PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/is-kadapa-district-a-stronghold-for-jagand2596caf-b338-46bd-a1d5-98708309bdc3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/is-kadapa-district-a-stronghold-for-jagand2596caf-b338-46bd-a1d5-98708309bdc3-415x250-IndiaHerald.jpgఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 వ సంవత్సరంలో మొదటి సారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో తెలుగు దేశం పార్టీ భారీ సీట్లను దక్కించుకొని అధికారం లోకి వచ్చింది. ఇక 2019 వ సంవత్సరం జరిగిన ఎన్నికలలో టిడిపి అతి తక్కువ స్థానాలను మాత్రమే దక్కించుకోగా వైసిపి పార్టీ మాత్రం ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను దక్కించుకొని ఆంధ్ర రాష్ట్రంలో అధికారం లోకి వచ్చింది. ఇకపోతే మే 13 వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో పోయిన సారి కంటే ఎకycp{#}Hanu Raghavapudi;Telugu Desam Party;Jagan;Reddy;Parliment;Nijam;Assembly;TDP;YCP;Andhra Pradeshపీపుల్స్ పల్స్ రిపోర్ట్ : అన్ని సీట్లకే పరిమితం కానున్న వైసీపీ..!పీపుల్స్ పల్స్ రిపోర్ట్ : అన్ని సీట్లకే పరిమితం కానున్న వైసీపీ..!ycp{#}Hanu Raghavapudi;Telugu Desam Party;Jagan;Reddy;Parliment;Nijam;Assembly;TDP;YCP;Andhra PradeshSat, 01 Jun 2024 19:04:00 GMTఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 వ సంవత్సరంలో మొదటి సారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో తెలుగు దేశం పార్టీ భారీ సీట్లను దక్కించుకొని అధికారం లోకి వచ్చింది. ఇక 2019 వ సంవత్సరం జరిగిన ఎన్నికలలో టిడిపి అతి తక్కువ స్థానాలను మాత్రమే దక్కించుకోగా వైసిపి పార్టీ మాత్రం ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను దక్కించుకొని ఆంధ్ర రాష్ట్రంలో అధికారం లోకి వచ్చింది.

ఇకపోతే మే 13 వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో పోయిన సారి కంటే ఎక్కువ ఓటింగ్ శాతం నమోదు కావడంతో ఇది వైసీపీ కి అనుకూలం కాదు అని , కూటమి కి అనుకూలం అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఇక ఆ తర్వాత ఒక రోజు జగన్ ఓ సమావేశంలో మాట్లాడుతూ మేము మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాము.

పోయిన సారి కంటే మాకు ఎక్కువ సీట్లు వస్తాయి అని చెప్పుకొచ్చాడు. దీనితో ప్రత్యర్ధులు అంతా కంగు తిన్నారు. ఇకపోతే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుదల అవుతున్నాయి. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు ఎగ్జిట్ పోల్స్ కి ఏ మాత్రం సంబంధం లేకుండా నివేదికలు విడుదలవుతున్నాయి. ఇకపోతే దేశంలోనే మంచి క్రేజ్ కలిగిన ఎగ్జిట్ పోల్ సంస్థలలో పీపుల్స్ పల్స్ సంస్థ ఒకటి.

ఈ సంస్థ తాజాగా తన నివేదికను విడుదల చేసింది. ఇందులో వైసీపీ పార్టీ కి కేవలం 45 నుండి 60 సీట్లు మాత్రమే వస్తాయి అని ఓ అంచనా వేసింది. ఈ అంచనా నిజంగానే నిజం అయినట్లు అయితే వైసిపి పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో తన అధికారాన్ని కోల్పోతుంది. మరి ఈ సంస్థ నివేదిక ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>