PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan-janasena-tdp-kutami-pithapuram-vanga-geeta-8e8735ab-de8f-4952-bd44-ca4d6cbe8ea9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan-janasena-tdp-kutami-pithapuram-vanga-geeta-8e8735ab-de8f-4952-bd44-ca4d6cbe8ea9-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఫేమస్ రాజకీయ నాయకులలో చంద్రబాబు జగన్ మాత్రమే ఉండేవారు. ఈసారి వారి స్థాయికి చేరుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయన జనసేన పార్టీ స్థాపించి ఇప్పటికే రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేశారు. కానీ ఆయన బోని కొట్టలేకపోయారు. రెండుసార్లు ఓటమి పాలైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా గెలవాలని కంకణం కట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రణాళిక ఏర్పాటు చేసుకొని సినిమాలను వదిలి, కుటుంబాన్ని విడిచిపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పెనవేసుకొని ప్రచారం నిర్వహించారు.PAWAN KALYAN;JANASENA;TDP KUTAMI;PITHAPURAM;VANGA GEETA;{#}Boney Kapoor;Nadendla Manohar;Tenali;Pawan Kalyan;pithapuram;kalyan;CBN;June;Janasena;Andhra Pradesh;Assemblyజనసేన గెలిచే సీట్లు: పవన్ మెజారిటీ లెక్కలివే..?జనసేన గెలిచే సీట్లు: పవన్ మెజారిటీ లెక్కలివే..?PAWAN KALYAN;JANASENA;TDP KUTAMI;PITHAPURAM;VANGA GEETA;{#}Boney Kapoor;Nadendla Manohar;Tenali;Pawan Kalyan;pithapuram;kalyan;CBN;June;Janasena;Andhra Pradesh;AssemblySat, 01 Jun 2024 20:03:27 GMTఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఫేమస్ రాజకీయ నాయకులలో చంద్రబాబు జగన్  మాత్రమే ఉండేవారు. ఈసారి వారి స్థాయికి చేరుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయన జనసేన పార్టీ స్థాపించి ఇప్పటికే రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేశారు. కానీ ఆయన బోని కొట్టలేకపోయారు.  రెండుసార్లు ఓటమి పాలైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఈసారి ఎలాగైనా గెలవాలని కంకణం కట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రణాళిక ఏర్పాటు చేసుకొని సినిమాలను వదిలి, కుటుంబాన్ని విడిచిపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పెనవేసుకొని ప్రచారం నిర్వహించారు.

 ఈసారి ఎలాగైనా గెలిచి చూపిస్తానని, నేను గెలవడమే కాదు  జనసేనలో కూడా చాలా సీట్లను గెలిపిస్తానని శపథం చేశారు.  ఆయన చెప్పినట్లుగానే ఈసారి జనసేన 13-14కు పైగా సీట్లలో బోనీ కొట్టేటట్టు కనిపిస్తోంది . దీన్ని బట్టి చూస్తే మాత్రం భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఆయన పిఠాపురం విషయానికి వస్తే ఈసారి వంగ గీతపై అన్ని అస్త్రాలు సందించారు. ఎలాగైనా పిఠాపురంలో గెలిచి మెజారిటీ సాధించాలనే  ఆలోచనతో చాలా కష్టపడ్డారు. ప్రతిక్షణం ప్రజలతో ఉంటూ  ప్రజా సమస్యలపై ఆరా తీస్తూ ప్రచారం నిర్వహించారు.

 గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తానో కూడా చెప్పారు. అలాంటి పవన్ కళ్యాణ్ కు ఈసారి పిఠాపురంలో ఎంత మెజారిటీ రాబోతోంది. ఆయన జనసేన ఎన్ని సీట్లతో బోనీ కొట్టబోతోంది అనేది  చాలా ఆసక్తికరంగా మారింది. ఆరామస్తాన్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం  జనసేన పోటీ చేసిన రెండు లోక్సభ సీట్లను కైవసం చేసుకోబోతుందని వెల్లడించారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ కూడా గెలుస్తారని తెలియజేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్  భారీ మెజారిటీతో గెలుస్తారని  అన్నారు.  అంతేకాకుండా ఈసారి జనసేన రాష్ట్ర వ్యాప్తంగా 13 నుంచి 14 అసెంబ్లీ సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని ఆయన బాహాటంగానే చెప్పారు. చూడాలి ఆయన చెప్పింది నిజమవుతుందా లేదా అనేది జూన్ 4న తేటతెల్లమవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>