Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kohli496a0441-e40f-49ad-8f49-f019ef8366f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kohli496a0441-e40f-49ad-8f49-f019ef8366f1-415x250-IndiaHerald.jpgటీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ గురించి భారత క్రికెట్ ప్రేరేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే.. అది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే దాదాపు దశాబ్ద కాలానికి పైగానే టీమిండియా తరఫున స్టార్ ప్లేయర్గా హవా నడిపించిన గౌతమ్ గంభీర్.. ఇక ఆటకు విరామం ప్రకటించిన తర్వాత కూడా క్రికెట్కు దగ్గరగానే ఉండవచ్చు. ఈ క్రమంలోనే కామెంటేటర్ గా, కోచ్గా, మెంటార్గా గౌతమ్ గంభీర్ పనిచేసి క్రికెట్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు అయితే గౌతమ్ గంభీర్ తన ఆటతీరూతో ఎంతగా గుర్తింపును సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదుKohli{#}gautham new;Gautam Gambhir;Gautam Adani;Masala;gautham;VIRAT KOHLI;Cricketకోహ్లీతో బంధంపై.. గంభీర్ షాకింగ్ కామెంట్స్?కోహ్లీతో బంధంపై.. గంభీర్ షాకింగ్ కామెంట్స్?Kohli{#}gautham new;Gautam Gambhir;Gautam Adani;Masala;gautham;VIRAT KOHLI;CricketSat, 01 Jun 2024 15:00:00 GMTటీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ గురించి భారత క్రికెట్ ప్రేరేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే.. అది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే దాదాపు దశాబ్ద కాలానికి పైగానే టీమిండియా తరఫున స్టార్ ప్లేయర్గా హవా నడిపించిన గౌతమ్ గంభీర్.. ఇక ఆటకు విరామం ప్రకటించిన తర్వాత కూడా క్రికెట్కు దగ్గరగానే ఉండవచ్చు. ఈ క్రమంలోనే కామెంటేటర్ గా,  కోచ్గా, మెంటార్గా గౌతమ్ గంభీర్ పనిచేసి క్రికెట్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు  అయితే గౌతమ్ గంభీర్ తన ఆటతీరూతో ఎంతగా గుర్తింపును సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 అయితే ఇలా తన ఆట తీరుతోనే కాదు తన వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా ఎప్పుడూ గౌతం గంభీర్ వార్తలలో నిలుస్తూ ఉంటాడు. ఎప్పుడు ఏదో ఒక క్రికెటర్ ని టార్గెట్ చేసుకుంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఉంటాడు. అయితే గంభీర్ లాగానే దూకుడైన యాటిట్యూడ్ కలిగి ఉండే విరాట్ కోహ్లీతో అటు  ఈ మాజీ ప్లేయర్ గొడవ పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే వీరిద్దరి మధ్య గత ఐపిఎల్ సీజన్లో జరిగిన గొడవ అయితే సంచలనంగా మారిపోయింది. ఇక కోహ్లీ అభిమానులు అందరూ కూడా ఎన్నో రోజులపాటు గౌతం గంభీర్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం కూడా చేశారు అని చెప్పాలి.


 ఇక తర్వాత 2024 ఐపీఎల్ లో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ కలిసి మాట్లాడుకోవడంతో వీరిద్దరి మధ్య ఉన్న వివాదం సమసి పోయింది  అయితే కోహ్లీ తో తన బంధం గురించి ఇటీవల గౌతమ్ గంభీర్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయంపై మాట్లాడుతూ.. టీం గెలుపు కోసం అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు నాకు ఎంత ఉందో కోహ్లీకి అంతే ఉంటుంది. మా బంధం ప్రజలకు మసాలా అందించడం కోసం కాదు. వాస్తవికతకు అభిప్రాయానికి వ్యత్యాసం ఉంటుంది అంటూ గౌతమ్ గంభీర్ కామెంట్ చేశాడు. ఈ క్రమంలోనే గంభీర్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిపోయాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>