PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/is-kadapa-district-a-stronghold-for-jagand2596caf-b338-46bd-a1d5-98708309bdc3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/is-kadapa-district-a-stronghold-for-jagand2596caf-b338-46bd-a1d5-98708309bdc3-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంపీ స్థానాల్లో సైతం ఫ్యాన్ ప్రభంజనం కొనసాగింది. మెజారిటీ ఎంపీ సీట్లలో ఫ్యాన్స్ ఏకంగా 5 స్పీడ్ లో గిర్రున తిరిగేస్తోంది. ఆరా మస్తాన్ సర్వే లెక్కల ప్రకారం వైసీపీ రాష్ట్రంలో 13 నుంచి 15 స్థానాల్లో విజయం సాధించనుంది. గతంతో పోల్చి చూస్తే వైసీపీకి సీట్ల సంఖ్య తగ్గినా మెజారిటీ ఎంపీ స్థానాల్లో వైసీపీకే అనుకూల ఫలితాలు రానున్నాయి. ఆరా మస్తాన్ సర్వే లెక్కల ప్రకారం కూటమికి 10 నుంచి 12 స్థానాలు రానున్నాయి. ycp{#}MP;YCP;Assembly;Surveyఏపీ ఎంపీ సీట్ల‌లోనూ 5 స్పీడ్‌లో గిర్రున తిరిగేసిన ఫ్యాన్‌... వైసీపీ ఫ్యాన్స్‌ను ఆప‌లేంగా..?ఏపీ ఎంపీ సీట్ల‌లోనూ 5 స్పీడ్‌లో గిర్రున తిరిగేసిన ఫ్యాన్‌... వైసీపీ ఫ్యాన్స్‌ను ఆప‌లేంగా..?ycp{#}MP;YCP;Assembly;SurveySat, 01 Jun 2024 20:20:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంపీ స్థానాల్లో సైతం ఫ్యాన్ ప్రభంజనం కొనసాగింది. మెజారిటీ ఎంపీ సీట్లలో ఫ్యాన్స్ ఏకంగా 5 స్పీడ్ లో గిర్రున తిరిగేస్తోంది. ఆరా మస్తాన్ సర్వే లెక్కల ప్రకారం వైసీపీ రాష్ట్రంలో 13 నుంచి 15 స్థానాల్లో విజయం సాధించనుంది. గతంతో పోల్చి చూస్తే వైసీపీకి సీట్ల సంఖ్య తగ్గినా మెజారిటీ ఎంపీ స్థానాల్లో వైసీపీకే అనుకూల ఫలితాలు రానున్నాయి. ఆరా మస్తాన్ సర్వే లెక్కల ప్రకారం కూటమికి 10 నుంచి 12 స్థానాలు రానున్నాయి.
 
ఆత్మసాక్షి సంస్థ మాత్రం రాష్ట్రంలో 17 స్థానాలతో వైసీపీకి విజయం దక్కనుందని చెబుతోంది. కూటమి మాత్రం రాష్ట్రంలో కేవలం 8 స్థానాలలో అనుకూల ఫలితాలను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఆత్మసాక్షి సర్వే ఫలితాల లెక్కలు గతంలో మెజారిటీ సందర్భాల్లో నిజమయ్యాయి. రేస్ సంస్థ సైతం రాష్ట్రంలో వైసీపీ 19 స్థానాల్లో అనుకూల ఫలితాలను సొంతం చేసుకుంటుందని చెబుతోంది.
 
19 స్థానాల్లో విజయం సాధించడం సులువైన విషయం కాకపోయినా గతంలో 22 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీకి ఇన్ని స్థానాల్లో విజయం సాధించడం మరీ కష్టమైతే కాదు. కూటమికి మాత్రం కేవలం 6 స్థానాల్లో అనుకూల ఫలితాలు వస్తాయని ఈ సర్వే పేర్కొంది. టైమ్స్ నవ్ సంస్థ లెక్కల ప్రకారం మాత్రం ఏపీలో వైసీపీ 14 స్థానాల్లో గెలవనుండగా కూటమికి 11 స్థానాల్లో విజయం దక్కనుంది.
 
ప్రముఖ సర్వేల సంస్థలు ఎంపీల లెక్క విషయంలో వైసీపీదే పైచేయి అని చెబుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో ఎంపీ స్థానాలు వైసీపీకి ఫేవర్ గా ఉన్నాయంటే అసెంబ్లీ స్థానాల విషయంలో సైతం అదే జరగనుంది. వైసీపీ నెత్తిన పాలు పోసే విధంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. వైసీపీ నేతలకు ఫలితాలకు ముందే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో సంబరాలు మొదలయ్యాయి. ఈ ఫలితాలను చూస్తే వైసీపీ ఫ్యాన్స్ జోరును ఆపలేమని విశ్లేషకులు చెబుతున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>