Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap41d656e5-e191-4dea-8be5-797f53c1f313-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap41d656e5-e191-4dea-8be5-797f53c1f313-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు పై ఎంత తీవ్ర స్థాయిలో ఉత్కంఠ నెలకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారు అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఒకవైపు జనసేన బీజేపీ టిడిపి పార్టీలు కూటమిగా బరిలోకి దిగితే.. వైసీపీ మాత్రం సింగిల్గానే బరులోకి దిగింది అన్న విషయం తెలిసిందే . అయితే జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. అయితే ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఫలితాలు విడుదల కాకముందు విడుదల అయ్యే ఎగ్జిటAp{#}Anakapalle;Kumaar;Rajampet;Rajahmundry;Janasena;CM;June;Bharatiya Janata Party;YCP;Nijam;TDP;Andhra Pradesh;Elections;Yevaru;Surveyఆరా మస్తాన్ సర్వే.. మాజీ సీఎం ఓటమి?ఆరా మస్తాన్ సర్వే.. మాజీ సీఎం ఓటమి?Ap{#}Anakapalle;Kumaar;Rajampet;Rajahmundry;Janasena;CM;June;Bharatiya Janata Party;YCP;Nijam;TDP;Andhra Pradesh;Elections;Yevaru;SurveySat, 01 Jun 2024 19:31:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు పై ఎంత తీవ్ర స్థాయిలో ఉత్కంఠ నెలకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారు అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఒకవైపు జనసేన బీజేపీ టిడిపి పార్టీలు కూటమిగా బరిలోకి దిగితే.. వైసీపీ మాత్రం సింగిల్గానే బరులోకి దిగింది అన్న విషయం తెలిసిందే . అయితే జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి.


 అయితే ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఫలితాలు విడుదల కాకముందు  విడుదల అయ్యే ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనాలు దాదాపుగా నిజం అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఎవరికి మెజారిటీ వస్తుంది అనే విషయంపై ప్రజలకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పాలి  అయితే ఇక ఇప్పుడు ఏపీలో అధికారం ఎవరికి దక్కబోతుంది అనే విషయంపై ఎన్నో ఎగ్జిట్ పోల్స్ సర్వేలు సంచలనంగా మారిపోతున్నాయి. కొన్ని సర్వేలు అటు ఏపీలో కూటమిది అధికారం అని చెబుతుంటే ఇంకొన్ని సర్వేలు వైసిపి రెండోసారి అధికారం చేపట్టబోతుంది అని అంచనా వేస్తున్నాయి.


 ఈ క్రమంలోనే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆరా మస్తాన్ సర్వే హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆరా మస్తాన్ సర్వే రిపోర్ట్ ప్రకారం అధికార వైసిపికి ఈ ఎన్నికల్లో కొన్ని సీట్లు తగ్గినప్పటికీ.. మరోసారి అధికారం చేపట్టబోతుంది అని అంచనా వేశారు  అదే సమయంలో ఒక మాజీ సీఎం కి ఓటమి మాత్రం ఖాయమైపోయింది అంటూ ఆరా మస్తాన్ తెలిపారు  ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు అన్న విషయం తెలిసిందే  అయితే అక్కడ ఆయన ఓడిపోతారని ఆరా మస్తాన్ వెల్లడించారు. నరసాపురం, అనకాపల్లి నుంచి బిజెపి ఎంపీ అభ్యర్థులు మంచి మెజారిటీతో గెలుస్తారని ప్రకటించారు. రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్న బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురుందేశ్వరి గట్టి పోటీని ఎదుర్కొంటారు అంటూ ఆరా మస్తాన్ అంచనా వేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>