Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap5bfc87d8-243d-4832-8907-c9d2b69d9915-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap5bfc87d8-243d-4832-8907-c9d2b69d9915-415x250-IndiaHerald.jpgఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు. ఎవరు ప్రతిపక్షంలో కూర్చుంటారు అనే విషయంపై తీవ్ర స్థాయిలో ఉత్కంఠ ఉంది. అయితే ఎవరికి వారు గెలుపు తమదే అని ధీమాతో ఉన్నప్పటికీ.. ఓటర్లు తమ భవితవ్యాన్ని ఎలా నిర్ణయించారు అనే విషయంపై మాత్రం అందరిలో టెన్షన్ కూడా లేకపోలేదు. ఈ క్రమంలోనే జూన్ 4వ తేదీన విడుదల కాబోయే ఫలితాల గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలలో ఏం తేలబోతుంది అనే విషయంపై కూడా ఉత్కంఠ నెలకొంది అని చెప్పాలి. ఒకరకంగా ఫలితాలు ఎవరికీ అనుకూలంగా రాబోతున్నాయ్ అనే విషయంపై టెన్Ap{#}East;Uttarandhra;war;Rayalaseema;Guntur;Yevaru;Andhra Pradesh;June;Party;TDP;YCPఆ '33'.. ఏపీ పీఠాన్ని నిర్ణయించబోతున్నాయ్?ఆ '33'.. ఏపీ పీఠాన్ని నిర్ణయించబోతున్నాయ్?Ap{#}East;Uttarandhra;war;Rayalaseema;Guntur;Yevaru;Andhra Pradesh;June;Party;TDP;YCPSat, 01 Jun 2024 07:22:00 GMTఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు. ఎవరు ప్రతిపక్షంలో కూర్చుంటారు అనే విషయంపై తీవ్ర స్థాయిలో ఉత్కంఠ ఉంది. అయితే ఎవరికి వారు గెలుపు తమదే అని ధీమాతో ఉన్నప్పటికీ.. ఓటర్లు తమ భవితవ్యాన్ని ఎలా నిర్ణయించారు అనే విషయంపై మాత్రం అందరిలో టెన్షన్ కూడా లేకపోలేదు. ఈ క్రమంలోనే జూన్ 4వ తేదీన విడుదల కాబోయే ఫలితాల గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలలో ఏం తేలబోతుంది అనే విషయంపై కూడా ఉత్కంఠ నెలకొంది అని చెప్పాలి.


 ఒకరకంగా ఫలితాలు ఎవరికీ అనుకూలంగా రాబోతున్నాయ్ అనే విషయంపై టెన్షన్ తో పార్టీ అభ్యర్థులకు ఎవరికీ నిద్ర పట్టడం లేదట. ఇలాంటి సమయంలో ఇక ఎన్నో రాజకీయ సమీకరణాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ప్రాంతాలవారీగా చూసుకుంటూ ఎవరికైనా 33 సీట్లు చాలా సంక్లిష్టంగా మారిపోయాయి. ఆయా స్థానాల్లో విజయం దక్కించుకున్న వారు అధికారం చేపట్టేందుకు అవకాశం ఉంటుందని రాజకీయ నిపుణులు కూడా ఒక అంచనా వేస్తున్నారు. సీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మొత్తం 33 స్థానాలలో అత్యంత టఫ్ ఫైట్ జరగబోతుందట.


 అంతేకాదు మరో 62 స్థానాలలో కూడా కూటమి అధికార వైసిపి మధ్య ఇలాగే తీవ్రమైన పోటీ ఉండబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే వైసిపి ఏకపక్షంగా గెలుచుకునే ఎక్కువ సీట్లు సీమలోనే ఉన్నాయని రాజకీయ నిపుణులు అంచనా. ఇక టిడిపి కూటమి వార్ వన్ సైడ్ అన్నట్లుగా గెలుచుకునే సీట్లు తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలు సహా ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఉన్నాయట. మరోవైపు ప్రకాశంలో కూటమి క్లీన్ స్వీట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. దీంతో టఫ్ ఫైట్ ఉన్న ఆ 33 స్థానాల్లో మెజారిటీ సీట్లు దక్కించుకునే వారే అధికారం చేపట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా. వీటిలో ఉత్తరాంధ్ర నుంచి సీమ వరకు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో కూటమి వర్సెస్ వైసీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక పోటీ చేసిన వారందరూ కూడా బలమైన నాయకులే. అయితే అక్కడి 33 నుంచి 40 నియోజకవర్గాలు ఎవరు గెలుస్తారనే విషయాన్ని విశ్లేషకులు కూడా పసిగట్టలేకపోతున్నారు. ఇలా ఎన్ని సర్వేలు జరిగిన.. ఎంత మంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేసిన ఇక ఎవరు గెలుస్తారనే పక్కా అంచనాలు మాత్రం రావడం లేదు. ఆ 33 నియోజకవర్గాల్లో గెలిచే వారికే ఏపీ పీఠం దక్కుతుందని అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>