PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-ycpc4d7063d-1cb0-4939-89a8-2fa54a911990-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-ycpc4d7063d-1cb0-4939-89a8-2fa54a911990-415x250-IndiaHerald.jpgఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 151కు పైగా సీట్లు గెలిచేస్తాం అని జగన్ ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, జూన్ 9న వైజాగ్‌లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేయడానికి సిద్ధమయ్యారు. ఇక సంబరాలే తక్కువ అన్నట్లుగా ప్రవర్తించారు. కానీ నేడు వైసీపీకి ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఫస్ట్ నుంచి వైసీపీ చాలా హడావుడి చేసింది. jagan ycp{#}central government;High court;Indian Postal Service;Jagan;Yevaru;court;Assembly;June;Election Commission;TDP;YCPచాలా హడావుడి చేసిన వైసీపీకి భారీ బిగ్ షాక్..??చాలా హడావుడి చేసిన వైసీపీకి భారీ బిగ్ షాక్..??jagan ycp{#}central government;High court;Indian Postal Service;Jagan;Yevaru;court;Assembly;June;Election Commission;TDP;YCPSat, 01 Jun 2024 22:02:00 GMTఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 151కు పైగా సీట్లు గెలిచేస్తాం అని జగన్ ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, జూన్ 9న వైజాగ్‌లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేయడానికి సిద్ధమయ్యారు. ఇక సంబరాలే తక్కువ అన్నట్లుగా ప్రవర్తించారు. కానీ నేడు వైసీపీకి ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఫస్ట్ నుంచి వైసీపీ చాలా హడావుడి చేసింది.

సాధారణంగా పోస్టల్ బ్యాలెట్‌ డిక్లరేషన్‌కు సంబంధించి ఫాం-13ఏ ఉంటుంది. దీనిపై అటెస్టింగ్‌ ఆఫీసర్ సైన్ ఉండాలని, ఆయన పొజిషన్‌, డీటైల్స్ పేర్కొనాలి అని ఒక రూల్ ఉంటుంది. ఆ ఫాం-13ఏపై ఈ డీటైల్స్ అన్నీ ఉంటేనే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వ్యాలీడ్ అవుతుందని అంటారు. అయితే ఇవేమి ఇకపై అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా స్పష్టత ఇచ్చింది. ఎవరి సైన్ తీసుకోవాల్సిన అవసరం లేదంటూ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను వైసీపీ పార్టీ హైకోర్టులో సవాల్‌ చేసింది. ఇలా ఈసీ పై జగన్ పార్టీ కోర్టు మెట్లు ఎక్కి కొద్ది రోజులు గడిచిపోయింది.

అయితే తాజాగా వైసీపీ దాఖలు చేసిన ఆ పిటిషన్‌ను హైకోర్టు సింపుల్‌గా కొట్టేసింది. అంతేకాదు, పోస్టల్ బ్యాలెట్‌పై సీలు లేకపోయినా దానిని కౌంట్‌ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సీలు గురించి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన వివరణతో కోర్టు ఏకీభవించింది. అలానే వైసీపీ పిటిషన్‌ను కొట్టేయడంతో వైసీపీకి ఝలక్ తగిలినట్టు అయింది.

ఇకపోతే ఈరోజు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. వీటిలో వైసీపీ గెలుస్తుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పగా, మరికొన్ని టీడీపీ 161 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలు గెలుచుకుంటుందని చెప్పాయి. జూన్ 4న ఎవరు గెలుస్తారని నిజంగా తెలుస్తోంది. ఈ ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి చాలా దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది చాలామంది కామెంట్లు చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>