PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayalasima-politices-2024a0c55485-d918-42ed-b8ce-6d69ee2aa9de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayalasima-politices-2024a0c55485-d918-42ed-b8ce-6d69ee2aa9de-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లోని ఓటింగ్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో కూడా చాలా గొడవలు , పలు ప్రాంతాలలో బాంబులు వేసుకోవడం పెట్రోల్ బాంబులు టిడిపి వైసిపి వర్గీల మధ్య గొడవలు అలాగే చంపుకోవడం వంటివి ఎక్కువగా జరిగాయి. అలా అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో గడిచిన వారం క్రితం వైసీపీ నేత శేషాద్రి హత్య జరిగింది. అయితే ఈ హత్య కేసులో ఏకంగా ఏడుగురు నిందితులను సైతం అరెస్టు పోలీసులు చేసినట్టుగా తెలుస్తోంది. ఇరువురు వర్గాల ఆధిపత్య పోరు ఈ హత్యకు కారణమైందనే విధంగా పోలీసులు కారణాలు చెబుతున్నారు. అయితే ఇందులోని నిందితులలో చాలా RAYALASIMA;POLITICES;2024{#}Kumaar;anand malayalam actor;Petrol;Thota Chandrasekhar;Service;Murder.;Annamayya;Anand Deverakonda;Madanapalli;police;TDP;YCP;June;Andhra Pradeshరాయలసీమ: వైసీపీ నేత హత్య.. ఏకంగా ఏడుగురు అరెస్ట్..!రాయలసీమ: వైసీపీ నేత హత్య.. ఏకంగా ఏడుగురు అరెస్ట్..!RAYALASIMA;POLITICES;2024{#}Kumaar;anand malayalam actor;Petrol;Thota Chandrasekhar;Service;Murder.;Annamayya;Anand Deverakonda;Madanapalli;police;TDP;YCP;June;Andhra PradeshSat, 01 Jun 2024 08:10:01 GMTఆంధ్రప్రదేశ్లోని ఓటింగ్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో కూడా చాలా గొడవలు , పలు ప్రాంతాలలో బాంబులు వేసుకోవడం పెట్రోల్ బాంబులు  టిడిపి వైసిపి వర్గీల మధ్య గొడవలు అలాగే చంపుకోవడం వంటివి ఎక్కువగా జరిగాయి. అలా అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో గడిచిన వారం క్రితం వైసీపీ నేత శేషాద్రి హత్య జరిగింది. అయితే ఈ హత్య కేసులో ఏకంగా ఏడుగురు నిందితులను సైతం అరెస్టు పోలీసులు చేసినట్టుగా తెలుస్తోంది. ఇరువురు వర్గాల ఆధిపత్య పోరు ఈ హత్యకు కారణమైందనే విధంగా పోలీసులు కారణాలు చెబుతున్నారు.



అయితే ఇందులోని నిందితులలో చాలా మంది బహుజన సేవ ప్రజా సంఘంలో పనిచేసినటువంటి మణికంఠ, బండి మహేష్, ఆనంద్ ,రాజశేఖర్, చంద్రశేఖర్ రెడ్డి, నజీర్ ఖాన్, చరణ్ కుమార్ ఉన్నట్లుగా తెలియజేశారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్ కి కూడా తరలించినట్లుగా పోలీసులు వెల్లడించారు హత్యకు ఉపయోగించిన ఇనోవా కారు, ఆటో, టూ వీలర్స్ ని సైతం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలియజేశారు. శేషాద్రి ఇంట్లోకి దూరి మరి ఆయనని కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి చంపేశారు. దీంతో ఒక్కసారిగా రాయలసీమలో మరొకసారి ఫ్యాక్షనిజం బయటికి వచ్చింది.


ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఈ క్రమంలోని ఈ ఏడు మంది నిందితులను కూడా అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రికల ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో ఇలా పలుచోట్ల హింసాత్మకమైన ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల కమిషనర్ అధికారులు సైతం శాంతిభద్రతలకు ఎలాంటి లోపం రాకూడదనే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా జూన్ 4వ తేదీన ఫలితాలు వెలుబడుతున్న అనంతరం పెద్ద ఎత్తున బలగాలను అన్ని ప్రాంతాలలో అధికారులు దింపినట్లుగా తెలుస్తోంది. మరికొన్ని ఫ్యాక్షన్ ప్రాంతాలలో కూడా మరింత బందోబస్తుని పెంచడమే కాకుండా అక్కడ నేతలను కూడా ఉండకుండా ఖాళీ చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>