PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-can-win-can-lose-2024-has-turned-the-wheels5e38dbe4-5cfa-4665-a041-276a08232d7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-can-win-can-lose-2024-has-turned-the-wheels5e38dbe4-5cfa-4665-a041-276a08232d7b-415x250-IndiaHerald.jpgఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితం వ‌చ్చేందుకు మ‌రో నాలుగు రోజుల స‌మ‌యం ఉంది. అయితే.. ఈ ఎన్నిక‌ల‌ను చ‌రిత్రాత్మ‌కంగా మ‌ల‌చ‌డంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ పాత్ర ఎంతో ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి ఎన్నిక‌ల‌కు మూడు మాసాల ముందు వ‌ర‌కు ప‌రిస్థితి వేరేగా ఉంది.అప్ప‌టి వ‌ర‌కు ఏ పార్టీకి ఆ పార్టీ అన్న‌విధంగా ఉన్నాయి. అయితే.. జ‌గ‌న్ ఇస్తున్న సంక్ష‌మం, గ్రామీణ స్థాయిలో కుదురుకున్న ఓటు బ్యాంకు.. వంటివి ప్ర‌తిప‌క్షాల‌కు స‌హ‌జంగానే భ‌యోత్పాతాన్ని సృష్టించాయి. దీంతో జ‌గ‌న్ కోసం.. జ‌గ‌న్ వ‌ల‌న‌.. అన్న‌ట్టుగా టీడీపీ-AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; ys jagan; ycp; ysrcp; 2024{#}YCP;TDP;Partyజ‌గ‌న్.. గెల‌వ‌చ్చు.. ఓడిపోవ‌చ్చు.. 2024ను గింగ‌రాలు తిప్పారు ..!జ‌గ‌న్.. గెల‌వ‌చ్చు.. ఓడిపోవ‌చ్చు.. 2024ను గింగ‌రాలు తిప్పారు ..!AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; ys jagan; ycp; ysrcp; 2024{#}YCP;TDP;PartySat, 01 Jun 2024 07:50:41 GMTఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితం వ‌చ్చేందుకు మ‌రో నాలుగు రోజుల స‌మ‌యం ఉంది. అయితే.. ఈ ఎన్నిక‌ల‌ను చ‌రిత్రాత్మ‌కంగా మ‌ల‌చ‌డంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ పాత్ర ఎంతో ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి ఎన్నిక‌ల‌కు మూడు మాసాల ముందు వ‌ర‌కు ప‌రిస్థితి వేరేగా ఉంది.అప్ప‌టి వ‌ర‌కు ఏ పార్టీకి ఆ పార్టీ అన్న‌విధంగా ఉన్నాయి. అయితే.. జ‌గ‌న్ ఇస్తున్న సంక్ష‌మం, గ్రామీణ స్థాయిలో కుదురుకున్న ఓటు బ్యాంకు.. వంటివి ప్ర‌తిప‌క్షాల‌కు స‌హ‌జంగానే భ‌యోత్పాతాన్ని సృష్టించాయి.


దీంతో జ‌గ‌న్ కోసం.. జ‌గ‌న్ వ‌ల‌న‌.. అన్న‌ట్టుగా టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన‌లు ఒకే ఒర‌లో ఇమేడేలా రాజ‌కీయం మారిపోయింది. దీనికి ఏకైక కార‌ణంగా బ‌ల‌మైన జ‌గ‌న్‌ను గ‌ద్దెదించాల‌నే ల‌క్ష్యం ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న రాజ‌కీయాల‌ను ఒంట‌రిగా అయితే.. ఎదుర్కొన‌లేమ‌నేవాద‌న ఏర్ప‌డ‌డ‌మే. ఇదే మ‌న‌కు 2009లో నూ క‌నిపించింది. ఇక‌, దీంతోపాటు.. ఉచితాల‌కు బ‌ద్ధ వ్య‌తిరేకి, అభివృద్ధి ప్ర‌దాత‌గా పేరొందిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. చివ‌ర‌కు ఉచితాల‌తోనే ప్ర‌యాణాలు చేయాల్సి వ‌చ్చింది. ఇది నిజంగా జ‌గ‌న్ ఘ‌న‌తే అవుతుంది.


మ‌రీ ముఖ్యంగా కుటుంబాల‌కు కుటుంబాలే.. రోడ్డు ప‌ట్టాయి. జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేశాయి. ఇవ‌న్నీ.. జ‌గ‌న్ వ‌ల‌న జ‌రిగిన మార్పులే త‌ప్ప‌.. మ‌రొక‌టి కాద‌నేది నిష్టుర స‌త్యం. 2009లో వైఎస్ బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ.. కుటుంబాల‌కు కుటుంబాలు రోడ్డెక్కిన ప‌రిస్థితి లేదు. అప్ప‌ట్లోనూ పార్టీలు చేతులు క‌లిపాయి. మ‌హాకూట‌మిగా ముందుకు వ‌చ్చాయి. ఈ ప‌రిణామం అప్ప‌ట్లోచ‌ర్చ‌నీయాంశం అయినా.. కుటుంబాల్లోని మ‌హిళ‌లు మాత్రం  ముందుకు రాలేదు. కానీ, ఇప్పుడు వ‌చ్చాయంటే జ‌గ‌న్ ప్ర‌భావ‌మే.


రేపు జ‌గ‌న్ ఓడుతారా ?  గెలుస్తారా ?  అనేది ప‌క్క‌న పెడితే.. ఆయ‌న ఈ ఎన్నిక‌ల‌కు కింగ్‌గా అయితే మారి పోయారు. పార్టీల‌ను గెలిపించుకోక‌పోతే.. లేదా.. మెజారిటీ అయినా.. సాధించుకోక‌పోతే.. రానున్న కొన్ని ద‌శాబ్దాల పాటు ఇక‌, మ‌నుగ‌డ కూడా క‌ష్ట‌మ‌నే భావ‌న క‌ల్పించేలా ప‌రిస్థితులు మారిపోయాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల‌కు మ‌ధ్య సంపూర్ణ వ్య‌త్యాసం క‌నిపిస్తుంది. ఈ మార్పులు.. ఈదూకుడుకు.. కార‌ణం..క‌ర్త కూడా.. జ‌గ‌నే కావ‌డం గ‌మ‌నార్హం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>