PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sajjala-booked-for-provocative-statement-ahead-of-counting5adb41c2-7551-4e12-82dc-2f6751ee9faf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sajjala-booked-for-provocative-statement-ahead-of-counting5adb41c2-7551-4e12-82dc-2f6751ee9faf-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తాజాగా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. ఎవరు ఊహించని విధంగా ఈ ఎగ్జిట్ పోల్స్.. ఫలితాలు వచ్చాయి. అంత కూటమి గెలుస్తుందని... వారు వన్ సైడ్ అవుతుందని... భావించారు. కానీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏపీలో ఎగ్జిట్ ఫలితాలు.. కొన్ని తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఫలితాలు ఇచ్చాయి. sajjala ramakrishna{#}Telugu Desam Party;Krishna River;Indian Postal Service;Election Commission;Manam;Sajjala Ramakrishna Reddy;media;Yevaru;Reddy;YCP;local language;Assembly;Andhra Pradesh;Surveyసజ్జల : ఎగ్జిట్‌ పోల్స్‌ కంటే ఎక్కువ సీట్లు కొడతాం ?సజ్జల : ఎగ్జిట్‌ పోల్స్‌ కంటే ఎక్కువ సీట్లు కొడతాం ?sajjala ramakrishna{#}Telugu Desam Party;Krishna River;Indian Postal Service;Election Commission;Manam;Sajjala Ramakrishna Reddy;media;Yevaru;Reddy;YCP;local language;Assembly;Andhra Pradesh;SurveySun, 02 Jun 2024 07:49:09 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తాజాగా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. ఎవరు ఊహించని విధంగా ఈ ఎగ్జిట్ పోల్స్.. ఫలితాలు వచ్చాయి. అంత కూటమి గెలుస్తుందని... వారు వన్ సైడ్ అవుతుందని... భావించారు. కానీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏపీలో ఎగ్జిట్ ఫలితాలు.. కొన్ని తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఫలితాలు ఇచ్చాయి.


మరి కొన్ని సర్వే సంస్థలు వైసిపి కి అనుకూలంగా రిపోర్టులను ఇచ్చాయి. లోకల్ సర్వేలన్నీ వైసీపీ పార్టీకి అనుకూలంగా రావడం మనం చూసాం. నేషనల్ మీడియా సంస్థలు కొన్ని మాత్రం... తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఫలితాలను ఇచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో... ఎగ్జిట్ ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ సలహాదారుడు... వైసిపి కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు.


ట్రెండ్ అయితే క్లియర్ గా కనబడుతుందని... వైసిపి కి సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా ఉందని మా అంచనా అన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఎగ్జిట్‌ ఫలితాల కంటే ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉంటాయని అనుకుంటున్నామని ధీమా వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణా రెడ్డి. సీరియస్ గా చేసిన సర్వేల్లో వైసిపి గెలుపు అని తేలినట్టు కనిపిస్తుందని వివరించారు. మహిళలు కేంద్రంగా వైసిపి ప్రభుత్వంలో పని చేశామని వివరించారు సజ్జల రామ కృష్ణా రెడ్డి.


అందుకే మహిళలు వైసిపి వైపు మొగ్గు చూపారన్నారు. వైసిపి ప్రచారం అంతా పాజిటివ్ గా సాగిందని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం పై సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నామని స్పష్టం చేశారు సజ్జల రామకృష్ణా రెడ్డి. పోస్టల్ బ్యాలెట్ పై ఈసీ తాను చేసిన నిబంధనలను కాదని ఎలా ఉత్తర్వులు ఇస్తారని నిలదీశారు. ఏపీలో కచ్చితంగా వైసీపీ సర్కార్‌ రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మరోసారి జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారన్నారు సజ్జల రామ కృష్ణా రెడ్డి.










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>