Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/election-04a8a245-7d0a-4caa-af6c-04e205d9eef0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/election-04a8a245-7d0a-4caa-af6c-04e205d9eef0-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ఎన్నో విషయాలు హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక తెలియని ఎన్నో విషయాలను సోషల్ మీడియా కారణంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోగలుగుతున్నారు. కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన ఎన్నికల హడావిడి నెలకొంది. ఎన్నికల ప్రచారం.. రూల్స్ ప్రకారం అభ్యర్థులు పెట్టాల్సిన ఖర్చు, ఎన్నికల పోలింగ్, ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. అయితే దేశవ్యాప్తంగElection {#}Parliment;Assembly;media;June;Indian Postal Serviceఎన్నికల కౌంటింగ్ హాల్ కు.. ఎంతమంది ఏజెంట్లను అనుమతిస్తారో తెలుసా?ఎన్నికల కౌంటింగ్ హాల్ కు.. ఎంతమంది ఏజెంట్లను అనుమతిస్తారో తెలుసా?Election {#}Parliment;Assembly;media;June;Indian Postal ServiceSat, 01 Jun 2024 13:30:00 GMTఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ఎన్నో విషయాలు హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే  ఇక తెలియని ఎన్నో విషయాలను సోషల్ మీడియా కారణంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోగలుగుతున్నారు. కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన ఎన్నికల హడావిడి నెలకొంది. ఎన్నికల ప్రచారం.. రూల్స్ ప్రకారం అభ్యర్థులు పెట్టాల్సిన ఖర్చు, ఎన్నికల పోలింగ్, ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి.



 అయితే దేశవ్యాప్తంగా పలు విడుతలుగా ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరిగింది. కొన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే జరిగితే ఇంకొన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఫలితాలు.. జూన్ 4వ తేదీన విడుదల కాబోతున్నాయ్ విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని పార్టీలు కూడా అలర్ట్ అయ్యాయి. ఇలా ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. అయితే ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఎంతమంది ఏజెంట్లను కౌంటింగ్ హాలుకు అనుమతిస్తారు అన్న విషయంపై చాలామందికి క్లారిటీ ఉండదు.



ఆ వివరాలు చూసుకుంటే.. ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక కౌంటింగ్ హాల్ కేటాయిస్తారు. ఆ హాల్లో ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేయాలి అనేది అధికారులు నిర్ణయిస్తారు. అయితే ఒక్కో అభ్యర్థి టేబుల్ కు ఒకరి చొప్పున ఏజెంట్లను నియమించుకోవచ్చు. ఉదాహరణకు 14 టేబుల్స్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయిస్తే.. ఒక అభ్యర్థి ఏకంగా 14 మంది ఏజెంట్లను నియమించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక వీరు మాత్రమే కాకుండా అదనంగా రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద ఒక ఏజెంట్ను నియమించుకోవచ్చు. అంతేకాకుండా పోస్టల్ బ్యాలెట్ల పరిశీలనకు మరి కొంతమంది ఏజెంట్లను కూడా నియమించుకునేందుకు అవకాశం ఉంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>