PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kr-vrcb5020d5-1630-48e8-ae78-d52e8180c978-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kr-vrcb5020d5-1630-48e8-ae78-d52e8180c978-415x250-IndiaHerald.jpgతెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతలలో కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఒకరు. ఇకపోతే కొంత కాలం క్రితం తెలంగాణ రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసినంత మెజారిటీ స్థానాలు వచ్చాయి. దానితో వీరు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడడంతో ఈయన కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక వ్యక్తి కావడంతో ఈయనకు మంత్రి పదవి కూడా kr vr{#}Komati;SoniaGandhi;December;Minister;Interview;media;Telangana;Government;Reddy;Congress;Party;MP;Parliment;Assembly;Juneఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీనే ఉండదు... కోమటిరెడ్డి..!ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీనే ఉండదు... కోమటిరెడ్డి..!kr vr{#}Komati;SoniaGandhi;December;Minister;Interview;media;Telangana;Government;Reddy;Congress;Party;MP;Parliment;Assembly;JuneSat, 01 Jun 2024 21:00:00 GMTతెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతలలో కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఒకరు. ఇకపోతే కొంత కాలం క్రితం తెలంగాణ రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసినంత మెజారిటీ స్థానాలు వచ్చాయి. దానితో వీరు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడడంతో ఈయన కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక వ్యక్తి కావడంతో ఈయనకు మంత్రి పదవి కూడా దక్కింది.

ఇది ఇలా ఉంటే మే 13 వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ ఎన్నికలలో భారీ మొత్తంలో ఎంపీ స్థానాలను దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన కృషి చేసింది. ఇకపోతే తాజాగా కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కోమటి రెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ ... తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 9 నుండి 12 వరకు  లోక్సభ సీట్లు వస్తాయి అని ఈయన చెప్పారు. అలాగే వచ్చే పదేళ్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  

నెల 4 వ తేదీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నే ఉండదు అని ఆయన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. సోనియా పై విమర్శలు చేసిన కేసిఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పనున్నారు అని ఈయన అన్నారు. అలాగే రాష్ట్ర చిహ్నంపై బీఆర్ఎస్ నేతలు అనవసరమైన వివాదం చేస్తున్నారు అని ఈయన చెప్పుకొచ్చారు. ఇకపోతే తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని లోక్సభ స్థానాలు దక్కుతాయి అనేది తెలియాలి అంటే రిజల్ట్ డే అయినటువంటి జూన్ 4 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>