PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-ap-elections-survey-telangana-parliament-elections-andhrapradesh-assembly-elections-assembly-elections-2024-ap-map-hyderabad-96f63490-1ac6-4ac2-8745-d2c66b61cb56-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-ap-elections-survey-telangana-parliament-elections-andhrapradesh-assembly-elections-assembly-elections-2024-ap-map-hyderabad-96f63490-1ac6-4ac2-8745-d2c66b61cb56-415x250-IndiaHerald.jpg- చారిత్ర‌క న‌గ‌రంతో ఎప్ప‌ట‌కీ తెగ‌ని బంధం ఆంధ్రోడిది - ఇరానీ చాయ్ రుచులు.. బిర్యానీ టేస్టు, పాత‌బ‌స్తీ ముచ్చ‌ట్లు మ‌ర్చిపోలేం - స‌గం ఆంధ్రోళ్ల‌తో నిండిపోయిన మ‌హాన‌గ‌రం హైద‌రాబాద్‌ ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) మా.. హైద‌రాబాద్‌.. ! మ‌న హైద‌రాబాద్‌!! ఇక‌పై మీ హైదరాబాద్‌..!! - ఇదీ ఇత‌మిత్థంగా భాగ్య‌న‌గ‌రం మ‌రి కొన్ని రోజుల్లో మార‌నున్న ప్ర‌క్రియ‌. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విధంగా ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఈ ఏడాది జూన్ 2వ‌ర‌కు మాత్ర‌మే హైద‌రాబాద్ ఏపీతో క‌లిసి ఉంటుంది. త‌ర్వాత‌.. అది తెలంగాణ‌కే ప‌రిAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; ap; map; Hyderabad {#}Amaravathi;Andhra Pradesh;June;Indiaఏపీ ప్ర‌జ‌ల హృద‌యాల నుంచి హైద‌రాబాద్ క‌నెక్టా... డిస్ క‌నెక్టా...?ఏపీ ప్ర‌జ‌ల హృద‌యాల నుంచి హైద‌రాబాద్ క‌నెక్టా... డిస్ క‌నెక్టా...?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; ap; map; Hyderabad {#}Amaravathi;Andhra Pradesh;June;IndiaSat, 01 Jun 2024 07:59:12 GMT- చారిత్ర‌క న‌గ‌రంతో ఎప్ప‌ట‌కీ తెగ‌ని బంధం ఆంధ్రోడిది
- ఇరానీ చాయ్ రుచులు.. బిర్యానీ టేస్టు, పాత‌బ‌స్తీ ముచ్చ‌ట్లు మ‌ర్చిపోలేం
- స‌గం ఆంధ్రోళ్ల‌తో నిండిపోయిన మ‌హాన‌గ‌రం హైద‌రాబాద్‌

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

మా.. హైద‌రాబాద్‌.. !  మ‌న హైద‌రాబాద్‌!!  ఇక‌పై మీ హైదరాబాద్‌..!! - ఇదీ ఇత‌మిత్థంగా భాగ్య‌న‌గ‌రం మ‌రి కొన్ని రోజుల్లో మార‌నున్న ప్ర‌క్రియ‌. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విధంగా ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఈ ఏడాది జూన్ 2వ‌ర‌కు మాత్ర‌మే హైద‌రాబాద్ ఏపీతో క‌లిసి ఉంటుంది. త‌ర్వాత‌.. అది తెలంగాణ‌కే ప‌రిమితం అవ‌తుంది. అయితే.. చారిత్ర‌క నేప‌థ్యాన్ని చూసుకుంటే.. మాత్రం ఏపీ ప్ర‌జ‌ల‌తో హైద‌రాబాద్ పెన‌వేసు కున్న బంధం అంతా ఇంతా  కాదు.


ఉమ్మ‌డి ఏపీలో రాజ‌ధానిగా ఉన్న హైద‌రాబాద్‌.. అంటే.. ఏపీ ప్ర‌జ‌ల‌కు ఒక దిక్సూచి. విద్య‌, వ్యాపారాలు. కుటుంబాల స్థిర‌త్వం.. అక్క‌డి చారిత్ర‌క క‌ట్ట‌డాలు.. ఇలా ... అనేక విష‌యాల‌తో ఏపీ ప్ర‌జ‌ల‌కు చారిత్ర‌క అనుబంధం ఉంది. చార్మినార్‌, గోల్కొండ‌లు.. ఉస్మానియా యూనివ‌ర్సిటీ, భ‌ద్రాచ‌లం, యాద‌గిరి గుట్ట వంటి అనేక క‌ట్ట‌డాలు, ప‌ర్యాట‌క ప్రాంతాలు, ఆధ్యాత్మిక న‌గ‌రాల‌తో ఏపీ ప్ర‌జ‌ల‌కు ఉన్న అనుబంధం అంతా ఇంతా కాద‌నే చెప్పలి. అయితే.. దీనికి జూన్ 2తో తెర‌ప‌డ‌నుంది.


అయితే.. ఆ బంధం ఇక‌పైనా కొన‌సాగుతుందా ? అంటే.. ఖ‌చ్చితంగా కొన‌సాగుతుంద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీలో భాగ్య‌న‌గ‌రాన్ని త‌ల‌ద‌న్నే న‌గ‌రం ఏర్ప‌డినా.. రాజ‌ధాని నిర్మించినా.. హైద‌రాబాద్‌కు ఉన్న చ‌రిత్ర‌, దానితో ఏర్ప‌రుచుకున్న బంధం.. వంటివి మాత్రం చిర‌స్థాయిగా కొన‌సాగుతాయ‌న‌డంలో సందేహం లేదు. హైద‌రాబాద్ ఇరానీ చాయ్ రుచులు.. బిర్యానీ టేస్టు, హైద‌రాబాద్ పాత‌బ‌స్తీ ముచ్చ‌ట్లు, ముత్యాల మురిపాలు.. మ‌ల్లె  పూల సోయ‌గాలు.. వంటివి ఎప్ప‌టికీ ఏపీ ప్ర‌జ‌లు మ‌రిచిపోలేనంత బంధం పెంచాయి.


హైద‌రాబాద్ ఒక రాజ‌ధాని న‌గ‌ర‌మే అయినా.. ఇంత‌కు మించిన ప‌ర్యాట‌క ప్రాంతంగా ఏపీ ప్ర‌జ‌ల‌తో ముడి వేసుకుంది. ఇప్ప‌టికీ ఏపీ నుంచి విద్యార్థుల‌కు సెల‌వులు వ‌చ్చినా.. ఇత‌ర కార్య‌క్ర‌మాలు అయినా.. హైద రాబాద్‌కు ప‌రుగులు తీసే ప్ర‌జలు ఎక్కువ‌గానే ఉన్నారు. ఇక్క‌డి యాస‌, ఇక్క‌డి ఆహార్యం.. క‌ర‌కు త‌నం.. కొంటెతనం.. వంటివి ఏపీ ప్ర‌జ‌లు మురిసేలా చేశాయి. ఇప్ప‌టికీ బోనాలు అంటే.. ఏపీ ప్ర‌జ‌లు కూడా పాల్గొనే పండుగే. సో.. ఎలా చూసుకున్నా.. ఈ చారిత్ర‌క న‌గ‌రాన్ని.. ఏపీ ప్ర‌జ‌లు మ‌రిన్ని ద‌శాబ్దాల పాటు త‌మ హృద‌యాల్లో ప‌దిలంగానే ఉంచుకుంటార‌నే విష‌యం సుస్ప‌ష్టం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>