PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kapaul-an-dmodi87f61e8a-1274-4e61-857c-5c8a03252bdc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kapaul-an-dmodi87f61e8a-1274-4e61-857c-5c8a03252bdc-415x250-IndiaHerald.jpgసార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వ్యక్తం అవుతున్న వేళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కానున్నారని ఆయన చాలా కాన్ఫిడెంట్ గా జోష్యం చెప్పారు. ఎందుకు కాబోతున్నారు అనే దానికి మాత్రం ఆయన ఆన్సర్ చెప్పలేదు. ఆయన మళ్లీ పీఎం ఎందుకు అవుతారో జూన్ 4న స్పష్టంగా వివరిస్తానని అన్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీలు విజయం తమదే అని చంకలు గుద్దుకుంటున్నాయని.. కానీ వైజాగ్‌లో తానే ఎంపీగా గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. తానే గెలవడానికి చాలానే కారkapaul an dmodi{#}K A Paul;Narendra Modi;Vishakapatnam;Election;Election Commission;television;Party;Andhra Pradesh;Prime Minister;Elections;Juneమోడీ విజయంపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు..??మోడీ విజయంపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు..??kapaul an dmodi{#}K A Paul;Narendra Modi;Vishakapatnam;Election;Election Commission;television;Party;Andhra Pradesh;Prime Minister;Elections;JuneSat, 01 Jun 2024 20:33:43 GMTసార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వ్యక్తం అవుతున్న వేళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కానున్నారని ఆయన చాలా కాన్ఫిడెంట్ గా జోష్యం చెప్పారు. ఎందుకు కాబోతున్నారు అనే దానికి మాత్రం ఆయన ఆన్సర్ చెప్పలేదు. ఆయన మళ్లీ పీఎం  ఎందుకు అవుతారో జూన్ 4న స్పష్టంగా వివరిస్తానని అన్నారు.

ఏపీలో వైసీపీ, టీడీపీలు విజయం తమదే అని చంకలు గుద్దుకుంటున్నాయని.. కానీ వైజాగ్‌లో తానే ఎంపీగా గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. తానే గెలవడానికి చాలానే కారణాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా తాను స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుకున్నానని చెప్పారు. 4వ ఫెజ్‌లో ఎన్నికలు జరిగేలాగా దాన్ని చూసుకున్నానని పేర్కొన్నారు. ఈ అన్ని కారణాలవల్ల విశాఖ వాసులు తనకే ఓట్లు వేశారని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఒక్క కాపులు మాత్రమే కాకుండా క్రిస్టియన్లు, బీసీలు, నిరుద్యోగులందరూ తనకు ఓట్లు వేసి తనను గెలిపించబోతున్నారని చెప్పుకొచ్చారు.

ఐ ప్యాక్ సర్వేలో కూడా కేఏ పాల్ గెలవబోతున్నట్లు తేలిందని క్లెయిమ్ చేశారు. తనకు 6 నుంచి 8 లక్షల ఓట్లు రావడం ఖాయమని... 1.5- 3లక్షల మెజారిటీతో గెలవడం ఖాయమని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు చాలామందిని ఆకట్టుకుంటున్నాయి. ఈసారి ఏపీలో ఎలక్షన్స్ సరిగ్గా కండక్ట్ చేయలేదని, ఎవరినీ సరిగ్గా నియంత్రణలో ఉంచడంలో ఈసీ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఆయా పార్టీల వాళ్లు ఎలక్షన్ కమిషన్ నిబంధనలను పూర్తిగా బ్రేక్ చేశారని అన్నారు.

 పోలింగ్ తేదీన కూడా వేల కోట్లు పంపిణీ చేయడం జరిగిందని, రూ.8 వేల కోట్లు పోలీసులకు దొరికాయని ఆరోపించారు. వైజాగ్ లో స్ట్రాంగ్ రూముల వద్ద సరైన సెక్యూరిటీ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీసీ టీవీ యాక్సెస్, లైవ్ లింక్ ఎందుకు పెట్టలేదని అధికారులను సూటిగా ప్రశ్నించారు. కాగా ప్రస్తుతం కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లో బాగా హైలైట్ అవుతున్నాయి. అలాగే ఆయన మోదీ విజయం పై ధీమా వ్యక్తం చేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఏపీ టీడీపీ కూటమిలో ప్రజాశాంతి పార్టీని కలిపినట్లయితే బాగుండేది కదా అని కొంతమంది సరదాగా సలహాలు కూడా ఇస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>