MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgగత కొన్ని నెలలుగా క్షణం తీరికలేని రాజకీయాలను నడిపిన పవన్ వచ్చేవారం వెలువడబోతున్న ఎన్నికల ఫలితాల గురించి ఆశక్తిగా ఎదురు చూస్తున్నాడు. అంచనాలకు అనుగుణంగా తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అధికారంలోకి వస్తే పవన్ మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తాడా లేదంటే కేవలం పరోక్ష మద్ధతుతో తన రాజకీయాలను కొనసాగిస్తాడా అన్న ఆశక్తి చాలమందిలో ఉంది. అయితే ఇప్పటికే పవన్ ఒప్పుకుని షూటింగ్ దశలో ఉన్న మూడు సినిమాలను ఎట్టి పరిస్థితిత్తులలోనూ పూర్తి చేసి తీరాలి. వాస్తవానికి పవన్ సుజిత్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘ఓజీ’ మూPAVANKALYAN{#}harish shankar;A M Rathnam;Kshanam;sujeeth;september;News;Telugu Desam Party;Elections;Bharatiya Janata Party;Cinema;Yevaruపవన్ లైన్ అప్ లో ఊహించని ట్విస్ట్ !పవన్ లైన్ అప్ లో ఊహించని ట్విస్ట్ !PAVANKALYAN{#}harish shankar;A M Rathnam;Kshanam;sujeeth;september;News;Telugu Desam Party;Elections;Bharatiya Janata Party;Cinema;YevaruSat, 01 Jun 2024 09:00:00 GMTగత కొన్ని నెలలుగా క్షణం తీరికలేని రాజకీయాలను నడిపిన పవన్ వచ్చేవారం వెలువడబోతున్న ఎన్నికల ఫలితాల గురించి ఆశక్తిగా ఎదురు చూస్తున్నాడు. అంచనాలకు అనుగుణంగా తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అధికారంలోకి వస్తే పవన్ మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తాడా లేదంటే కేవలం పరోక్ష మద్ధతుతో తన రాజకీయాలను కొనసాగిస్తాడా అన్న ఆశక్తి చాలమందిలో ఉంది.



అయితే ఇప్పటికే పవన్ ఒప్పుకుని షూటింగ్ దశలో ఉన్న మూడు సినిమాలను ఎట్టి పరిస్థితిత్తులలోనూ పూర్తి చేసి తీరాలి. వాస్తవానికి పవన్ సుజిత్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘ఓజీ’ మూవీ కోసం ఇక కేవలం 20 రోజులు పవన్ తన డేట్స్ ను కేటాయిస్తే ఆమూవీ అనుకున్న విధంగా సెప్టెంబర్ లో విడుదల అయిపోతుంది. దీనితో అందరు పవన్ తన సినిమాల లిస్టులో ‘ఓజీ’ ని పూర్తి చేస్తాడు అని అనుకున్నారు.



ఎవరు ఊహించని విధంగా ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’ ముందుకు వచ్చింది అని అంటున్నారు. ఎన్నికలు అయిపోయిన తరువాత పవన్ తనను కలిసిన క్రిష్ ఏఎమ్ రత్నం లతో జూలై నుండి తాను షూటింగ్ లకు వస్తానని ‘హరి హర వీరమల్లు’ కు సంబంధించిన తన షూటింగ్ పార్ట్ ను వేగంగా పూర్తి అయ్యేలా యాక్షన్ ప్లాన్ డిజైన్ చేసుకోమని పవన్ వారితో చెప్పినట్లు సమాచారం.



దీనితో పవన్ చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ‘ఓజీ’ ని ఎందుకు పక్కకు పెట్టి ‘హరి హర వీరమల్లు’ కు ప్రేయార్టీ ఇస్తున్నాడు అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు. దీనికితోడు ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పరిస్థితి ఏమిటి అంటూ మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ నెలకు 10 రోజులు చొప్పున సినిమా షూటింగ్ లకు తన సమయం కేటాయించి మిగిలిన సమయాన్ని పూర్తిగా రాజకీయాల వైపు కేటాయిస్తాడు అంటూ మాటలు వినిపిస్తున్నాయి..  












మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>