MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthikeya9b0498f2-5cb9-491a-8a69-2d571e97b45f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthikeya9b0498f2-5cb9-491a-8a69-2d571e97b45f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు కార్తికేయ హీరోగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో భజే భాయు వేగం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని యు వి కాన్సెప్ట్స్ బ్యానర్ వారు నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా నిన్న అనగా మే 31 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా నుండి ఈ మూవీ విడుదలకు ముందు మేకర్స్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సిkarthikeya{#}prasanth;aishwarya;karthikeya;kartikeya;Vijayawada;raj;Prashant Kishor;V;bhaskar;Baba Bhaskar;Guntur;Audience;Evening;Andhra Pradesh;Posters;Box office;June;Heroine;Yuva;cinema theater;Cinemaఅఫిషియల్ : రేపు ఆ 4 థియేటర్లకు "భజే వాయు వేగం" టీమ్..!అఫిషియల్ : రేపు ఆ 4 థియేటర్లకు "భజే వాయు వేగం" టీమ్..!karthikeya{#}prasanth;aishwarya;karthikeya;kartikeya;Vijayawada;raj;Prashant Kishor;V;bhaskar;Baba Bhaskar;Guntur;Audience;Evening;Andhra Pradesh;Posters;Box office;June;Heroine;Yuva;cinema theater;CinemaSat, 01 Jun 2024 22:50:00 GMTటాలీవుడ్ యువ నటుడు కార్తికేయ హీరోగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో భజే భాయు వేగం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. 

మూవీ ని యు వి కాన్సెప్ట్స్ బ్యానర్ వారు నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా నిన్న అనగా మే 31 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. 

ఇకపోతే ఈ సినిమా నుండి ఈ మూవీ విడుదలకు ముందు మేకర్స్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. 

అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ లభించింది. 

దానితో ఈ మూవీ కి మొదటి రోజు పరవాలేదు అనే స్థాయి కలెక్షన్ లు వచ్చినప్పటికీ మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు ఈ సినిమాకు కలెక్షన్ లు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇలా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ బృందం అదిరిపోయే రేంజ్ లో ప్రమోషన్ లను చేయడానికి డిసైడ్ అయ్యింది. 

అందులో భాగంగా రేపు ఈ మూవీ యూనిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని రెండు ప్రధాన నగరాల్లోని నాలుగు థియేటర్ లను పర్యటించనుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది. 

ఇకపోతే ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ చిత్ర బృందం రేపు అనగా జూన్ 2 వ తేదీన విజయవాడ నగరం లోని రాజ్ యువరాజ్ థియేటర్ కి మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు వెళ్లనున్నట్లు , ఆ తర్వాత ఇనాక్స్ లైలా మాల్ కి సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు వెళ్ళనున్నట్లు ప్రకటించారు. 

ఇక ఆ తర్వాత గుంటూరు నగరం లోని భాస్కర్ సినిమాస్ థియేటర్ కి సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి  వెళ్ళనున్నట్లు , ఆ తర్వాత మైత్రి సినిమాస్ థియేటర్ కి రాత్రి 7 గంటలకు వెళ్ళనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>