PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-reavanth-rakshanalo-chandrababu-punarjivaramc35d713e-b78e-45bd-b33f-d13b0f4e8fed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-reavanth-rakshanalo-chandrababu-punarjivaramc35d713e-b78e-45bd-b33f-d13b0f4e8fed-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈసారి మరొక కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిసాయి. దీంతో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరొకసారి తెలంగాణ పైన ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే నిన్నటి రోజున తెలంగాణ టిడిపి నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చి మరీ పార్టీ అధ్యక్షుడునీ నియమించేందుకు టిడిపి నేతలు చంద్రబాబు నివాసానికి వెళ్లినట్లుగా సమాచారం. అలా తెలంగాణ టిడిపి ముఖ్య నేతలతో భేటీ అయిన చంద్రబాబు.. రాష్ట్రంలో పార్టీ పూర్వ వైభవానికిREVANTH REDDY;CHANDRABABU{#}revanth;రాజీనామా;Revanth Reddy;Telangana;News;Parliment;CBN;Party;June;Andhra Pradesh;TDPటీడీపి:రేవంత్ రక్షణలో చంద్రబాబు పునరుజ్జీవం?టీడీపి:రేవంత్ రక్షణలో చంద్రబాబు పునరుజ్జీవం?REVANTH REDDY;CHANDRABABU{#}revanth;రాజీనామా;Revanth Reddy;Telangana;News;Parliment;CBN;Party;June;Andhra Pradesh;TDPSat, 01 Jun 2024 10:23:58 GMTతెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈసారి మరొక కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిసాయి. దీంతో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరొకసారి తెలంగాణ పైన ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే నిన్నటి రోజున తెలంగాణ టిడిపి నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చి మరీ పార్టీ అధ్యక్షుడునీ నియమించేందుకు టిడిపి నేతలు చంద్రబాబు నివాసానికి వెళ్లినట్లుగా సమాచారం. అలా తెలంగాణ టిడిపి ముఖ్య నేతలతో భేటీ అయిన చంద్రబాబు.. రాష్ట్రంలో పార్టీ పూర్వ వైభవానికి రావాలని దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం.


ముఖ్యంగా తెలంగాణలో కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేయడంతో గత కొంతకాలంగా టీడీపీ కి అధ్యక్షుడు గా ఎవరిని నియమించలేదు.. ఈ భేటీలో చర్చించిన తర్వాత కొత్త అధ్యక్షుడిని నియమించడం పై నేతలు కూడా తమ అభిప్రాయాలను చంద్రబాబుకు తెలియజేసినట్లు తెలుస్తోంది. జూన్ 4వ తేదీన తెలంగాణ టిడిపి నూతన అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టిడిపి పార్టీ అక్కడ పోటీ చేయాలా వద్దా అనే నిర్ణయంతో చాలా సందిగ్ధత తో  ఉండేది.. కానీ చివరికి పోటీ చేయకూడదనే నిర్ణయం తీసుకోవడం వల్ల..  అక్కడి నేతలు అసంతృప్తికి గురైనట్లు సమాచారం.


అందుకే కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ అధ్యక్షత పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే టిడిపి నేతలు కార్యకర్తలు తెలంగాణలో నిరాశతో ఉన్నట్లుగా తెలుసుకున్న చంద్రబాబు ఇన్ని రోజులకు మళ్లీ ఏపీ ఎన్నికలలో బిజీగా ఉండడం వల్ల ఎలక్షన్ ఫలితాలు వెంటనే తెలంగాణ పైన ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అలాగే టిడిపి పార్టీని క్షేత్రస్థాయిలో కూడా బలోపేతం చేయడంతో పాటు పార్టీ నూతన చీఫ్ నియామకం పైన కూడా దృష్టి పెట్టాలని చూస్తున్నారు. అయితే రాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రేవంత్ రక్షణలో చంద్రబాబు పునర్జీవం పొందే అవకాశం మళ్ళీ కనిపిస్తోంది.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా , ప్రజలందరికీ నాయకుడిగా.. రేవంత్ రెడ్డి నిలవబోతున్నారు.. మరొకవైపు గతంలో రేవంత్ రెడ్డి, చంద్రబాబుకు మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్లే  టిడిపి పార్టీ మళ్లీ తెలంగాణలో పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>