagar;local language;Parliment;Congress;June;District;Yevaru;Assembly;PartySun, 02 Jun 2024 10:09:00 GMTమహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతుంది  ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాయ్స్ జూనియర్ కళాశాలలో ప్రస్తుతం పటిష్టమైన బందోబస్తు మధ్య ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 1439 ఓటర్లకు గాను 1437 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి  జీవన్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో నిలిచారు అని చెప్పాలి. ఏప్రిల్ రెండవ తేదీన కౌంటింగ్ జరగాల్సి ఉంది. కానీ ఇక పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కౌంటింగ్ తేదీని మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే జూన్ రెండవ తేదీకి ఎన్నికల సంఘం ఇక ఈ కౌంటింగ్ వాయిదా వేయగా.. నేడు ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.


 ఇలాంటి పరిస్థితుల్లో మెహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యంగా మారిపోయింది అని చెప్పాలి. దీంతో మార్చి 28వ తేదీన ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక  నిర్వహించింది ఎన్నికల సంఘం. రాష్ట్రంలో అధికార మార్పిడి అనంతరం జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికను అటు బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్. అయితే పోలింగ్ ముందు వరకు కూడా ఇరు పార్టీలు క్యాంపు పాలిటిక్స్ రసవత్తారంగా సాగాయ్. క్రాస్ ఓటింగ్ పై రెండు పార్టీల్లో కూడా ఆందోళన వాతావరణం నెలకొంది అని చెప్పాలి. అయితే కౌంటింగ్ కోసం మొత్తంగా ఐదు టేబుల్ ఏర్పాటు చేశారు. నాలుగు టేబుల్ లపై 300 ఓట్లు మరో టేబుల్ పై 237 ఓట్ల చొప్పున లెక్కించబోతున్నారు అని చెప్పాలి. దీంతో ఇక ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ లో ఎవరు విజయం సాధించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>