PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/exit-pollseb99ba96-3ae0-43ac-bbc8-d78368c19316-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/exit-pollseb99ba96-3ae0-43ac-bbc8-d78368c19316-415x250-IndiaHerald.jpgనేడు విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో ఏవి కూడా వాస్తవానికి దగ్గరగా లేవని చాలా అభిప్రాయపడుతున్నారు. కేకే సర్వే చూసుకుంటే టీడీపీ 161 సీట్లు గెలుచుకుంటుందని, వైసీపీకి 14 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పింది. నిజానికి ఇందులో 6 సీట్లు మాత్రమే కన్ఫామ్ అని మిగతా ఎనిమిది సీట్లలో టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పింది. ఇక ఎంపీ స్థానాల విషయానికొస్తే టీడీపీ 25, వైసీపీ 0 అని తెలిపింది. వైసీపీ చాలా బలమైన పార్టీ, అది 0 స్థానాలకే పరిమితం అవుతుంది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. టీడీపీ 161 సీట్లు గెలిచే అంత ఏం చేసింది ? జనసేన పోటీ చేసినexit polls{#}MP;Assembly;Bharatiya Janata Party;Janasena;June;television;TDP;YCP;Surveyఇవేం దిక్కుమాలిన ఎగ్జిట్ పోల్స్.. రియాలిటీకి అస్సలు దగ్గరగా లేవే..??ఇవేం దిక్కుమాలిన ఎగ్జిట్ పోల్స్.. రియాలిటీకి అస్సలు దగ్గరగా లేవే..??exit polls{#}MP;Assembly;Bharatiya Janata Party;Janasena;June;television;TDP;YCP;SurveySat, 01 Jun 2024 22:26:13 GMTనేడు విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో ఏవి కూడా వాస్తవానికి దగ్గరగా లేవని చాలా అభిప్రాయపడుతున్నారు. కేకే సర్వే చూసుకుంటే టీడీపీ 161 సీట్లు గెలుచుకుంటుందని, వైసీపీకి 14 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పింది. నిజానికి ఇందులో 6 సీట్లు మాత్రమే కన్ఫామ్ అని మిగతా ఎనిమిది సీట్లలో టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పింది. ఇక ఎంపీ స్థానాల విషయానికొస్తే టీడీపీ 25, వైసీపీ 0 అని తెలిపింది. వైసీపీ చాలా బలమైన పార్టీ, అది 0 స్థానాలకే పరిమితం అవుతుంది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. టీడీపీ 161 సీట్లు గెలిచే అంత ఏం చేసింది ? జనసేన పోటీ చేసిన ప్రతి చోటల్లా ఎలా గెలుస్తుంది? అని చాలామంది ఈ సర్వే విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు.

ఇదొక్క సర్వే మాత్రమే కాదు మిగతా సర్వేలు కూడా, జాతీయ స్థాయి సర్వేలు కూడా ఏకపక్షంగా ఫలితాలను వెల్లడించాయి. ఓ సర్వే ప్రకారం తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ స్థానాలను గెలుచుకోనుంది. అసలు బీజేపీ పార్టీ తెలంగాణలో చాలా వీక్. అన్ని సీట్స్ అది ఎలా విన్ అవుతుంది అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇక మోస్ట్ ట్రస్ట్రబుల్ ఆరా మస్తాన్ కూడా ఒక్కో టీవీ ఛానల్ లో ఒక్కో పూర్తి షేర్ చెబుతూ అందరికీ షాక్ ఇచ్చాడు. 94-104 అసెంబ్లీ స్థానాలు వైసీపీ గెలుచుకోవచ్చని అంటూనే ఓటు షేరింగ్ గురించి ఆయన చెప్పిన అంచనాలు లాజిక్కి చాలా దూరంగా ఉన్నాయి.

ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ కూడా నమ్మడానికి కష్టంగానే అనిపించాలి ఈసారి ఒక్క ఎగ్జిట్ పోల్ సర్వే కూడా నమ్మేదాకా లేదంటే అతిశయోక్తి కాదు. జెన్యూన్ గా కాకుండా ఎవరికి నచ్చినట్లు వారు, ఎవరినో సాటిస్ఫై చేయాలన్నట్లు ఈ ఫలితాలను ప్రకటించేశారు. చాలామంది ప్రజల అభిప్రాయాలు ప్రకారం, ఇవాల్టితో  ఎగ్జిట్ పోల్స్ పై నమ్మకమే పోయింది. జూన్ 4వ తేదీన ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమవుతాయి అనేది తెలుస్తుంది. ఆ తర్వాత ఇవి వేసిన అంచనాలన్నీ తప్పయితే భవిష్యత్తులో వీటిని ఎవరూ కూడా పరిగణలోకి తీసుకోకపోవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>